జానపదమా/జ్ఞానపథమా
****************
ఎడ్లుపాయె-గొడ్లుపాయె
ఎనమదొరల మందమాయె
పూలగొమ్మ నేలపూసె
కందిరీగ కరిసిపోయె
కోడి పాయె లచ్చమ్మది
కోడిపుంజుపాయె లచ్చమ్మది
బండిపాయె బస్సుపాయె
నీటికుండ రైలుపాయె
మరలినేను సూడపోతే
గాలిమోటరెక్కిపోయె
అరె అరె అరె
దూడబోయె లచ్చమ్మది
లేగదూడబాయె లచ్చమ్మది
కొండబాట అత్తుంటే
కోయిలమ్మ కూత్తుంటే
వాగుబాటనొత్తుంటే
వాయిలాల సప్పుడాయె
పట్టనంత ఎగురుకుంటు
ఇంటిదారినొస్తుంటే
అరె అరె అరె
పోతుబాయె లచ్చమ్మది లేత పోతుబాయె లచ్చమ్మది
లచ్చన్న దారిలోన లంబాడియాతనాయె
సిగురారి సంతలోన పోతలింగని గంతులాయె
బంతిపూలు తెంపపోతే గుమ్మడొచ్చి కరచిపోయె
అరె అరె అరె
గంపబాయె లచ్చమ్మది పూలగంపబాయె లచ్చమ్మది.
ఎంతటి వాక్చమత్కారమో వారిది.దొరల దౌర్జన్యాన్ని హెచ్చరిస్తున్న ఈ పాట ఎంతో సందేశాత్మకనక తప్పదు.
ఎడ్లుపాయె గొడ్లుపాయె అంటున్నారు అవి ఎక్కడికిపోయినాయి అనగానే ఎనమదొరలమందమాయె అన్నారు.చివరికి కోడి పాయె పుంజుపాయె అంటున్నారు.ఇది ఎంతో నిగూర్థముతో నున్న పదము.ఒక విధముగా మహాభారత జూదములో ధర్మరాజు ద్రౌది సహితముగా ఓడి వనములపాలయినారి గంద అది యాదికి తెస్తున్నది.దొరికిన మందము దోచుకొనుడె అన్నట్లున్నది కంద.చిన్న/పెద్ద అని కూడా చూడకుండ లేగదూడ/లేగపోతు అనబట్టిరి.
అంతే కాకుండా బస్సుపాయె,నీటికుండ రైలుపాయె విజ్ఞానము పెరిగింది కాని వారి కష్టములకు విముక్తి లేకపాయె.మరలి సూడంగానే గాలిమోటరెళ్ళిపాయె.వారి ఆశలు నిరాశలాయె గంద.
రెండవ చరణమును గమనిస్తే పల్లెల్లో హాయిగా కొండబాటల్లో,కోకిలమ్మ కూతలతో నడుస్తున్న ప్రశాంతతను భంగము కలిగిస్తూ,ఆనందమును చెరిపివేస్తూ వాగు చప్పుడు తెర్చవలసిన వాయిదా చప్పుడును గుర్తుచేస్తూ గుండెల్లో గుబులు పుట్టెంచినప్పటికిని,గట్లనే దిగమింగి ఇంటిబాట పట్టినవానికి వాని గొడ్డుగోద మాయమాయె/దోచుకెళ్లిండ్రో/మిత్తికి జమకట్టిండ్రో గుబులాయె.
పోతులింగని గంతులేమో జాతరల సోపతేందో బంతిపూలు నేలపూసె గుమ్మడేమో కరచిపోయె
చేతికందిన పంటను అది ఇచ్చే బూమిని గుంజుకెళ్ళినారు అంటూ
గంపబాయె లచ్చమ్మది/పూలగంపబాయె లచ్చమ్మది అని దొరల దౌర్జన్యపుమును కళ్ళకు కట్టినట్లు
చెబుతూనే జర భద్రం కొడుకో అన్నట్లున్నది .
No comments:
Post a Comment