Tuesday, November 23, 2021
KALIKAMBA NAAYANAAR
కలికాంబ నాయనారు
***************
" నీ పాదకమలసేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును
నితాంతాపార భూత దయయును
తాపస మందార నాకు దయసేయకదె"
సహజకవి బమ్మెర పోతన.
ఆదిశంకరులు అమ్మ వారి పాదరేణువు మహాత్మ్యమును సౌందర్యలహరి స్తోత్రములో ప్రస్తావిస్తూ,ప్రశంసించిరి.
అన్నమాచార్చార్యులు సైతము,
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మమురా నీ పాదము అని
సర్వాంతర్యామి పాదపద్మములను సన్నుతించిరి.
నవవిధ భక్తులలో నాల్గవదైన పాదశేవనము భక్తుని నిరహంకార నిశ్చల మనోసేవలకు ప్రతీకగా అనుకోవచ్చును.
సామాన్య భాషలో చెప్పుకోవాలంటే మనసు చపలత్వముతో అటు-ఇటు జరుగవచ్చును /అహంకారమునకు దాసోహమవ వచ్చును కాని,నిండైన విస్తరి నెమ్మదిగానే ఉంటుంది అన్నట్లుగా నిరంతరము శరీరమును మోస్తున్నప్పటికిని,నడుస్తున్నప్పటికిని,పరుగులు తీస్తున్నప్పటికిని లేదా స్థిరముగా నున్నప్పటికిని అన్ని అవస్థలను సమానముగానే స్వీకరిస్తూ,సహనముతో ఉండేవి పాదములు.
స్వామి అంఘ్రియుగళ సేవనము సూచిస్తూ శ్రీదేవులపల్లి వారు సైతము,
శివపాదము మీద నీ శిరమునుంచరాదా అని ,
అహంకార-మమకార పోరాటములలో అహంకారము తొలగాలంటే అది మమకారమును ఆశ్రయించవలసినదే.దానిచే ఆశీర్వదించబడ వలసినదే.
పాదసేవనమును ప్రముఖ సేవగా స్వీకరించిన వారిలో,పెన్నుగదము లోని కలికాంబ నాయనారు దంపతులు స్వామి కరుణను లోకవిదితము చేసిన వారు.
కలిక్కాంబ/కలికంబర్/కలికంబనార్/కలియాంబ/ అను వివిధ నామములతో పిలువబడు
పరమశివభక్తుడు.న-కలి-లేనిది.కలి-ఉన్నది.
వైశ్యజాతిలో పుట్టినప్పటికిని ఉన్నదానితో సంతృప్తిని చెంది,శివభక్తులను సాక్షాత్తు శివ స్వరూపముగా భావిస్తూ,వారిఉపాధిని ఎంచక ,పాదసేవనమును పరమ భక్తితో చేసేడివాడు.
పరమ సాధ్వి అయిన నాయనారు ధర్మపత్ని పాదసేవనమునందు పతిని అనుసరిస్తూ,పాత్రలోని జలమును అతిథిని సాక్షాత్తు పరమేశునిగా భావిస్తూ,పరమ వినయముతో,
" పాదయోః పాద్యం సమర్పయామి" అన్న పవిత్ర భావనముతో పూజించేది.
మన నాయనారుకు పరమేశునిపై గల ంపరమభక్తియే బలము శివుని లీలకు అది బలహీనముగాను మారుతుంది.కాదనగలవారెవరు కాముని ఆనను.
క్రమక్రమముగా కలికంబర్ మనసులో తానే కాక తన కుటుంబము సైతము నిశ్చలభక్తితో పరమేశుని పాదశేనములో పాల్గొనాలనె ప్రగాఢ వాంఛ ప్రబలినది.
" అజాయమానా-బహుధా విజాయతే"
నిరాకారుడు భక్తులను పరీక్షించుటకై తనకు నచ్చిన నామరూపములను ధరిస్తాడు.తనంతట తానే దగ్గరగా వస్తాడు.భ్రమలను కల్పిస్తాడు.ఉన్నది లేదనిపిస్తాడు.లేనిది అవుననిపిస్తాడు.
అదేజరిగింది నాయనారు ఇంటిలో.మధ్యాహ్న వేల అయింది.అతిథి-అభ్యాగతులను అర్చించే సమయమాసన్నమయినది.
రానే వచ్చాడు రాగ-ద్వేషములను కలిగించుటకు ,యోగమును నిరూపించుటకు నిటలాక్షుడు.
సాదర్ముగా ఎదురేగాడు నాయనారు స్వాగతించుతకు అతిథిని.సాలోచనగా ఆగిపోయింది అతనిని చూసిన గుర్తులను పలక్స్రిస్తూ నాయనారు భార్య.
ఒకరిని ఇహము-మరొకరిని పరము ప్రభువు ఆనగా పలకరిస్తున్నది.పలకరిస్తూనే ప్రభావితము చేస్తున్నది.
అతిథిని కూర్చుండ్
అబెట్టినారు ఆసనము మీద.పాదములను కింద పీట మీద నిలిపారు.
నాయనారు కన్నులకు దేవుడు కనిపిస్తున్నాడు సదాశివునిగా.
నాయనారు భార్య కన్నులకు జీవుడు ఉపాధితో సహా కనిపిస్తున్నాడు తన దగ్గర పనిచేసిన సేవకునిగా.
మధురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా అంటూ సేవకు ఉపక్రమిస్తున్నాడు కలికంబరు.
అథమం శివ వేషం అర్హతలేదులే ఓ మనసా అంటూ నిరాకరణను నిర్ణయించింది నాయనారు భార్య.
పరస్పర విరుధ్ధ భావనలు పాదసేవనమునకు ఆయత్తమగుచున్న వేళ అది.
పుణ్యము/పాపము చెరో వైపుకు జరుగుతున్న జాము అది.
జంగమదేవర జటాధారియై జరుగవలసిన దానిని జరుపుతున్నాడు.
" మహాదేవ జగన్నాథ భక్తానాం అభయప్రద
పాద్యము గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్దయ
గంగాధరాయ నమః
పాదయో పాద్యం సమర్పయామి"
ప్రసన్న మనస్కుడై పాదప్రక్షాలనమునకై సిధ్ధమయ్యాడు నాయనారు.
దాసుని కాళ్లుకడుగుటయా? దానికి ధర్మపత్నిగా నేను జలధారనందించుటయా? ధర్మ సంకటము స్వామి మర్మమును తోసివేసి,కరములను శుభకరములు కానీయటము లేదు.
వేచి చూస్తున్నాడు అతిథి.జలధారకై వేచిచూస్తున్నాడు తన పతి.తోచుకోనీయటములేదు పరిస్థితి.
అంతే.అహము ఆమెను దాసోహము చేసుకున్నది.పాదపూజలేల యని వాదమును చేసింది.
నీలకంఠుని పూజను నిరాకరింప చేసినది.
ఇంద్రియములను మందము చేసినది.అదే అనందమనిపించేటట్లు ఆడిస్తోంది.
ఆగ్రహము కట్టలు తెంచుకుని వస్తోంది నాయనారుకు భార్య వింతప్రవర్తనను చూసి.
అతిథినిసత్కరించమని అనునయిస్తున్నాడు.వాడు మన సేవకుడు.నేను యజమానురాలిని.సేవలను స్వీకరించే అర్హత వాడికి లేదు అన్నది .
అంతే.కట్తలు తెంచిన క్రోధము ఆమె కరములను తుంపించేసింది.
చేతులారంగ శివుని పూజింపడేని
కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనముగా నేలకొరిగినది నాయనారు భార్య.
వెనుక ముందు ఆలోచించక తానే జలమును పోసి,తానే పాదప్రక్షాలమును గావించి,అర్చించాడు.
అర్థనారీశ్వరునికి అర్థాంగి సహిత పూజలను సమర్పించలేకపోయితినన్న దిగులుతోనున్న నాయనారును
అనుగ్రహించదలచిన ఆదిదంపతులు ప్రత్యక్షమయి ఆశీర్వదించారు.
నాయనారు పాదసేవనాతత్పరతను లోక విదితము చేసిన ఆదిదంపతుల అనుగ్రహము మనలను సదా రక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment