Saturday, January 15, 2022

TIRUPALLI ELUCHCHI-09

తిరుపళ్ళి ఎళుచ్చి-09 ******************* విణ్ణక్కత్ తేవరుం నన్నవుం మాట్టా విళుప్పొరుళె ఉన తొళుప్పొడి యోంగళ్ మణ్ణగ తేవందు వాళచ్చేదానే వన్ తిరప్ పెరుంతురై యాయ్ వళి అడియోం కణ్ణగత్ తేనిన్రు కళిదరుతేనే కడలముదే కరుంబే విరంబు అడియాల్ ఎణ్ణగ తాయ్ ఉలగిక్కు ఉయిరం ఆనాయ్ ఎం పెరుమాన్ పళ్ళి ఎళుదరుళాయె. ....... త్వమేవ విద్వా నమృత ఇహభవతి నాన్యః పంధా అయనాయ విద్యతే ****************** పూదంగళ్ తోరున్ నిన్రాయ్ అంటు పరమాత్మ స్థూలరూపమును పరిచయముచేసిన మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో, న-ఇతి,నేతి, ఇది కాదు,ఇది కాదు అను సిధ్ధాంతముతో కానివాటిని గుర్తించి,వాటికి అతీతముగా నున్న దానిని పరబ్రహ్మముగా తెలుసుకోమని మనకు ఈ పాశురములో వివరిస్రున్నారు. చెలులు మొలబ్రహ్మాన్వేషనమును మొదలుపెట్తారు. వారు , విణ్ణక్కల్ తేవరు నన్నవు మాట్టా, ఆకాశవాసులైన సురలకు స్వామిపాదములు కనపడలేదు అని అంటున్నారు. ఇది బహిర్దర్శన సంకేతము.సామాన్యమైన చర్మచక్షువులతో చూడాలనుకోవటము. దానిలో దాగి,దానిని నడిపిస్తున్న శక్తిని గుర్తించలేకపోవటము.కనుకనే వారు, ఉలగిక్కు ఆనాయ్-ప్రపంచము నీవు, అని ఆగిపోకుండా, ఉయరిక్కు ఆనాయ్-అని అంటున్నారు. కేవలము పంచభూతాత్మికమైన ప్రపంచము మాత్రమే నీవుకాదు, పరమేశా! దాని ఉనికికి కారనమైన ఊపిరివి కూడా నీవే, అంటూ, ఓ చేతనులారా! యోపామాయతనవాం- నీలో సూక్షమముగా నిండిన బ్రహ్మము చేయుచున్న కదలికలు నీవు సుమా య ఏవం వేద ఇది నీవు కాదనలేని సత్యము. ఈ సత్యమును కనుక నీవు తెలుసుకోవాలంటే ఒకటే మార్గము,అది ఏమిటంటే, ఆయతనవాం భవతి- అంతర్ముఖమును పొంది,అంతర్వాసిగా నిన్ను నీవు మలచుకో అంటున్నారు. దాని వలన ప్రయోజనమేముంది అను సందేహము కలుగవచ్చును, దానికి వారు ఈ విధముగా, కణ్నగ తేనిన్రు-కళిదరు తేనె, అంతరంగ దర్శనముతో నీవు, కడల్ అముదే-అమృత సాగర అనుభవమును పొందుతాఉ.నీ మనసు స్వామి దివ్య పాదారవింద దర్శన భాగ్యమును పొంది,అమృతపానము చేస్తుంది. అట్టి శుభతరుణమున మనకు దర్శించుటకు,స్పర్శించుటకు మరొక పదార్థము కానరాదు.అదియే, అంతర్వ్యాప్తి-బహిర్వ్యాప్తి-సర్వవ్యాప్తి. అట్టి స్థితిలో.సముద్రము లోని కెరటము దానికి భిన్నముగా కాక సముద్రము యొక్క విశేషముగా భాసిస్తుంది.మూలము ప్రశాంతముగా ఉంటుంది.దాని శక్తి జలమున ప్రవేశించి అలల వలె పరవళ్ళు తొక్కిస్తుంది. మనలోని బ్రహ్మము సైతము నిర్వికారముగా నుండి,మన ఇంద్రియములకు తన శక్తిని ఇచ్చి కదలికలను చేయిస్తూ సాక్షిగా ఉంటుంది అన్న సత్యమును తెలుసుకొని,శివనోమును అంతర్ముఖత్వముతో నోచుకొనుటకు కదులుచున్నారు. ఈ రోజు పాండ్యరాజునకు-మాణిక్యవాచగరునకు మధ్యన నిలిచిన మారసంహారకుడు ఏమి గారడీలు చేయనున్నాడో. గుఱ్ఱములను రాజునకు అప్పగించి,గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆడాలన్నా/ఆడించాలన్నా నాకన్న మేటి ఆటగాడు లేడంటూ,అశ్వాలన్నింటిని అదృశ్యము చేశాడు.అంతటితో ఆగక వాటిబదులుగా గుంటనక్కలను రప్పించాడు.అవి పంటలు వేసుకుంటూ ఆడుకుంటున్నాయి.కొన్ని వెంటాడుతున్నాయి.మరికొన్ని అందినవాటిని పట్టుకుంటున్నాయి.పరుగులు తీస్తున్నాయి.ప్రమాదాలు తెస్తున్నాయి. అడ్డు-అదుపులేకుండా విడ్డూరాలు చేస్తున్నాయి. చూస్తున్న రాజునకు చేష్టలుడిగాయి.దానికి తోడుగా మాణి క్యవాచగరుపై కోపము కట్టలు తెంచుకుని పనిపట్టమంటున్నది. ఘోరేభ్యో-అఘోరేభ్యో నమో-నమః, ఘోర రూపముతో రాజు, అఘోర రూపముతో మాణిక్యవాచగరు, సదాశివుని సంసేవాభాగ్యములో నున్నారు. పెద్ద శిలకు మాణిక్యవాచగరును బంధించి,వైగీనదీతీరమున మండుటెండలో ,కాలే ఇసుకపై నుంచి,కఠినముగా శిక్షిస్తున్నారు. కదలని చిత్తముతో కరుణాంతరంగుని ప్రార్థిస్తున్నాడు మాణిక్యవాచగరు. అండ దండ అయిన ఆదిదేవుడు మాణిక్యవాచగరునకు కట్టిన గుదిబండను విడిపిస్తాడో లేదో తెలుసుకునే ప్రయత్నము రేపు చేద్దాము. అంబే శివే తిరువడిగళే శరణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...