Wednesday, December 29, 2021
paasuram-14
తిరు చిట్రంబలం-పాశురం-14
*****************************
కాదార్ కుడైయాడ పైపూం కళాలాడ
కోదై కురళాడ వండిన్ కులామాడా
సీద పునలాడి చిట్రంబలం పాడి
వేదపొరుళ్ పాడి అప్పొరుళ్ ఆమా పాడి
శోది తిరం పాడి శూట్కొండ్రై తార్పాడి
ఆది తిరం పాడి అందం ఆమా పాడి
పేదిత్తునమ్మై వళర్తెడిత్తు పే వళిదన్
పాదత్తిరం పాడి ఆడేలో రెంబావాయ్.
.......
"నామ సంకీర్తనం యస్యా సర్వ పాప ప్రణాశనం
ప్రణమో దుఃఖ శమనం తం నమామి హరి పరం."
యుగధర్మముల ప్రకారము భగవంతుడు భక్తసులభునిగా తన కరుణా వీక్షణములతో కైవల్యమును అనుగ్రహిస్తున్నాడో,
ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు వివరిస్తున్నారు.
కృత యుగములో పాటించబడిన కఠోర నియమములను కొంతవరకు మినహాయించి,త్రేతయుగములలో యజ్ఞ-యాగాదులతో కఠిన నిబధ్ధతతో భగవదనుగ్రహమును పొందిన మహాత్ములగురించి మనకు వివరించబడినది.
అదే భగవదనుగ్రహము ద్వాపర యుగమునకు అన్వయించుకుంటే వారు భగవంతుని చెలికానిగా /సఖునిగా భావిస్తూ ఆడుతూ-పాడుతూ,చల్దులారగిస్తూ,ఛలోక్తులను విసురుకుంటూ చరణసేవా సౌభాగ్యమును పొందిరనుటకు ఉదాహరణము మనకు
లభించుచున్నవి.
కాని కలిపురుషుని ప్రభావమేమని చెప్పగలము.ఇంతకు ముందు యుగములలో సులభసాధ్యమనుకున్న అగ్నికార్యములు-ఘోర తపములు ఆచరించుట కడు దుర్లభమైన తరుణమున,నిర్హేతుక కృపతో పరమాత్మ తనను తలచినంతనే తరలి వచ్చి మనలను తరింపచేయుచున్నాడనుటకు నిదర్శనమే చెలులు స్వామిని గురించి చేయుచున్న సంకీర్తనము.
.
దీనికి ఆచార-వ్యవహారములు లేవు.ఆసన నియమము-ఆహార నియమము అసలే లేదు.పాండిత్య ప్రకర్ష కు ప్రాముఖ్యత లేనే లేదు.
మనము ఈ సంకీర్తనమును సర్వకాల సర్వావస్థలయందును చేసుకొని సద్గతిని పొందవచ్చును.
అదియే -
1) సో-హం అని మనలోని శ్వాసలు చేయుచున్న అజపామంత్రము.
2) లబ్-డబ్ అని మన గుండె చేయు నాద జపము.
3) స్తోత్రాణి సర్వం గిరో-నా వాక్కులన్నియును నీ స్తోత్రములో అన్న భావనను
మనము అన్వయించుకుంటే,
సర్వము సంకీర్తనమయమే-సకలార్థ సాధనమే.స్వామి చరణాశ్రితమే-సకల సౌభాగ్యప్రదమే.
తిరుమాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో రెండు విషయముల గురించి నొక్కి వక్కాణించారు.
చిట్రబలం పాడి,వేదప్పొరుల్ పాడి,శోదితిరం పాడి,సూట్కొండ్రతార్పాడి,అందం ఆమా పాడి,పాదతిరం పాడి అంటూ,
అవి ఒకటి-పాడి అన్న పదమును పదే పదే ప్రయోగించారు.
రెండవది
ఆడి అన్న పదమును పదే పదే ప్రయోగించారు.
