Tuesday, January 4, 2022

PASURAM-21

శివ స్వరూపులారా!ప్రణామములు. మనము "తిరుపళ్ళి ఎళుచ్చి" అను తిరుమాణిక్యవాచగరు చే విరచించబడిన సుప్రభాత సేవలోని పది భాగములను పంచుకునే ముందు, ఆరుద్ర నక్షత్రదర్శనము, ఆత్మనాథ దేవాలయమూ గురించి, కొంచము ప్రస్తావించుకొందాము. ఇప్పటివరకు మనము తిరువెంబావాయ్ అను శివతత్త్వగ్రంధము గురించి,శివానుగ్రహముతో తెలుసుకునే ప్రయత్నమును చేసాము. మనము ప్రస్తుతము ఆరుద్రనక్షత్ర దర్శనము గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. వేదవిదులు ఆరుద్ర నక్షత్రమును ఆకాశమున దాని ఉదయమును అధ్యాత్మిక విజ్ఞానమునకు జన్మస్థానముగా భాఇస్తారు.మన చెలుల నోము ఫలించి ఆరు ఆరుద్రనక్షత్రమును దర్శించి,సామి అనుగ్రహపాత్రులై,తిరుపళ్ళి ఎళుచ్చికి/సుప్రభాత సేవకు ఉద్యుక్తులగుచున్నారు. ఇది ఆచ్యార్థము అనుకుంటే దీనిలో దాగిన ఆంతర్యము ఏమిటి అని మనము ప్రశ్నించుకుంటే, అరుద్రనక్షత్ర అధిష్టాన దైఅమైన రుద్రుడు, ఎర్రని-పచ్చని కాంతుల జ్యోతిరూపమై దర్శనమిచ్చే పుణ్యసమయము. చిదంబర నటరజ నృత్య పరమార్థమును గ్రహించగలిగే సదాకాశము. జ్యోతి సరూపముగా పరమాత్మ చేయుచున్న అద్భుత నృత్యకేళి. తిరువాదిరై/ఆరుద్ర నక్షత్ర దర్శనమను ఆధ్యాత్మిక ఆదిదేవ నైసర్గిక నృత్యము సమస్త జగములను శక్తివంతము చేయు సంకేతము.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...