ottula gammattulu.
*****************
aksharamu vaeroka aksharamunaku/
hallu vaeroka halluku maddatugaa nilabaDaTaamiki okkokkasaari tanaku taanae renDugaa kanipimchaDaaniki tana roopamunu anuvugaa chasukunae prakriyanae ottugaa maari vachchicharuTa anukoevachchunu.
annimTiki sahaayapaDae uddaeSyamae unnappaTikini vaaTi svaroopamunu maachukonuTaku ishTapadani svabhaavamu kala konnimTini manamu choostaamu.
udaaharaNaku-ba,Na,...
marikonni saMpoornatyaagamooetulu.kaevalamu tama unikini maatramu teliyachaestoo svaroopamunu poortigaa maarchukunae svabhaavamu kalavigaa umTaayi.
ma-ya-ta-ra.....
I renDu vargamla svabhaavamu kaakunDaa madhyaemaargamugaa tana svaroopamuloeni talakaTTunu maatramu tolagimchikoni sahakarimchae svabhaavamu kalavi.sa.na.ka,ga,.....
konni padamulanu pariSeeliddaamu.
chichchubuDDi
Takkari nakka
pai padamuloe ch-ch-u=chchu gaa ErpaDinadi.taklakaTtunu maatramu tolagimchukoni cha aksharamuloeni/ ch hallu tanapaina unna gurtunu tolagimchukoni ottugaa maarinadi.
Di aksharamu tana kimda D loeni paina unna gurtunu tolagimchukoni vattugaa roopaamtaramu chemdinadi.
adaevidhamugaa renDava padamuloeni ka aksharamuloeni k hallu ottugaa maarpuchemdinadi.
pai padamulanu pariSeelitae okae aksharamu kramamugaa remDusaarlu,moDaTa akshararoopamugaa,tadupari hallu roopamugaa vachchi,padamunu arthavamtamu chaesinadi.renDusaarlu kanuka okae aksharamu padamuloe nunnadi kanuka A padamunu dvitvaakshara padamu ani amTaaru.
ఒత్తుల గమ్మత్తులు.
*****************
అక్షరము వేరొక అక్షరమునకు/
హల్లు వేరొక హల్లుకు మద్దతుగా నిలబడటామికి ఒక్కొక్కసారి తనకు తానే రెండుగా కనిపించడానికి తన రూపమును అనువుగా చసుకునే ప్రక్రియనే ఒత్తుగా మారి వచ్చిచరుట అనుకోవచ్చును.
అన్నింటికి సహాయపడే ఉద్దేశ్యమే ఉన్నప్పటికిని వాటి స్వరూపమును మాచుకొనుటకు ఇష్టపదని స్వభావము కల కొన్నింటిని మనము చూస్తాము.
ఉదాహరణకు-బ,ణ,...
మరికొన్ని సంపూర్నత్యాగమూఎతులు.కేవలము తమ ఉనికిని మాత్రము తెలియచేస్తూ స్వరూపమును పూర్తిగా మార్చుకునే స్వభావము కలవిగా ఉంటాయి.
మ-య-త-ర.....
ఈ రెండు వర్గంల స్వభావము కాకుండా మధ్యేమార్గముగా తన స్వరూపములోని తలకట్టును మాత్రము తొలగించికొని సహకరించే స్వభావము కలవి.స.న.క,గ,.....
కొన్ని పదములను పరిశీలిద్దాము.
చిచ్చుబుడ్డి
టక్కరి నక్క
పై పదములో చ్-చ్-ఉ=చ్చు గా ఏర్పడినది.తక్లకట్తును మాత్రము తొలగించుకొని చ అక్షరములోని/ చ్ హల్లు తనపైన ఉన్న గుర్తును తొలగించుకొని ఒత్తుగా మారినది.
డి అక్షరము తన కింద డ్ లోని పైన ఉన్న గుర్తును తొలగించుకొని వత్తుగా రూపాంతరము చెందినది.
అదేవిధముగా రెండవ పదములోని క అక్షరములోని క్ హల్లు ఒత్తుగా మార్పుచెందినది.
పై పదములను పరిశీలితే ఒకే అక్షరము క్రమముగా రెండుసార్లు,మొడట అక్షరరూపముగా,తదుపరి హల్లు రూపముగా వచ్చి,పదమును అర్థవంతము చేసినది.రెండుసార్లు కనుక ఒకే అక్షరము పదములో నున్నది కనుక ఆ పదమును ద్విత్వాక్షర పదము అని అంటారు.
marokapadamunu gamaniddaamu.idi Ta aksharamu-Ta vattu ki saMbamdhimchinadi.talakaTtuku badulu chinna geetanu tolagimchukoni vattugaa maarinadi.idiyunu ditvaakshara padamae.
paTTubaTTa,boTTupeTTu....
poortigaa maaripoeyina vattulugala padamulanu gamaniddaamu.
attakotta bomma.
remDusaarlu tavattu,okasaari ma ottuvachchaayi.
aksharamunaku-ottunaku svaroopamuloe saMbamdhamulaedukaani svabhaavamu okkaTae.
pabbamunaku kobbari bobbaTTu
asalu maarchanamToemdi ottu tana roopamunu ikkaDa.ayinaa sahakaaramae.
chinnakoyyabomma
mooDu vattulu poortigaa tamanutaamu maarchukunae svabhaavamu kalavi.
pachchaboTTu gurtu
mooDu vattulu mooDu vidhamulu.
cha talakaTTulaekuDaa-Ta geetalaekunDaa-ta poortigaa maaripoeyi.
chikkina go~r~retoeka betteDu
mooDu padamulaloe mooDu vidhamulaina vattulu kanipistunnaayi.
talakaTTulaeni kavattu
asalu maarani ~ra vattu
poortigaa maarina ta vattu.
nachchitae marikonni vaakyaalanu chaerchamDi.dhanyavaadamulu.
మరొకపదమును గమనిద్దాము.ఇది ట అక్షరము-ట వత్తు కి సంబంధించినది.తలకట్తుకు బదులు చిన్న గీతను తొలగించుకొని వత్తుగా మారినది.ఇదియును దిత్వాక్షర పదమే.
పట్టుబట్ట,బొట్టుపెట్టు....
పూర్తిగా మారిపోయిన వత్తులుగల పదములను గమనిద్దాము.
అత్తకొత్త బొమ్మ.
రెండుసార్లు తవత్తు,ఒకసారి మ ఒత్తువచ్చాయి.
అక్షరమునకు-ఒత్తునకు స్వరూపములో సంబంధములేదుకాని స్వభావము ఒక్కటే.
పబ్బమునకు కొబ్బరి బొబ్బట్టు
అసలు మార్చనంటోంది ఒత్తు తన రూపమును ఇక్కడ.అయినా సహకారమే.
చిన్నకొయ్యబొమ్మ
మూడు వత్తులు పూర్తిగా తమనుతాము మార్చుకునే స్వభావము కలవి.
పచ్చబొట్టు గుర్తు
మూడు వత్తులు మూడు విధములు.
చ తలకట్టులేకుడా-ట గీతలేకుండా-త పూర్తిగా మారిపోయి.
చిక్కిన గొఱ్ఱెతోక బెత్తెడు
మూడు పదములలో మూడు విధములైన వత్తులు కనిపిస్తున్నాయి.
తలకట్టులేని కవత్తు
అసలు మారని ఱ వత్తు
పూర్తిగా మారిన త వత్తు.
నచ్చితే మరికొన్ని వాక్యాలను చేర్చండి.ధన్యవాదములు.
No comments:
Post a Comment