Tuesday, January 11, 2022

TIRU PALLI ELUCHCHI-04

తిరుపళ్ళి ఎళుచ్చి-04 ******************* ఇన్నిశయై వీణయర్ యాళినుర్ ఒరుపాల్ ఇరుక్కొండుం తోత్తిరం ఇయంబినార్ ఒరుపాల్ తున్నియ పిణై మలర్ కయ్యనర్ ఒరుపాల్ తొళుకయ్యర్ అళుకయ్యర్ తునళ్కయ్యర్ ఒరుపాల్ సెన్నియల్ అంజలి కుప్పినార్ ఒరుపాల్ తిరుప్పెరుంతురై శివపెరుమానే ఎన్నయుం ఆండ్రుకొండుం ఇన్నరుళ్ పురియం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె ...... "స్తుతిస్తు నామ-రూపాలు కర్మణా బాంధవేనచ." అన్నది ఆర్యోక్తి. భగవదనుగ్రహము ఆధారమైతే దానిని ఆలంబనము చేసుకొని ఆరాధించుచున్న చేతనుల భక్తి ఆధేయము.అనగా భాగవతుల ద్వారా భగవత్తత్త్వము ప్రచోదమగుచున్నది. ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు రెండు పరమాద్భుతములను చెలుల సంభాషణము ద్వారా ఆవిష్కరింపచేస్తున్నారు.మొదటిది, " తిరుపెరుంతురైయురై శివపెరుమానే" అంటూ స్వామి నామ-రూపములను,గుణవైభవమును,నివాసమును కీర్తిస్తున్నారు అంటే పరబ్రహ్మము తననుండి నామ-రూప-గుణములను/అనంత కళ్యాణగుణములను వేరుచేసుకొని, అర్చామూర్తిగా తనను తాను మలచుకొనుట. ఈ ప్రక్రియ కేవలము జీవులను ఉధ్ధరించుటకు లీలగా స్వామి ప్రకటనము కాని మరే ఇతర ప్రయోజనమును లేదు. ఏ విధముగా గర్భస్థ పిండము తాను పెరుగుచున్న గర్భగుడిని పొందిన మాతృమూర్తిని చూడలేదో అదేవిధముగా మన చర్మచక్షువులు పర రూపముగా (నిర్వికారముగా/సూక్ష్మముగా) నున్న శక్తిని కనుగొనలేదు కనుక వ్యూహ-విభవ రూపములను దాటి అర్చామూర్తిగా ప్రకటనమగుతూ మనలను ఆశీర్వదిస్తున్నాడు. అనగానే చెలులు నాలుగుదిక్కులును నాదార్చనముతో ఏ విధముగా తాదాత్మ్యతతో నిండినదో కదా అనుకొనుచు,ఒకవైపు చూడగానే వీణానాదము వీనులవిందుగా స్వామిని కీర్తించుచున్నది. దానికి తోడుగా యళి( తంబురా) తానును స్వామిని అర్చించుచు,ఆనందించుచున్నది అనగానే మరొక్ చెలి అటుచూడు, తోత్తిరం ఇయంబినాల్ " ఆగమం ఆగి నిండ్ర అణ్ణిప్పన్ వాళ్గా" వేదఘోష నీకు/మీకు వినబడుటలేదా? అనగానే నేడు శ్రవణానందమే కాదు. స్వామి మనలకు నయనానందమును సైతము అనుగ్రహించుచున్నాడు. అటుపక్క చూడు, తుణ్ణియపిణై మలర్-అప్పుడే వికసిస్తున్న /పరిమళిస్తున్న పూలతో/పూలహారములను దోసిళ్లలో పట్టుకుని వస్తున్నారు ఆనందపారవశ్యముతో. అంతే కాదు ఎందరెందరో తమ హస్తములను ముకుళిస్తూ, తొళుకయ్యర్-భుజములమీద పెడుతు స్వామి శక్తిని తమ హృదయములలోనికి/దేహములోనికి న్యాసము చేసుకుంటున్నారు.అంగన్యాస/కరన్యాసములతో ఆదిదేవుని అమృతజలములతో " ఆ పాతాళ నభస్థలాంత" అంటూ అమృతధారలను ఆస్వాదిస్తూ-ఆనందిస్తున్నారు మనకు పరిచయములవుతున్న పరమాత్మ లీలలు మనలను మంత్రముగ్ధులను చేస్తున్నవి. చెలులారా ఇంక ఆలస్యము చేయక ఆత్మనివేదనముతో శివనోమును ప్రారంభిద్దాము అని అనుకుంటున్నారు. ****** ఈ రోజు మాణిక్యవాచగరు చోళ మండల ప్రయాణములో జరిగిన విశేహము గురించి, రావలిసిన వానిని తిన్నగాతనదగ్గరకు రప్పించుకుంటున్నాడు తిన్నని కాచినవాడు. నమో అశ్వేభ్యో-అశ్వపతిభ్యః నమో నమః. ఒక చిన్నవిషయము గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. స్వామికార్యముగా మనకు అనిపించే స్వకార్యమునకు,. అవకాశమును కల్పించినవాడు-మాణిక్యవాచగరును కదిలించినవాడు-దారి మళ్ళించినవాడు అన్నీ ఆ దయాంతరంగుడే. స్వామికార్యము బలిష్ఠమైన అశ్వముల కొనుగోలునకై చోళమండలమునకు ప్రయాణము. ఆ అశ్వములు మిక్కిలి బలిష్ఠమైనవి.ఆ బలము కేవలము శారీరకమే కాదు.యుధ్ధముచేసి విజయమో/వీరస్వర్గమో అను స్వభావముతో నున్నవి.ఇది కేవలము బాహ్యము. అయితే దీనిలో దాగిన అంతరార్థము ఏమిటి? అనే సందేహము మనకు కలుగవచ్చును. మన ఇంద్రియములే ఆ అశ్వములు.ఇద్రియవ్యామోహము వైపు మనలను మళ్లించే యుధ్ధమే అవి తీస్తున్న పరుగులు.ఆ యుధ్ధములో వాటికి విజయమైన /అపజయమునైన సమముగా తీసుకునే స్వభావము నిరూపించుటకు మనకు ఎందరెందరో మహానుభావుల జీవితములే ఉదాహరణములు. "అశ్వేభ్యో-అశ్వపతిభ్యశ్చః" ఆ అశ్వములను నియంత్రించగల అశ్వపతియే మన స్వామి.స్వామి వ్యూహముగా సృష్టించబడిన, అత్యద్భుత సుందరవనము ఆహ్వానిస్తున్నది మన ప్రధానమంత్రిని రమ్మంటూ, అక్కడ ప్రతి పుష్పము స్వామి పాదమే అక్కడ ప్రతి పులుగు స్వామి నామమే ఆ ఉద్యానవనపు పిలుపుతో, తిరుమాణిక్యవాచగరు జీవితములో ఏ మలుపు తిప్పబోతున్నాడో ఆ ఆత్మనాధుడు? నమః శివాయ వాళ్గా నాదన్ తాళ్ వాళ్గా. అంబే శివే తిరువడిగళే శరణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...