Thursday, December 2, 2021
ILANGUdI MARAN NAYANAR
ఇలయాంగుడి మారన్ నాయనారు
*****************************
హరిలీలా విలాసమో/సిరి కేళీ వినోదమో రంతిదేవుడు అను విష్ణుభక్తుడు ,తన కుటుంబముతో సహా 48 రోజులు ఆకలిదప్పులతో బాధించబడినాడు.అది ఊరటయో/ఊరట అనుపేర తనను పరీక్షించు గారడియో వారికి పాలు-అన్నము-రొట్టెలు -నీరు లభించినది.
స్నానాదికములు పూర్తిచేసుకొని,హరిని మనసారా స్మరించుకొని,అహారమును తినుటకు సిధ్ధమవగానే,
"భవతి భిక్షాందేహి" అంటూ బ్రాహ్మణుడు రానే వచ్చాడు.
హరికి అర్పిస్తున్నానన్న భావనతో ,తమ దగ్గర నున్న ఆహారములో కొంత భాగమును సవినయముగా సమర్పించి,వెనుదిరుగగనే ,వెనుకనే నిలచి మరొక అభ్యాగతి అకలికేకలు వినపడగానే మరికొంత పదార్థములనిచ్చి తృప్తిపరచినాడు రంతిదేవుడు.ఇంతలో నాలుగు కుక్కలతో నలిగిన దుస్తులతో నకనకలాడుచున్న కడుపుతో నాలుగు మెతుకులకై
ఎదురుగా మరొక దీనుడు రంతిదేవుని ముందు నిలిచాదు.
కటకట! ఆకలిని జయించుట కానిపనికద అనుకొని తన దగ్గరనున్న మొత్తము ఆహారమును ఇచ్చివేసి నిశ్చింతుడైనాడు రంతిదేవుడు .
హరినామ స్మరణముతో
తమ ప్రానములను నిలుపుకొనుటకు జలాహారమును స్వీకరించ సిధ్ధమగుచున్నవేళ రానేవచ్చాడు జలజాక్షుడు చండాలుని రూపములో.
అమ్మా అకలి-అయ్యా ఆకలి-అన్నము పెట్ట ండయ్యా
అంటూ అరుపులు దీనముగా వినిపిస్తున్నాయి.
కదిలిపోయాడు రంతిదేవుడు/వెన్నలా కరిగిపోయింది మనసు
.ఎంతో భక్తితో,
ఓ పుల్కసా./
అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న అంటూ దప్పిక తీర్చి,తన భక్తిచే తరించాదు.
ఒక విధముగా రంతిదేవుడు-ఇలయాంగుడి నాయనారు హరిహరాద్వైతమునకు నిలువెత్తు నిదర్శనమనవచ్చును..
రంతిదేవుని హరిభక్తి సకలజీవులలో స్వామిని దర్శింపచేసి సాయుజ్యమును ప్రసాదించినది.
అదేవిధముగా ఇలయాంగుడి మారన్ శివభక్తి సంస్కారము అర్థికి లేదనకుండా అన్నములను అందించి జీవిత పరమార్థమును చాటినది.
జనని-జన్మభూమిశ్చ స్వర్గదపి గరీయసీ
తన జన్మస్థల నామధేయమునే తన నామధేయము చెసుకున్న ఇలైయంగుడి నాయనారు గొప్ప వ్యవసాయ కుటుంబములో జన్మించెను.పరమ శివభక్తుడు.
శివభక్తుల పాదసేవనము-పావన నైవేద్య సమర్పణములను పరమసంటోషముగా ఆచరిస్తూ-ఆనందముగా ఉండేవాడు.అతని ధర్మపత్ని సహితము భర్త కనుసన్నలలో మెలగుతూ,అన్న వితరణమే ఆ మూడుకన్నులవాని సేవగా పరమ భక్తిశ్రధ్ధలతో చేయుచుండెడిది.
వారి అన్నసంతర్పణలను అత్యంత వైభవముగా కొనసాగించేలా కాలము తనపని తాను చేసుకుపోతున్నది.
గంగను తన జటలో బంధించిన గంగాధరుడు,వేడుక ఇలైయంగుడి సంపదలను సైతము సాగకుండా బిగించాలనుకున్నట్లున్నాడు.
.
గంగను తన జటలో బంధించిన గంగాధరుడు,వేడుకగా ఇలైయంగుడి సంపదలను సైతము సాగకుండా బిగించాలనుకున్నట్లున్నాడు.
సిరితా పోయిన పోవును
కరిమింగిన వెలగవెలగపండు కరణిని సుమతీ.
సుమతీశతకము-బద్దెన మహాకవి
అన్న సూక్తిని నిజముచేస్తూ
కాలము తన మాయాజాలముతో నాయనారు నైవేద్య సేవలకు ప్రతిబంధకముగా మారి సంపదలను హరిచివేయసాగినది.
నాయనారు దంపతులు హరుని సేవను తక్క హరించిన సంపదల తలంపును తమదగ్గరకు చేర్నీయలేదు.వారి వ్రత విధానమును మార్చుకోనులేదు.కలియో/గంజియో/కాయయో/పందుయో/కలిగిన దానితో సంతర్పణములనుచేస్తూ సంతుష్టిగా నున్నవేళ,
నాయనారు విలక్షణమైన భక్తిని
లోకవిదితము చేయాలనుకున్నాడు.
అన్నివేళలా జరిగేటట్లే కరుణ తాను ప్రయాణానికి సిధ్ధమై తనకంటె ముందు కఠినపరీక్షను నాయనారు దంపతుల దగ్గరికి పంపించేసింది.
