Monday, February 28, 2022

GIRISAMCHA-ABHICHAKASI

గిరిశంచ-అభిచాకశీ **************** శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది. గిరిశంచ అను పదమునకు పెద్దలు, కొండయందు-మన గుండెయను కొండయందున్నవాడు, వేదములయందుండి జగములకు మోదమొనరించువానిగను, ఇచ్చిన మాటయందుండి-అభయమిచ్చి-ఆర్తరక్షణమును చేయువానిగను భావిస్తారు. సర్వ్యాపకత్వముతో తానున్నానని (నమకములో) చెప్పుటయేకాక, తాను ఎట్లా ఉన్నానంటే, తన ప్రకాశకత్వముతో సర్వ సమర్థవంతముగా చేస్తున్నాడు కనుకనే ఆ పరమాత్మ, గిరిశంచ-అభిచాకసీ. *************** నమకములో దర్శనీయమైనది చమకములో దర్శకత్వమై మనలను ఉధ్ధరిస్తున్నది.నమకములో దర్శించిన ఒక వెదురు చమకములో ఒక నిచ్చెనగా మారి మనలను ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చుచున్నది. చమక పారాయనము , 'అజ్ఞా-విష్ణుసజోష" అంటు అగ్ని-విష్ణు నామములుగల రెండు చైతన్యంతమైన శక్తులను ప్రార్థించుటతో ప్రారంభమవుతుంది.ఇవి ఆ సక్తుల కేవ వ్యవహారిక నామములా/ కావుకదా! అయితే సాధకుడు ఆ మహాద్భుతశక్తులను సూక్ష్మముగా తన శరీరములోనికి-స్థూలముగా విశ్వశరీరములోనికి ఎందుకు ఆరాధిస్తూ ఆహ్వానిస్తున్నాడు అన్న సందేహము మనకు కలుగవచ్చును. ఏమా అగ్ని? ఎవరా విష్ణువు? అన్న సందేహమునకు పెద్దలు ఏమి చెబుతున్నారంటే, మనలో నిద్రాణమై యున్న కుండలిని శక్తిని జాగృతపరచుట మొదటిపని. జాగృతమైన కుండలిని శక్తి ముడులు విప్పుకుంటూ సహస్రారమును చేరి,అమృతకలశము నుండి సుధాసారమును వర్షింపచేయుట రెండవ పని. కుండలిని జాగృతపరచు శక్తిని అగ్నిగా,దానిని వ్యాపింపచేయుశక్తిని విష్ణువుగా సార్థక నామధేయములతో ఆ పరమాత్మ సమర్థవంతములు చేయుచున్నాడు. వాజశ్చమే- ......... స్వామి నాకు పోషకత్వముకల ఆహారము/అన్నము కావాలి.దానిని భుజించుటకు తగిన ఆసక్తి/అర్హతయైన ఆకలిని నేను కలిగియుండాలి.దానిని జీర్ణముచేసుకునే( శక్తిని) నా శరీరము యజ్ఞనిర్వహణము కలదిగా యుండాలి.నా ఇంద్రియ యజ్ఞము నిరంతర నియమబధ్ధమై "యజ్ఞేన కల్పంతాం" గా ఉండాలి.అందులకు, శంచమే-మయశ్చమే. ******************** ఇహలోక సౌఖ్యమును-పరలోక సౌభాగ్యమును అందింపచేయగల, యంతాశ్చమే-ఆచార్యుడు కావలెను. అంతే కాదు అభ్యాస సమయమున నా మనసు, జ్యేష్ఠంచమ-ఆధిపత్యంచమే, ప్రతికూలతలను ఎదుకొనగలిగే స్థితప్రగ్నతతో నుండాలి. నా యజ్ఞ నిర్వహణ సమయమునందు నీవు,కార్య-కారణ సంబంధములకు సోదాహరణములుగా, అగ్నిశ్చమ ఇంద్రశ్చమే-సోమశ్చమ ఇంద్రశ్చమే, అంటు, మహేశ్వరత్వమును-మహేంద్రత్వముగా మలుస్తూ,కార్య-కారణ సంబంధమును విశ్లేషిస్తూ,జంటగా వచ్చి నా యాగ హవిస్సులను స్వీకరించు.వర్షములను కురిపించు. అశ్వమేథశ్చమే .............. యజ్ఞఫలితముగా అశ్వ శరీరముునుండి తలను వేరుచేసినట్లుగా,విషయవాస నలను శరీరమును-మేథస్సు అను తలనుండి వేరుచేసి(నరికివేయమనికాదు-తొలగించి) శివశక్త్యాత్మక భగవతత్త్వమును దర్శింపచేయుటయే మానవత్వముతో ప్రారంభించిన దీక్షను మాననీయ అవబృథస్నానముతో ముగించిన సాధకుని లక్ష్యము సకల మంగళములనొనరించుగాక.సన్మార్గమును చూపించునుగాక. సర్వే జనా సుఖినో భవంతు.స్వస్తి. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...