ఇరవై ఏడవ పాశురం
****************
కూడారై వెల్లుం శీర్ గోవిందా! ఉందన్నై
ప్పాడిపరై కొండు యుం పెరు శెమ్మానం
నాడు పుగుళుం పరిశినాల్ నన్రాగ
శూడగమే తోళ్వళైయే తోడే శెవిపూవే
పాడగమే ఎన్రనైయ పల్కలనుం యాం అణివోం
ఆడై ఉడుప్పోం ; అదన్ పిన్నే పార్చోరు
మూడ,నెయ్ పెయ్దు ముళంగై వళివార
కూడి ఇరుందు కుళిరుందు ఏలోరెంబావాయ్!
దశేంద్రియ జ్ఞానమా
******************
ధన్యతనొందితివమ్మా-దాసోహమ్మనుచు నీవు
స్వామి గుణగణములను స్వచ్చమైన పాలలొ-శోర్
సపరిచర్యలను బియ్యమును వేసినావు
సాంగత్యమును కోరు తపన అనే అగ్నినుంచి,
పరమార్థము అనే పవిత్ర పరమాన్నము వండినావు
మాధవుని మమత యందు మధురమై కలిసినది
సాఫల్య సుకృతమే గోఘృతమై నిండినది
మోచేతి వరకు జారి మోక్షముగా పండినది
సరసనుండి స్వామితో పరమానందభరితమను
పరమాన్నమును పంచుకుంటు పరవశిస్తున్నది
******************
స్వామి కరుణ సారూప్య-సామీప్య-సాంగత్యములను దాటి
స్వస్వరూపులుగా వారిని సాలంకృతులను చేసినది.
శీర్ గోవింద-శ్రీ కృష్ణా, నీవు
కూడారై-శత్రువులను,
వెల్లుం-జయించినవాడవు, అని కీర్తిస్తున్నారు. స్వామిని, ఇంద్రియములను శత్రువులను జయించిన గోపికలు.
ఎవరా కూడారై? వారెలా? ఎన్నివిధములుగా ఉంటారో కూడ చెబుతున్నది గోదమ్మ.
కూడని వారు.భగవత్ తత్త్వమును చేరని వారు.వారిని మనము అనుకూలురు- ప్రతికూలురు- తటస్థులు గాను అనుకోవచ్చును.
ఈ ప్రతికూలురు మూడు విధములుగా నుందురు.
1. అహంకారముతో భగవంతుని యందు ప్రతికూలతను కలిగియుందురు.స్వామి తన పౌరుషమును ప్రయోగించి వారిని సంస్కరించును.శిశుపాలుడు.
2. మరి కొందరు అనుకూలురే అయినప్పటికిని స్వామి, దర్శనమునీయ
జాప్యముచేయుచు, తమను బాధపెట్టుచున్నాడని ప్రణయరోషముతో తాత్కాలిక ప్రతికూలతను ప్రదర్శించుచుందురు.స్వామి వారిని తన శృంగార చేష్టలచే సంతోషపరచి సంస్కరించుచుండును
.
3. మరికొందరు తాము స్వామికంటె అన్ని విధములుగా తక్కువ వారమను న్యూనతాభావంతో స్వామిని కూడుటకు ఇష్టపడరు.స్వామి వారి దరిచేరి అనునయించి,సరస సంభాషణములను జరిపి సామీప్యము ప్రసాదించి సంస్కరిస్తాడు.కనుక స్వామి కూడని వారినెల్లను కూడి,ప్రతి భక్తుని ఆరగింపుని-మరొక భక్తుని జిహ్వ ద్వార రుచిచూసి,ఆనందించి-ఆశీర్వదిస్తాడు.
నిను నమ్మిన వారికెన్నటికి నాశములేదు నిక్కము కృష్ణా.!
స్వామి ఉందన్-నీ యొక్క కీర్తిని
పాడి-కీర్తించి
పఱై కొండు-పరమును స్వీకరించుటే
యాం-మాకు
పెరు సమ్మానం-మహా భాగ్యము.
దయా సముద్రా మాకు పఱతో పాటుగా,
శూడగమె-కంకణములు,
తోళ్వళైయే-భుజకీర్తులు
తోడే-కమ్మలు
సెవిపూవే-మాటీలు-చంపస్వరాలు
పాద్డగమె-పాదములకు మంజీరములు
ఇంకా
ఎన్రెనై-ఎన్నెన్నో-బహువిధములైన
పాల్-అసంఖ్యాకములైన
కలనం-ఆభరణములను అనుగ్రహిస్తే,
యాం అణివో-
మేము సుగుణాభరణ భూషితులమై,
ఆడై ఉడుప్పోం
శుభ్రమైన (దేహమనే) వస్త్రమును ధరించి,
ఏంచేస్తారని మమ్ములను అడుగుతావేమో స్వామి,మేము శుధ్ధులము-సుగుణాభరణ భూషితులమైన
అతన్ పిన్రె-తరువాత
పార్-పాలతో
శోర్-బియ్యముతో పరమాన్నమును వండుతాము.అందులో,
మధుర భక్తి యను మధురతను కలుపుతాము.
వీడని వ్యామోహమనే నేతిని,
ముళంగినై-మోచేతి కిందివరకు
వళివార-కారుచుండగా ( నీ అనుగ్రహము నేతివలె మా మోచేతివరకు మమ్ములను వీడక జారుచుండగా)
మనమందరము కలిసి,
కుళిరిందు-సంతోషముతో
కుళిరిందు కూడి ఇరందు-సంతోషముతో మనమొకచోట గుమికూడి పరమానందమనే పరమాన్నమును సేవించుటకు మా నోమునకు వచ్చి మమ్ములను ధన్యులను చేయుము అని,
స్వామిని ప్రార్థించుచున్న-ప్రార్థించుచు పరవశించుచున్న,
నాడ పుగళుం_
ప్రపంచమంత ప్రస్తుతించే,
పరిశెవాల్ నన్రాగ-సుగుణాభరణాలంకృతులైన గోపికలను నడిపించుచున్న గోదమ్మ చేతిని పట్టుకుని మనమును ఆ పరమాన్నమును భుజించుటకు ప్రయత్నిద్దాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment