Thursday, September 16, 2021

AMMA KAAMAAKSHI UMAYE-03

గతియాగ 3. గదియాగ ఉందనై కొండాడి నినదుమున్ కురైగళై చొల్లి నినదుం కొదుమయై ఎన్మీదిల్ పెరుమయై వీత్తునీ కుళప్పమై ఇరుప్పదేనో సాధికారెండ్రునాన్ అరియమాల్ ఉందనై సదముగ నంబినేనే సత్రాగిలుం మనదు వైతెన్నై రక్షిక్క సాధగం ఉనకిల్లయో? మదిపోల ఒళివిట్ర పుగళ్ నెడుం కరముడయ మదగజన ఎండ్రతాయి మాయనిద తంగయె పరమనదు మంగయె మాయనత్తిల్ నిండ్ర ఉమయె అధికారి ఎండ్రునాన్ ఆశయిల్ నంబినేన్ అంబువైతెన్ని ఆళ్వాయ్ అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే, అంబకామాక్షి ఉమయే. ******************* నిన్ను నెరనమ్మి నీ పాదాలపై వాలి శరణుశరణన్నగాని తగదమ్మ నామీద కనికరమునే మరువ,తాత్సారమది యేలనో కఠినాత్మురాలవను విషయము తెలియక మనసార నమ్మినానే క్షిప్రప్రసాదినిగ దాసుని రక్షింప జాగు నీకేలనమ్మా వరమొసగు కరములు దరహాస ముఖముగల ఆదిపూజ్యుని తల్లివమ్మా మాధవ సోదరి మాత పరమేశ్వరి మాయాస్వరూపిణివి నీవే అధికారిణివి నీవు ఆశ్రయనిరాదరన అపవాదు తగనిదమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. విరుత్తములో మొదటిదైన సుందరి..లో తల్లిని జ్యోతి స్వరూపముగా ప్రస్తుతించిన ఫలితమో ఏమో,పత్తు విరల్ అను రెండవ భాగములో తల్లిని తన భావనలో దర్శించగల భాగ్యవంతుడైనాడు. కటాక్షమునకు వేచియుందలేని తహతహ,గదియాగ...అను మూదవ భాగములో అధికాణివి అంటూనే,తల్లితో తనకున చనువుతో నిందారోపనలను చేసుకునే అధికారమును స్వాధీనము చేసుకుని,తాత్సారము/ఆలస్యము చేయుట తగనిదని హెచ్చరిస్తున్నది. హెచ్చరిక తల్లి నామమును-స్వభావమునకు తగిన బిరుదును గుర్తుచేస్తు తరలి రమ్మని మొరపెట్టుకుంటున్నది. తల్లి సకలభువనములు నిన్ను మాధవసోదరిగా ప్రస్తుతిస్తున్నాయి. ఆది పరాశక్తి వామనేత్రము నుండి (చంద్ర) నీలిరంగు కవలలు నారాయణుడు-నారాయిణి ఆవిర్భవించారని,గమన సంకేతమును నారాయణునిగా ,వాని సోదరిగా నిన్ను కీర్తించుచున్న వేళ నీవు నన్ను కరుణించుటకు కదలిరాకుండుట ,కఠినముగా ఉండుట నీకు తగనిది. నామ సార్ధకతయే కాదు,స్వభావ సార్థకతకు కుడ నీ కఠినత్వము సరైనదికాదు. నీ కఠిన హృదయమును కనలేని నీ భక్తులు నీవు నీ కృపాక్సటాక్షముతో అర్హతను కూఉడ లెక్కించక గ్రక్కున ఆదుకుంటావని నిన్ను క్షిప్ర ప్రసాదినిగా కీర్తిస్తున్నారు. అంతటితో తృప్తి చెందక ఆదిపూజ్యుడైన గణపతి దుష్ట సంకల్పములకు విఘ్నములను కల్పిస్తు, సరియైన వాటికి కలుగు విఘ్నములను తొలగిస్తు సిధ్ధి-బుధ్ధులను ప్రసాదించుట మాతగా నీవందించిన సన్స్కారమే కారణమని సన్నుతిస్తున్నారు. నన్ను జాగుచేయక అనుగ్రహించినచో దానికి ఏ అపవాదము లేక సార్థకమవుతుంది. ఎన్మనదు నడివిట్టు నీగాదు నిలువెత్తు ఏగాదు పుగళ్ వరువాయ్ కామదాయిని ఈ దీనుని పై దయతలచవమ్మా . కామాక్షితాయి దివ్య తిరువడిగళే శరణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...