తిరువెంబావాయ్-11 *****************
ముయ్యార్ తడం పొయిగై పుక్కు ముగేరెన్న
కయ్యార్ కుడైందు కుడైందు ఉన్ కళల్పాడి
అయ్యా వళియడియోం వాల్దోంకణ్ ఆరళల్పోర్
శయ్యా వెణ్ణిరాడి శెల్వ శిరుమరుంగుల్
మయ్యార్ తడంకన్ మడందై మణవాలా
మయ్యా నీలాడ్ కుండేర్ అరులం విడయాట్రిన్
ఉయ్యార్కల్ ఉయ్యాం వగయెల్లాం ఉయందోళిందోం
ఎయ్యామల్ కాప్పై ఎమై ఏలోరెంబావాయ్.
అవ్యాజ కరుణ హృదయాయ పోట్రి
**********************
అయ్య-ఓ స్వామి!
నీ అట్కోడేర్-నీ అవ్యాజమైన కరుణ,
అరుళం-ఆశీర్వాదబలము మాచే,
నీ దయ యను,
ముయ్యర్ తడం-ముదమునందించే మార్గమును,
పొయిగై పుక్కు-సరస్సులోనికి ప్రవేశించి
ముగేర్-మనకలు వేయమని సూచిస్తున్నది.
మునిగి-ప్రవేశించి,స్వామి కరుణను స్వీకరించుటకు,
కయ్యార్-రెండుచేతులు చాచి,
కుడైంద-కేరింతలు కొట్టు అని చెబుతున్నది.
అదియును,
మర్డైంద-మహోత్సాహముతో,
అయ్యా-మేము కేరింతలు కొడుతుంటే ఆ కొలనులోనిజలము తానును గుండ్రముగా సుడులు తిరుగుతు,తెల్లని విబూదిని శరీరమంతా అలుముకున్న స్వామి వలె కనిపిస్తున్నదని,
వెణ్ణిరాడై శెల్వం గా ఉన్నదని స్వామి
కళల్ పాడి-స్వామి రూప కరుణ విశేషములుగా మారినట్లుంది.
అంతే కాదు ఆ సుడులు తిరుగుచున్న జలము మనకు స్వామి,
ఎయ్యామల్ కాప్పై-ఎల్లవేళల రక్షించు స్వామి సర్వరక్షక తన ఘోషతో సంకీర్తిస్తున్నది.
సరసులో మునకలు వేస్తు స్వామి కరుణను పొందుదాము.
అంబే శివ దివ్య తిరువడిగలే శరణం.
No comments:
Post a Comment