తిరువెంబావాయ్-12
*****************
ఆర్తా పిరవి తుయర్కెడ నామార్తాడుం
తీర్థ నర్తిల్లై చిట్రంబలతె తీయాడుం
కూత్తం ఇవ్వానుం కువలయముం ఎల్లోముం
కాత్తు పడైత్తుం కరందుం విళయాడి
వార్తయుం పేశి వలై శిలంబ వార్కలైగళ్
ఆర్పరవం శెయ్య అణికుణల్ మేల్ వండార్ప
పూత్తికణుం పొయిగై కుడై దుడైయాన్ పోర్పాదం
ఏత్తి ఇరుంచులై నీరాడేలో రెంబావాయ్.
అయ్యా! సృష్టి-స్థితి-లయ క్రీడాయ పోట్రి
**********************************
ఈ పాశురములో తిరుమాణిక్యవాచగరు
"పూత్తిగళుం పొయిగై" అని ప్రస్తావించి-ప్రస్తుతించినారు.అనేక పద్మములతో అందముగా నున్నది ఈ కొలను.
ఇది బాహ్య దర్శనమునకు దృశ్యము.
కాని హ్రీంకారోపాసనమును నిరంతరము చేయుచున్న ఈ కొలనులోని పద్మములు స్వామి సమక్షములో నిరంతరమును నిస్తులనాదోపాసనమును చేయుచున్న అనేకానేక అద్భుత యోగి గణములు.
పొయిగై దగ్గరకు వచ్చిన పడుచులకు ఆ దివ్యనాదము రెండు విషయములను స్పురింపచేయుచున్నది.
మొదటిది- కూట్రం- సమస్తమునకు-సమస్త నిర్మానమునకు మూలము.స్వామియే నిర్మాత-దర్శకుడు.
దేనిని నిర్మించాడు స్వామి?
ఇవ్వానం-ఈ వానం-ఈ ఆకాశం
అంటు వారు ఆకాశము వైపు చూడగనే,
చిదంబర నటరాజ నర్తనము ప్రాప్తించింది.నర్తిల్లె చిట్రంబలత్తె.
అంతలో బహిర్ముఖులై స్వామి అంబరమునే కాదు/ఆకాస్శ్మునే కాదు,
కువలయముం-భూమండలము కూడా నిర్మించాడు.
కాని ఇంకా స్వామి చాలా చేసాది.నేల నింగి మాత్రమే కాదు.
ఏమని చెబుదాం అనుకుని
ఎల్లోముం-సమస్తము స్వామి సంకల్పములే
అని ,
స్వామి ఎంతటి దయా సాగరుడంటే వాటిని సృష్టి చేసి,తన పని అయిపోయినదని అనుకోలేదు.ఇంకొక బాధ్యతను కూడ తనకు తానుగా స్వీకరించాడు.అదియును ఆటగా వినోదిస్తు,
అవియే,
కాత్తు-పాడనిత్తు --కరమిదుఈ,, , సమస్తమును-సృష్టించుట-స్థితి చేయుట-తనలో లీనము చేసుకొనుట.
వారి భక్తి తాదాత్మ్యత మడుగులో మహోత్సాహముతో మునిగితేలుటకు తొందర చేస్తున్నది.
ఎందుకంటే ఆ మడుగు ఆర్తా పిరవి
స్వామి పరముగా అన్నియును తానైన పరమాత్మ
మన పరముగా ఆర్భాట బాహ్య బంధములను తొలగించు బ్రహ్మానందమును అందించు అద్భుత ఔషధము.జన్మరాహిత్యమునకు చక్కని రాజమార్గము.
కనుక వారు,
నాం-మనమందరము
ఆర్తాడం-ఆనందముతో
స్వామి పొర్పాదం-సరణాగతరక్షనమైన స్వామి పాదములను సేవించుటకు,కొలను లోనికి దూకుచున్నారు.
ఈ పాశురములో మనకు తిరుమాణిక్య వాచగరు రెండు అద్భుత విషయములను సూచిస్తున్నారు.
మొదటిది
పడుచుల త్రికరణ శుధ్ధి.
వారు పొయిగై లోనికి దూకగానే తడిసిన వారి కర్ణాభరణములు(కర్ణములు) స్వామి మహిమలను వారికి అందించుచున్నవి.వారు వినుచు పరవశించుచున్నారు.అప్పుడు వారి ఒడ్డానములకు ఉన్న మువ్వలు ఆ కథలను బయటకు వినిపించునట్లు పెద్దగ సబ్దము చేయుచున్నది.వారి కాయము-మనస్సు-వారు ధరించిన ఆభరనములు వాక్కులై త్రికరణములతో స్వామిని సేవించుచున్నవి.
ఇక్కడ ఇంకొక గొప్ప విషయము మనకు అవగతమవుతుంది.అదియే జ్ఞానేంద్రియ-కర్మేంద్రియ సమ్మేళనము.వారు నీటిలో కేరింతలు కొడుతు మునకలు వేస్తూ క్రీడిస్తున్నారు.అదియే అత్యంత అనుగ్రప్రదమైన అర్చన.ఆ క్రీద్డలో/సేవలో వారి కేశములు తడిసినవి.కేశములలో నున్న పువ్వులు తడిసినవి.ఆ కేశములు సుగంధభరితములై ప్రకాశించుచున్నవి.మాంస శరీరము మంత్ర శరీరముగా మారి తన పరిమళములతో తుమ్మెదలను ఆహ్వానుంచుచున్నవి.అవి ఝుంకారము చేయుచు కొలను ప్రవేశించినవి.
కొలను నాదమయము.
కన్నెల ఆభరణములు నాద మయము
వారికేశములకు ఆకర్షింప బడిన తుమ్మెదలు నాదమయము.
నాదం తనుమనిశం శంకరం
తిరు అన్నామలయై అరుళ ఇది
అంబే శివే తిరువడిగళే పోట్రి.
నండ్రి.వణక్కం.
.
No comments:
Post a Comment