తిరువెంబావాయ్-19
*****************
ఉంగయ్యర్ పిళ్ళై ఉనక్కే అడైక్కలం ఎన్రు
అంగుం అప్పళం సొల్ పుదుక్కురుం అచ్చత్తాల్
ఎంగళ్ పెరుమానునక్కొండ్రు ఉరేయ్ పొంగే
ఎంగొంగై నిం అంబల్ అళ్ళారో శేయక్క
ఎంగై ఉనకళ్ళదు ఎప్పణియు శేయార్క
కంగళ్ పగల్ ఎంగళ్ మట్రోరుం కాణర్క
ఇంగి ఇప్పరిశె యమక్కేందో నల్గుదియల్
ఎంగళి ఎన్ న్యాయయిది ఎమక్కేలో రెంబావాయ్
క్షిప్రప్రాసాదాయ పోట్రి.
*******************
తిరు మాణిక్య వాచగర్ మనకు ఈ పాశురములో పరిణితిచెందిన భక్తి, పరమాత్మతో చనువు తీసుకొని పరవశముతో వాగ్దానమును చేయించుకుంటున్నది.అదియే,
సొల్-చెప్పు స్వామి మాతో,
అప్పళం సొల్-వెంటనే నీవు మాకు మాట ఇవ్వు.
ఏమని?
మేము అర్హతకలిగిన వారమో? కాదో?
అయినప్పటికి,
ఉన్-నీయొక్క
కయ్యర్-చేతిని పట్టుకుని ఉన్నవారలము.
పిళ్ళై-నీ పిల్లలము.
అంతేకాదు
ఎన్రు-ఎప్పుడును/సర్వకాల సర్వావస్థలయందును మేము నీకు,
ఉనక్కే అడైక్కలం-నీ అధీనులము.
నీ దయమీదనే ఆధారపడియున్నవారలము.
భక్తి పొందిన బలమేమో అది లేదా భగవంతుడిచ్చిన చనువో వారిచే మరల మాట్లాడిస్తున్నది.
స్వామి నువ్వు మమ్ములను సంపూర్ణముగా అనుగ్రహించాననుకుంటున్నావేమో.
అదే కనుక నిజమైతే,
కమలేశు చూడని కన్నులు కన్నులే,
తను కుడ్య జాల రంధ్రములు గాక అని
ప్రహ్లాదుడు వినతి చేసినట్లు
మా నయనములనే ఇంద్రియములు సదా నీ దివ్ర మంగళ స్వరూప దర్శనముతో తరించవలెను కాను అన్యదర్శన చింతనము రారాదు.అవి చూడరాదు.
అ శుభసమయములో మా మనస్సులో/హృదయములో,
నిన్ అంబర్-నీవు తప్ప
నీ స్మరణము తప్ప
అళ్ యారో-వేరెవరో
మా భావనలో స్పురించరాదు.
అట్టి జీవాత్మ-పరమాత్మ మహాద్భుత మమేకములో నున్న మాకు,
కంగుల్-పగల్-ఎంగల్ -మట్రోరు కాణర్క,
ఇది రాత్రి చీకటి సమయము-ఇది పగలు-వెలుగు సమయము అనువాటితో ద్వంద్వములతో-బాహ్యములతో సంబంధము లేని నిశ్చల-నిర్వికార స్థితిలోఅంతర్ముఖులమై ఆత్మానందముతో మాలో కొలువైన నిన్ను దర్శించుచు-సేవిస్తు-ఉండే
ఇప్పరిసె-ఈ వరమును/బహుమతిని కోరుకొనుచున్నాము.
అది కనుక నీ వనుగ్రహించకపోతే,
సమస్తలోకములు,
ఎంగళి ఎన్ న్యాయ ఇది?
ఇదెక్కడి న్యాయము? ఇదేమి న్యాయము? అని నిన్ను ఆడిపోసుకుంటారు ఆదిదేవా!
మమ్ములను అనుగ్రహించి అంటూ గట్టిగా
హెచ్చరిస్తు,అద్వైత ఆనందములో మునిగితేలుటకు మడుగులోనికి ప్రవేశించి,పునీతులగుచున్నారు.
" కాయేన వాచా మనసేంద్రివాయే
బుధ్ధాత్మనావా ప్రకృతే స్వభావే
కరోమి యత్ తత్ సకల్మ్ పరస్మై
పరమేశ్వరాయేతి సమర్పయామి."
తిరు అన్నామలయై అరుళ ఇది
అంబే శివే తిరువడిగళే పోట్రి.
నండ్రి.వణక్కం.
No comments:
Post a Comment