కరుణ నిండిన కుంభవృష్టి ఎడతెరిపిలేకుండా కురుస్తోందా అన్నట్లుగా చిదంబరుని ఆనగా జగములను చిందరవందరగా మారుస్తూ ఒకటే వర్షము అలుపెరుగకుండా నాయనారు భక్తికి గెలుపు, మలుపుగా మారుటకు తలుపులను తెరుస్తున్నది.
అసలు అది కురుస్తున్నదో
లేక రాబోవు వింతలను చూడాలను కుతూహలముతో మురుస్తున్నదో కథను జరిపించేవానికే ఎరుక.
పరమార్థమునకు త్రోవ నేను అవుతానంటూ అర్థరాత్రిసమయము తన వేదికను మురిపెముగా సర్దుకుంటున్నది.
రంగము సిధ్ధమైనది కరుణాంతరంగునికై వేయికన్నులతో ఎదురుచూస్తూ.
దంపతుల అంతరంగమును సిధ్ధమైనది అవ్యాజకరుణామూర్తికి సమర్పించవలసిన ఆతిథ్యమునకై ఎదురుచూస్తూ.
ఒకటి బాహ్యము-మరొకటి ఆంతరంగికము.
ఆంతరంగిక సమర్పణము నాయనారు దంపతులది స్వామికి అందమైనదే.అనుభవైకవేద్యమే.అజ్ఞానులకు/అల్పులకు అది అందరానిది.
అండములోని పక్షి వలె నిండుగా ఉన్నప్పటికిని అందుకోవాలంటే నిరీక్షణమును నిర్దేశించునది.
నాయనారు స్వామిభక్తి పరిపూర్ణమైనదైపరిమళించుటకు సమయమాసన్నమైనదనుటకు సూచనగా ,మంగళవాయిద్యములను తలదన్ను జయజయధ్వానములతో ఉరుములు మురియుచున్నవి.
త్రినయనం త్రిగుణాకారం త్రిమూర్తించ ...
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం సమర్పణం అని
అనుకుంటూ మెరుపులు సైతము స్వామికి దారిని ఇచ్చుటకు ముచ్చట పడుతు ముందుముందు త్రోవను చూపిస్తున్నాయి.
"నింగి వ్రేలుచు అమృతమునొసంగు మేఘుడు"
అన్నట్లుగా హర్షవర్ష మేఘములను స్వామిలీలామృతమును వర్షిస్తున్నాయా అన్నట్లుగా ఒకటే కుండపోత వర్షము మెండైన ప్రీతితో,నిండైన భక్తితో నింగి-ఇలయైంకుడి నేలను కలిపివేస్తుంటే ,ఆహా ఏమినా భాగ్యము అని పరవశిస్తుంటే,పరమాత్మ,
యతివేషధారియై
నియతి భోజనమునకై
నీటి మడుగులలో అడుగులను కదుపుచున్నాడు.
ఇంటి ముంగిటను వేడుకగా వేచియున్నాడు.
పరుగుపరుగున వచ్చి,అతిథికి పాద నమస్కారమును చేసా రు.పాహి-పాహ్ ఇ అని పాదసేవనము చేసారు.
" ఊర్క్చమే సూనృతాశ్చమే పయశ్చమే రసశ్చమే
ఘృతంచమే మధుచమే అన్నము-పాలు-తేనె-నీరు-నెయ్యి మొదలగు పంచామృతములకై చమకము అర్థిస్తుంటే,
తపమేమి చేసెనో కద మన నాయనారు దంపతులు,
స్వామి తనంత తాను అన్నార్థియై తరలి వచ్చినాడు.
ఏమా కృపాకటాక్షము ఆదిభిక్షువు ఆహారభిక్షకుడైనాడు..
అతిశయమైన కారుణ్యము అతిథి ఆకలిగా మారి,అన్న ప్రసాదమును ఆరగింపునకు సిధ్ధముచేయించుకుంటున్నది.
గంగమ్మ తరలిస్తున్న గింజలను మున్నీటిలో మునిగి ఏరుతూ,తప్పలను తీసివేస్తూ,వాటిలోని తప్పలను/తప్పులను తరలించివేస్తూ,వాటిని వండి,
దానికి కావలిసిన అనుపానమునకు
" నమో వృక్షేభ్యో-హరికేశ
భ్యః" అందించటానికి కొన్ని ఆకులను జారిపోకుండా ఒడుపుగా పట్టుకుని కమ్మగా వండి అతిథి కడుపు నింపారు నాయనారుదంపతులు.సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరునికి అన్న నైవేద్యమును ఆరగింపుచేశారు.
ఇది బాహ్యము
కొంచము ,నిశితముగా పరిశీలిస్తే
తప్పగింజలు అనుకుని తప్పుకున్నవి వారి బంధనములు.
ఒడిసిపట్టుకున్న ఆకుకూరలు వారి సుకృత బంధము.
అది ఆరగింపా లేక అమరిన కరుణ ఆలకింపా
సుష్టుగా భుజించిన అతిథి వారిని కరుణించదలిచాడు జ్యోతిస్వరూప సాక్షాత్కారముతో.
.
"శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః
శత్రు బుధ్ధి వినాశాయ దీపర్జ్యోతిర్నమోస్తుతే.
"
జ్యోతిరూపమున దర్శనమిచ్చి నాయనారుదంపతులను అనుగ్రహించిన పార్వతీపరమేశ్వరులు మనలనందరిని అనిశము సంరక్షించెదరు గాక.
ఏక బిల్వం శివార్పణం.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment