Monday, January 31, 2022

LAMCHAM DANDAKAM.

థిస్ ఇస్ జుస్త్ ఫొర్ ఫున్.(నొత్ తొ బ్లమె అన్య్ ఒనె.)ప్ల్ ఎక్ష్చుసె స్పెల్లింగ్ మిస్తకెస్ "లంచం"దండకం దాసోహమమ్మా,ఇహలోక సంచారిణి,బహురూప వరదాయినీ,చిద్రూప చింతామణి. ఓ విదుషీమణీ మస్కాలకు,నమస్కారాలకు ఆస్కారమే లేదంటు శూన్యమై, ధన,కనక,వస్తు,వాహనాదులకు ఆస్వాదనే వేదమంటు సూక్ష్మమై, మనోవాక్కాయ కర్మాభిలాషలను భేషుగ్గా అందించు ప్రత్యక్షమై, ఓ శుభలక్షణా తూర్పు తిరిగిన దండంబునకు ఓదార్పుగా పడమర చేరి కనుమరుగవని ఓ నేర్పుగా ఉత్తరువులందించు ఉత్తరపు ఓ మార్పుగా ప్రదక్షిణలు చేయించు ఓ కూర్పుగా ఓ పరాత్పరీ వీలుకానిదేదీ లేని పలు వీలునామాల నందించు వకీలుగా నైవేద్యో నారాయణో హరి కీర్తింపబడుచున్న ఆచారిగా మిథ్య విద్యాలయాలఓ గుణపాఠాలు నేర్పించే ఒకే ఒజ్జగా బీడుల-చివిటినేలల వరముల జడివానలు కురిపించు ఓ వరుణిడిగా అలివేణి కరుణామయి నీవు తాత్సారపు వాత్సల్యమా కార్యాలయాలకేరింతలాడు ఉత్సాహమా తారుమారులకు వీరతాడగు ప్రోత్సాహమా జతకూడననలేని ఓ ఈప్సిత ప్రదాయినీ,మూఢులు కాంచనంబొల్లకే ఇనుము కోరు చందంబునున్నారని , గ్రహింపచేసి,వారిని మార్చేసి, మరికొందరు నిన్ను ఈతరులకు ఉంచమని అందిస్తూ,లంచమని నిందిస్తూ,తుంచమని చిందులేస్తుంటే. నీవు వారిని .... సూతుడు శూరతనొందుట,శూరుడు నిర్వీర్యుడగుట(కర్ణుడు,ఏకలవ్యుడు) వరవిక్రయ క్రయములు,పూర్ణమ్మ ఆక్రందనలు,మహరాణుల అరణ ములు,విడిపోయిన భరణముల వివరణలు కావాలంటూ ,చిరు మందహాసములు చిలికిస్తూ,నయగారములు ఒలికిస్తూ,నిలదీసినావమ్మా నీ చాకచక్యముతో ఓ లోకేశ్వరీ నిన్నెరుగ నేనెం త వాడినమ్మా,నీ లీలలు ఎరుంగని నన్ను అవలీగా మన్నించి నాకు కనువిప్పు కలిగించి,బహు మెప్పు తరలించి,కొంగు బంగారమై,నన్నేలు ఓ కల్పవల్లీ నీవే సమస్తంబు,నమస్తే.నమస్తే,నమో నమ:.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...