***************************
padamuloeni hallulanu maarchakunDaa kaevalamu vaaniloeni guimtapugurtunu maaristae arthamu maarutumdaa anna samdaehamunaku samaadhaanamugaa konni padamulanupariSeeliddaamu.I maarpu kaevalamu padamuloeni modaTi aksharamu maatramae pomdinadi.
pada-poda
paga-poga
paddu-poddu
damDa-domDa
talachi-tolachi
kalata-kolata
parugu-porugu
pada pada mamTu-kamdam tokkaaru
podachaaTuna nilabaDinaaDu
paga yudhdhaaniki daariteestumdi.
nippulaekumDa pogaraadu.
chaakali paddu sarigaanae umdi
I poddu vaanapaDutoemdi.
pooladamDa amdamugaa umdi.
domDapaadu perugutoemdi.
talachi talachi baadhapaDaku
komDanu tolachi loepaliki veLLaaru.
parugupamdem jarugutoemdi
poruguvaaru mamchivaaru.
marikonni ichchia padamulatoe arthavamtamaina vaakyaalanu vraayamDi.
karoenaa gaDDu/goDDu kaalamu.tappu padamunu tolagimchumu.
kalimi/kolimi laemulu kaavaDikumDalu.
bheemuDu kamDalu/komDalu tirigina vaaDu.
I vaakyamulanu pariSeeliddaamu.
kamchamuloe komchamu annamu umdi.
kosaru aDigitae kasarukonuchunnaaru
kallalu palikaevaaru kollalugaa unnaaru.
poTTu paTtukoni unnadi paapa.
kolatalaenidi kadaa kalata.
marikonni padamulatoe abhyaasamunu poortichaeddaamu.dhanyavaadamulu.
పదములో అ మాత్రకు బదులు ఒ మాత్ర
***************************
పదములోని హల్లులను మార్చకుండా కేవలము వానిలోని గుఇంతపుగుర్తును మారిస్తే అర్థము మారుతుందా అన్న సందేహమునకు సమాధానముగా కొన్ని పదములనుపరిశీలిద్దాము.ఈ మార్పు కేవలము పదములోని మొదటి అక్షరము మాత్రమే పొందినది.
పద-పొద
పగ-పొగ
పద్దు-పొద్దు
దండ-దొండ
తలచి-తొలచి
కలత-కొలత
పరుగు-పొరుగు
పద పద మంటు-కందం తొక్కారు
పొదచాటున నిలబడినాడు
పగ యుధ్ధానికి దారితీస్తుంది.
నిప్పులేకుండ పొగరాదు.
చాకలి పద్దు సరిగానే ఉంది
ఈ పొద్దు వానపడుతోంది.
పూలదండ అందముగా ఉంది.
దొండపాదు పెరుగుతోంది.
తలచి తలచి బాధపడకు
కొండను తొలచి లోపలికి వెళ్ళారు.
పరుగుపందెం జరుగుతోంది
పొరుగువారు మంచివారు.
మరికొన్ని ఇచ్చీ పదములతో అర్థవంతమైన వాక్యాలను వ్రాయండి.
కరోనా గడ్డు/గొడ్డు కాలము.తప్పు పదమును తొలగించుము.
కలిమి/కొలిమి లేములు కావడికుండలు.
భీముడు కండలు/కొండలు తిరిగిన వాడు.
ఈ వాక్యములను పరిశీలిద్దాము.
కంచములో కొంచము అన్నము ఉంది.
కొసరు అడిగితే కసరుకొనుచున్నారు
కల్లలు పలికేవారు కొల్లలుగా ఉన్నారు.
పొట్టు పట్తుకొని ఉన్నది పాప.
కొలతలేనిది కదా కలత.
మరికొన్ని పదములతో అభ్యాసమును పూర్తిచేద్దాము.ధన్యవాదములు.
No comments:
Post a Comment