naenu jarigitae ani aksharamu-padamu
anukumTae Emavutumdoe?
**********************
saradaagaa okasaari aksharamu padamutoe annadaTa.naenemta mamchidaaninoe neeku telusaa? padanirmaaNamuloe paTishThataku naenu modaTiaksharamugaa konnisaarlu,remDava aksharamugaa,mooDava aksharamugaa,naalgava ashkaramugaa komchamukomchamu jarugutoo merisi/murisipoetumTaanu ani.okkaasaari choopistaavaa naaku arthamuchaesukoevaTaaniki annadaTa padamu Emee teliyanaTlu.Os alaagae a,Too ha aksharamu mumduku vachchimdaTa konnipadamulanu choopistoo.
1.hayamu
2.vihagamu
3.kalahamu
4.mudaavahamu
5.saevaasamoohamu ani amToo,amtaTitoe Agaka padamunu nuvvu jaragagalavaa ani aDigimdaTa daaniki padamu chirunavvutoe mimmalni amtae naaloeni aksharamulanu kadilimchi chellaachedaru chaeyakumDaa jaagrattagaa jarugutaanu amdaTa gambheeramugaa alaagaa okkasaari karigi choopistaavaa ani aksharamu aDugagaanae,
1.......hitamu
2......sahitamu.
3.....parahitamu
4....samaajahitamu
5...parasparahitamu amTumdagaanae
nuvvujarugutunnaa neeloeni hitamu Sabdamu daani bhaavamu maaraTamlaedu.
naenu jarugakalugutunnaanu gaani naa kottapadamulu kotta arthamulanisrunnavi ani komchamu tana uniki gurimchi aloechimchatamu modalupeTTagaanae padamu naa unikiki neevaekadaa moolamu nee uniki neeloe daagina achchu-hallulae kadaa kanuka evari pratyaekata vaaridae sadukupoedaamu bhaashanu marimta arthavamtamuchayuTaku anukonnaayaTa.
marikonnimTini jatachaeyamDi.
dhanyavaadamulu.
నేను జరిగితే అని అక్షరము-పదము
అనుకుంటే ఏమవుతుందో?
**********************
సరదాగా ఒకసారి అక్షరము పదముతో అన్నదట.నేనెంత మంచిదానినో నీకు తెలుసా? పదనిర్మాణములో పటిష్ఠతకు నేను మొదటీక్షరముగా కొన్నిసార్లు,రెండవ అక్షరముగా,మూడవ అక్షరముగా,నాల్గవ అష్కరముగా కొంచముకొంచము జరుగుతూ మెరిసి/మురిసిపోతుంటాను అని.ఒక్కాసారి చూపిస్తావా నాకు అర్థముచేసుకోవటానికి అన్నదట పదము ఏమీ తెలియనట్లు.ఓస్ అలాగే అ,టూ హ అక్షరము ముందుకు వచ్చిందట కొన్నిపదములను చూపిస్తూ.
1.హయము
2.విహగము
3.కలహము
4.ముదావహము
5.సేవాసమూహము అని అంటూ,అంతటితో ఆగక పదమును నువ్వు జరగగలవా అని అడిగిందట దానికి పదము చిరునవ్వుతో మిమ్మల్ని అంతే నాలోని అక్షరములను కదిలించి చెల్లాచెదరు చేయకుండా జాగ్రత్తగా జరుగుతాను అందట గంభీరముగా అలాగా ఒక్కసారి కరిగి చూపిస్తావా అని అక్షరము అడుగగానే,
1.......హితము
2......సహితము.
3.....పరహితము
4....సమాజహితము
5...పరస్పరహితము అంటుందగానే
నువ్వుజరుగుతున్నా నీలోని హితము శబ్దము దాని భావము మారటంలేదు.
నేను జరుగకలుగుతున్నాను గాని నా కొత్తపదములు కొత్త అర్థములనిస్రున్నవి అని కొంచము తన ఉనికి గురించి అలోచించతము మొదలుపెట్టగానే పదము నా ఉనికికి నీవేకదా మూలము నీ ఉనికి నీలో దాగిన అచ్చు-హల్లులే కదా కనుక ఎవరి ప్రత్యేకత వారిదే సదుకుపోదాము భాషను మరింత అర్థవంతముచయుటకు అనుకొన్నాయట.
మరికొన్నింటిని జతచేయండి.
No comments:
Post a Comment