Monday, February 8, 2021

tiruvembavay-02



 తిరువెంబావాయ్-02




  ************

 పాశం పరంజోది ఎంబాయ్ ఇరా వకల్నాం

 పేశుం పోదే ఎప్పోదం పోదారమళిక్కే


 నేశముం వైత్తనయో నేరిళై యార్ నేరిళై ఈర్

 చీ చీ ఇవైయూం శిలవో విళైయాడి


 ఏశం ఇదం ఈదో విణ్ణోర్కళ్ ఏత్తుతర్కు

 కూశుం మలర్పాదం తందరుళ వందరుళం


 దేశన్ శివలోకన్ థిల్లై చిట్రంబలకుళ్

 ఈశనార్కు అంబార్ యాం ఆడేలరెంబావాయ్

.



 ఓం చిట్రంబరనే పోట్రి

 *******************


మొదటి పాశురములోని పడుచు తన చెలులు చెవిదానవా  ? అని పరిహాసము చేసినను బదులీయలేదు.బహిర్ముఖము కాలేదు.

 కాని రెండవ పాశురములోని పడుచు చమత్కార సంభాషణా చతురి.కనుకనే,

 ఈ చెలి-తన చెలులతో  తనకు స్వామికి అనుబంధమున్నదని పాశం పరంజోది అనగానే చెలులు నీ పాశము నిదురతోగాని నిటలాక్షునితో కాదన్నారు.మేము కడు భాగ్యశాలులము కనుకనే మేల్కాంచి స్వామి సేవకు నిన్ను తీసుకుని వెళదామని వచ్చామని(నేరిళయార్) అనగానే,తానును భాగ్యశాలిని అని(నేరిళఈర్) అని సమాధానమిచ్చినది.

నిజమునకు ఆమెది తమోనిద్ర కాదుకదా! నిటలాక్షుని ఆశీర్వచన అనుగ్రహము.



 ఓ చెలి,

 యం-నీ-ఆయ్-నా

 ఎంబాయ్-మనందరికి

 ఇరు-రేయి/చీకటి

 వగల్నాం-పగలు/వెలుతురులో

 చీకటి వెలుగులలో/కష్టసుఖములలో

 పాశం-మనకున్న బంధము/మనసంరక్షకుడు



 ఆ

 పరంజోది-ఆ అద్భుత-బృహత్-వర్ణింపశక్యము కాని జ్యోతియే,అని

 ఎప్పోదం-ఎల్లప్పుడు,

పేశుంపోదే-సంకీర్తిస్తు మన అడుగులను కదుపుతుంటే,

  స్వామి దయతో,

 నేరిళైయార్-భాగ్యవంతులమవుతాము స్వామి కరుణను పొంది.

  అనగానే నిదురిస్తున్న బాలిక, మీరేకాదు భాగ్యవంతులు,


  స్వామి సంసేవనాసక్తురాలిని కనుక నానుం-నేనును

,

 నేరిళై ఈర్-నేనును భాగ్యశాలినే,అనగానే వారు,

 నువ్వా! 

శిలలా నిదురిస్తు స్వామిని సేవిస్తున్నానంటున్నావు.ఛీ-ఛీ.నీ సోమరితనమును వదిలి మేము చెప్పే గొప్పవిషయమును విను.


 విణ్ణోర్గళ్ దేవతా సమూహములు (అహంకారముతో)

 తమకుతామే స్వామి పాదపద్మములను పట్టుకుని సేవించుదామని ప్రయత్నించి విఫలులైనారు.ఎవరికిని సులభముగా దొరకని స్వామి పాదములు,అత్యంత తేజోవంతములు-దయా సముద్రములు మన మీది అనురాగముతో,

తందరుళ వందరుళం-తమకు తామె తరలివచ్చినవి.

 ఎక్కడికో తెలుసా?

 తిల్లై చిట్రంబలం-చిదంబరములోని తిల్లై వనములో స్వామి కొలువుతీరి యున్నాడు.

 నీవు మాతో వస్తే మనందరము స్వామి పాదసేవకు తరలుదాము.


  


  మాణిక్యవాచగర్ ఈ పాశురములో చిదంబర నటరాజమూర్తిని మనకు పరిచయము చేస్తున్నారు.కిందటి పాశురములో లోపలనున్న పడుచుకు బయటనున్న వారు అరుణాచల అగ్నితత్త్వ స్వామిని పరిచయముచేస్తే,ఇప్పుడు లోపల నున్న పడుచు బయటనున్న వారితో చిదంబరస్వామిని సంకీర్తిస్తు ఈ సమయము పరాచికములకు తగినది కాదని,స్వామి చింతనకు అనువైనదని చెబుతున్నది.


 చిత్-స్పృహ

 అంబరం-ఆకాశము.

 స్వామి మొదటి నర్తనమును చేసిన తిల్లై వనము.


  స్వామి సుందరేశుని తిలకించి పులకించని చరాచరమసలు అక్కడలేదు.స్వామి సర్వాలంకృతుని

గా మారాలనుకున్నాడు.అందులకు మునులను నిమిత్తమాత్రులను చేసాడు.వారెంతటి ధన్యులైనారో ఈసుతో స్వామిపై.ఎక్కడ తమ పత్నులు ఆ సుందరేశునికి వశులై తమను విస్మరిస్తారేమో నను అనుమానమేస్వామిని సన్మానించినది.


  స్వామి తనకేమి సంబంధములేదన్నట్లుగా వనములోని పండ్లను ఆరగిస్తున్నాడట.కోపోద్రిక్తులైన మునులు తమ తపశ్శక్తితో పాములను సృజించి,ఆవాహనచేస్తూ,స్వామి ఉన్న ప్రదేశమునకు వదిలారట.జగద్రక్షకుడు వాటిని తన జడలో కొన్నింటిని చుట్టుకున్నాడట.మరి కొన్నింటిని పాదములకు-నడుమునకు-చేతులకు-మెడలో ఆభరణములను చేసి అలంకరించుకున్నాడట.


   నిష్ఫలులైన మునులు ఒక పెద్దపులిని ఆవాహనచేయగా స్వామి దాని చర్మమును తనకు వస్త్రముగా చుట్టుకున్నాడట.మరింత అజ్ఞానముతో వారు తన ఆధ్యాత్మిక శక్తినంతను వినియోగించి,"ముయల్కన్" అను అసురుని ఆవాహనచేస్తే,అంతే ఆదరముతో ఆ రక్కసి వీపుపై తన పాదస్పర్శనందించి,దానిని నిశ్చలముచేసి తాను ఆనందతాండవమాడేస్వామిని కొలుచుటకు ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను అన్నదట ఆ పడుచు.

 తిరు అన్నామలయై అరుళ ఇది

 అంబే శివే తిరువడిగళే పోట్రి.


  నండ్రి.వణక్కం.


 


   

   

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...