తిరువెంబావాయ్-12
*****************ఆర్తా పిరవి తుయర్కెడ నామార్తాడుం
తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం
కూత్తం ఇవ్వానుం కువలయముం ఎల్లోముం
కాత్తు పదైత్తుం కరందుం విళయాడి
వార్తయుం పేశి వలై శిలంబ వార్కలైగళ్
ఆర్పరవం శెయ్య అణికుణల్ మేల్ వండార్ప
పూత్తికణుం పొయిగై కుడై దుడైయాన్ పోర్పాదం
ఏత్తి ఇరుంచులైనీరాడేలో రెంబావాయ్.
అయ్యా! సృష్టి-స్థితి-లయ క్రీడాయ పోట్రి
**********************************
ఈ పాశురములో తిరుజ్ఞానసంభదార్ మనకు స్వామి మనకు అనుగ్రహించిన "పొయిగై" ను సరస్సును మనకు అందిస్తు-అనుగ్రహిస్తున్నారు.ఆ అనుగ్రహ సరస్సు తెల్లని జలముతో సత్వగుణ ప్రకాశముతో
తేజరిల్లుతుంటుంది.మనము ఉన్ పొయిగై పుక్కు-ఆ అద్భుత-అనుగ్రహ సరస్సులోనికి ప్రవేశించి,వెణ్ణీర్ ఆడై స్నానము చేసామంటే-మన జన్మజ్ఞమల సంతాపములు సమసిపోతాయి.
చెలి! నీకు ఈ విషయము తెలియనిది కాదు.మన స్వామి తిల్లై లో ఎడమచేతిలో అగ్నిని అలంకారముగా ధరించి,ధాచి,నాట్యమాడుతుంతాడు.
అదేకదు.స్వామి సృష్టి-స్థితి-లయ క్రీడాసక్తుడని మన కరకంకణములు మనతో ముచ్చటిస్తుంటే,మన మణిమేఖల గంటలు దానిని నలుదిక్కుల ప్రతిధ్వనిస్తున్నాయి.స్వామి అనుగ్రహ మనే పరిమళము మన కేశములను అనుగ్రహించువేళ శివనామ సంకీర్తనమును చేయుదుము
అంబే శివ తిరువడిగలే శరణం
No comments:
Post a Comment