Wednesday, May 12, 2021

DHYAYAET IPSITA SIDHDHAYAET-03

 


 ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-03

 ***************************


 నన్ను వెంటాడుతు,నాతో ఆడుకుంటున్న ఆలోచనలను అర్థము చేసుకోవడము ఎలా?

 పూలలోనికి రంగులు ఎందుకు/ఎలా వస్తున్నాయి? వచ్చినవి నిలవకుండ ఎందుకు వాడిపోతున్నాయి?


  పూలకే కాదు పండ్లకు-సకలమునకు రంగురూపులను అందిస్తూ,వాటిని కొనసాగనీయకుండా హరించివేస్తున్నది ఎవరు?


  


  పసికందుగా కదలలేని కాళ్ళు-అవయములు (కొందరిలో మాత్రమే) అద్భుత నాట్య భంగిమలను ప్రదర్శింపకలుగుతున్నవి.కాని కొంతకాలము మాత్రమే.గట్టిగా వస్తువును పట్టుకోలేని చేతులు పెద్ద పెద్ద బరువులను ఎత్తుతు బహుళజనాదరణను పొందుతు ప్రస్తుతింపబడుతున్నవి.అద్భుత చిత్రలేఖనమును,శిల్పకళా వైభవమును ఇలా ఎన్నెన్నో అద్భుతముకను అందించగలుగుతున్నాయి.ఒకరిలో కంఠము గొప్ప ప్రాభవమును (గానము-మిమిక్రి -గాత్ర దానము)ప్రదర్శించగలిగితే,మరొకరిలో వేరొక ఇంద్రియ పత్యేకత.అరవైనాలుగు కళల అద్భుతములు ప్రదర్శించు శక్తి వారికి కాలపరిమితిని నిర్దేశించి,ఆ తరువాత తాను వారిని వీడిపోతుందా?లేక వారే దానిని కూఇ యుండలేక పోతున్నారా?


  క్రమముగా అభివృధ్ధిని చెందుతు క్షణక్షణముగా అవి ఎందుకు క్షీణిస్తున్నవి?


  అవి ఎందుకు అలా నిస్సహయముగా నిర్మూలనమును పొందుతున్నవి.


 ఎంతో ప్రగతిని సాధించాననుకొంటున్న మానవులు సైతము క్రమక్రమముగా ఎందుకు తమ నిస్సహాయతను నిరోధించలేక ప్రేక్షకులై పరాధీనులవుతున్నారు?


  -అంటే,

 మనము అనుభవిస్తున్న ఈ రూప-లావణ్యములు,అహంకార-మమకారములు-శక్తి-సామర్థ్యములు జనన-మరణములు అను నామరూపములను

                మనము ఎవరి నుంచో/ఎక్కడినుంచో కొంతకాలము వరకు మాత్రమే అప్పుతెచ్చుకుంటున్నామా?ఎవరో వాటిని కరుణతో కొంతకాలమునకు మాత్రమే మనలోదాగి ప్రకటింపచేస్తున్నారా?సమయము మించినదని తిరిగి హరించివేస్తున్నారా?


   అయితే మనము ఆశ్రయించిన ఈ ఉపాధి,

 శక్తిని ప్రకటింప చేసే పరికరము మాత్రమేకాని/ శక్తి కాదా?


 ఏమిటి ఈ విచిత్రము? ఎవరు దీనినిప్రసాదిస్తున్నారు తిరిగి పరిగ్రహిస్తున్నారు?ఎందుకు చేస్తున్నారు.?



ఆ చిత్శక్తి సామాన్యశక్తికి అతీతముగా/అద్భుతముగా ఏ ఉపాదానకారణము లేకుండానే స్వయం సమర్థమై తన కనుసన్నలతో ఈ కాలచక్రమును పరిభ్రమింపచేస్తు.దానితోపాటుగా మనలను ప్రయాణింపచేస్తున్నదా?


 అదేకనుక నిజమైతే దానిని   గుర్తించగలమా?

 గుర్తించి-గౌరవించుటకు జీవునకు అవసరమైన-అవ్యాజమైన అనుగ్రహము నన్ను సందేహ సందోహములనుండి సంస్కరిస్తుందన్న ఆశతో నా పరిశీలనకు ఆ పరమాత్మ పరిష్కారములను చూపి,నన్ను-మనలను ఆశీర్వదించును గాక.



  పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.

    కరుణ కొనసాగుతుంది.




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...