కాదార్ కుడై యాడి,పైపూం కలాలాడ,కోదై కురాళాడ,వండిన్ కులామాడా,సీద పునలాడ,ఆదేలో రెంబావాయ్ అంటూ,
పాడి అన్న పదము సంకీర్తనా భక్తి విభాగమైన భక్తునకు అన్వయించుకుంటే,
ఆడి అన్న పదమును సంరక్షణ, అనుగ్రహరూపమైన పరమాత్మకు అన్వయించుకోవచ్చును.
అంటే పరమాత్మ పట్టువిడుపు అన్న ఆటను మనతో ఆడుచున్నాడు.
మనము పరమాత్మ పాదములను పట్టుకోవాలంటే ఇంకొక దానిని విడిచివేయాలి.
ఒకసారి పరమాత్మ పాదములను పట్టుకోలేకపోయినామనుకోండి నిర్హేతుక కృపతో మనకుమరొక ఉపాధిని ఇచ్చి మరల దాని ద్వారా తనను పట్టుకోమంటాడు.
తిరుమాణిక్య వాచగరు మనకు ఈ పాశురములోని చెలుల ద్వారా,
స్వామి చిట్రంబలం నుండి,
సకల జగములను తనలో నిక్షిప్తము చేసుకొనిన ఆకాశ తత్త్వము నుండి (నిరాకారమునుండి)
మనలను అనుగ్రహించుటకు తనను తాను విస్తరించుకొనుచు,ఒక్కొక్క భూతమును సృష్టించి,దానిని తనకు సహాయము అని మనము భావించుకొనునట్లు,పంచభూతములను పంచ తన్మాత్రలను,పంచేంద్రియములను సమ్మిశ్రితము
చేసుకుంటూ,
ఇందుగలడందులేడను సందేహము వలదు-పోతనామాత్యుడు వివరించినట్లు,
తనకు అవసరములేక పోయినప్పటికిని ఆకాశ,వాయు,అగ్ని,జల,పృధ్వీ తత్త్వములుగా తనను ఆదిగా-అంతముగా /సాకారముగా ,
ఆర్తా పిరవి నుండి జీవులను అనుగ్రహించుటకు,
శూట్కొండ్రై తార్పాడి అని తుమ్మిపూల మాలాంకృతుదైన సాకారునిగా సాక్షాత్కరించి,అనుగ్రహించినాడు.
ఇదంతయును స్వామి లీలా వైభవ విశేషములు.ఆటలు.
స్వామి ఈ ఆటలోని అంతరార్థమును కనుక మనము పరిశీలించగలితే ధన్యులమే.
భగవదనుగ్రహమైన ఉపాధిని ,ఏ విధముగా మనము నదిని దాటుటకు మాత్రమే నావను ఉపయోగిస్తామో అదే విధముగా సంసారజలధిని దాటుటకు మాత్రమే ఉపయోగించాలి.మన ధ్యేయము స్వామి చరణములను శరణుకోరుట.మన పట్టు స్వామి చరణాశ్రయమును పొందిన వెంటనే ఉపాధిని విడిచిపెట్టగలిగి/దానిమీది ప్రీతిని
విడిచిపెట్టగలగాలి.
.
***** మనకు ఈ ఉపాధి ఒక సాధనము మాత్రమే కాని సర్వస్వము కాదు.******
ఈ తత్త్వమును తెలిసిన/ఆచరిస్తూ అనుభవిస్తున్న చెల్లులు మడుగులో జలకములాడునపుడు,
వారి కుండలములు,ఆభరణములు,కేశములు,కేశములలో అలంకరించుకొనిన పుష్పములు,పుష్పములపై వాలిన తుమ్మెదలు సకలము సంకీర్తనములై స్వామి పాదములను పొందకలిగినవి.
మనము ఆడుతు-పాడుతు పాదములను పట్టుకోగలిగితే అయ్య తాను అమ్మగా మారి,
అమ్మ
తన కంకణముల కరములతో మనలను ఉధ్ధరిస్తుంది.
పేయ్వళిదన్-కరుణ అనే కంకణములదాల్చిన కరములుగల,
అమ్మ
నమ్మై-మనలను
వళర్తెడుత్తు-మనలను అనుగ్రహిస్తుంది.
అంబే శివే తిరువడిగళే శరణం.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment