అమ్మా! కామాక్షి శరణం.
*************************
శ్రీ మాత్రే నమః
*************
" శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేత్"
భగవత్స్వరూపులారా! నమస్కారములు.
వాచక-కాయక-మానసిక పాపశేషములు జీవులను జన్మ అనే గుంజకు కర్మ అనే పాశముతో కట్టి,జనన-మరణ చక్రములో దారి-తెన్ను లేక తిరుగుతుండేలా నిర్దేశిస్తాయి.అమ్మలకన్న అమ్మ తన అవ్యాజకరుణతో (కరుణించుటకు మనకు ఏ అర్హత లేనప్పటికిని)మనలను ఉధ్ధరించుటకొక ఉపాధిని అనుగ్రహించి,మన కదలికలను ధర్మబధ్ధముగా జరుపుతు,మనలో మార్పులు తెస్తూ-తెస్తూ,ఏ మార్పులేని స్థితిని చేరుస్తుంది.పాశములను తొలగించివేసి,పశుపతితో/పశుపతిలో పరవశమయే భాగ్యమును ప్రసాదిస్తుంది.
తల్లి నిర్హేతుక కృపాకటాక్షమేమో,ఏ మాత్రము పట్టులేని నా చేతిని పట్టుకుని, ద్రవిడభాషా శిరోభూషణములైన కామాక్షి అమ్మ విరుత్తము-నటరాజ పత్తులను స్పూర్తులుగా అనుగ్రహించి,ప్లవ నామ సంవత్సర దేవీ శరన్నవరాత్ర పుణ్యసమయమున, తమిళము నా మాతృభాష(తాయి మొళి) కాకపోయినప్పటికిని,వాటి అద్భుతానుగ్రహములను అందరికి పంచవలెనను చిన్న కోరికను నా మనసులో చిగురింపచేసి,
" కామాక్షి-కామదాయిని" అను తెలుగు భాషారూపమును ప్రసాదించినది.నా ఈ దుస్సాహసమును మన్నించి,దీనిలో, నా అహంకారము చొచ్చుకుని చేసిన భావలోపములను-భాషాదోషములను సవరించి,నన్ను ఆశీర్వదించగలరని ప్రార్థన.
భక్తునకు-భగవతికి గల అనుబంధమును-అనుగ్రహమును చాటు ద్రవిడభాషా స్వేచ్చా భావ సంకీర్తనా సంప్రదాయములలోనిది విరుత్తము.రాగ-తాళ నిర్దిష్టత లేని కారణమున ,భక్తుని భావోద్వేగములను ప్రతిబింబిస్తూ,భగవతిని-ప్రశ్నిస్తూ-పశ్చాత్తాపపడుతూ,నిందిస్తూ-తనను తాను మందలించుకుంటూ,పరిపరి విధములుగా ప్రకటింపబడుతూ,ఫలితముగా పరమపదమునందిస్తుంది.ఇది కామాక్షి తాయి కరుణ.
కామాక్షి అమ్మ విరుత్తము ఆశువో-వ్రాసినది తెలియదు.
వ్రాసినవారి వివరములు తెలియదు.
అమ్మను అడిగే హక్కే కాదు,అమ్మలో దాగిన అయ్యను ప్రశ్నిస్తూ"నటరాజ పత్తు" పేర మనకు అందించిన శ్రీ మునుస్వామి మొదలియరు అవర్గల్ కు,అజ్ఞాత అవర్గల్కు (జ్ఞాత-అజ్ఞాత కవులకు) సభక్తిపూర్వక నమస్కారములతో,
నరియ నరియ వణక్కంగళ్.
1. సుందరి సౌందరి నిరందరి దురంధరి జ్యోతియాయ్ నిండ్ర ఉమయే
శుక్రవారత్తినునె కండ దరిశిత్తు వగళ్ తుంబత్తె నీకిడిడువాయ్
చింతితనె ఉన్ పాదం తన్నయే తులుపవరకళు తుయిరత్తె మాట్రి విడువాయ్
జగమెల్లాం ఉన్ మాయ పుగళ ఎన్నాలామొశిరియనాళ్ ముడిదిడాయె
సొంద ఉన్ మైందనాం ఎందనై రక్షిక్క సిరియ కడ ఉండడమ్మా
శివశివ మహేశ్వరి పరమనిలయేశ్వరి శిరోన్మణి మనోన్మణియు నీయే
అంతరి దురంధరి నిరంతరి పరంపరి అనాధరక్షకియు నీయే
అళగానకాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే.
****
సుందరి సుమంగళి నిరంతరి దురంధరి జ్యోతిస్వరూపమే నీవు
శుక్రవారమునాటి నీదివ్యదర్శనము కిల్బిషము కడతేర్చునమ్మా
నీ పాద చింతనమే భవతాపహరణము
భావనామాత్ర సంతుష్టవు
జగమంత నీ మాయలో మునిగిన తరుణాన నేనేమని కీర్తించగలను
నీ సొంత సంతతిని వేగమే రక్షించు బిరుదు నీకున్నదమ్మా
శివ శివ మహేశ్వరి పరమనిలయేశ్వరిశిరోన్మణి మనోన్మణియు నీవే
శాంకరి శుభంకరి యశోధరి పరాత్పరి అనాధరక్షకియు నీవే
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
*****
మొదటిభాగములో అమ్మయొక్క బాహ్య-అంతః సౌందర్య ప్రస్తావనతో ప్రారంభమైనది.శుక్రవార కామాక్షి దర్శన భాగ్యము ప్రశంసించబడినది.
తల్లి ఆవిర్భావము వెనుక దాగియున్న రహస్యములు చెప్పబడినవి
.
కాంచీ క్షేత్రము
*****
జగత్కళ్యాణమునకై ఆదిపరాశక్తి,తనను తాను శివ-శక్తి అను రెండు రూపములుగా ప్రకటించుకొని,శివ రూపమునకు స్థిరత్వమును-శక్తి రూపమునకు విస్తరణను నిర్దేశించుకొని,సూత్రధారుడైన స్వామి సంకల్పముతో తాను ఎన్నెన్నో నామరూపగుణ వైభవములతో క్షేత్రములుగా భాసిల్లుతు,పరమేశుని క్షేత్రజ్ఞునిగా ప్రకటింప చేయుచున్నది.
ప్రళయ జిత్/జయించినక్షేత్రముగా,సప్త మోక్ష పురములలో ఒకటిగా,ధర్మమునకు రెండు కళ్ళైన కాశి-కాంచి క్షేత్రముగా అలరారుచున్న కాంచిక్షేత్రముగా-
కామాక్షి తాయి,తన చల్లని చూపుతో కాపాడుతున్నది.కాంచీ క్షేత్రమునకు-కామాక్షి అమ్మకు భేదము లేదు.తపఃశక్తి దైవ శక్తితో మిళితమై స్థలమును క్షేత్రముగా సుసంపన్నము చేయుచున్నది
లోకములకు వెలుగును ప్రసాదించుటకు వారు చీకటిని నాంది చేసుకొని లీలను ప్రారంభించారు.అమ్మ అయ్యవారి కనులు మూయుట,తత్ఫలితముగా ప్రళయావిర్భావము-పునః సృష్టిలోని చీకటిని తరిమివేసే వెలుగును ప్రసరింప చేయుటకు,సకల చరాచరజీవరాశులను ఉధ్ధరించుటకు,తల్లి తనను తాను ఒక ఉదాహరణగా నిరూపించుటకు,ధర్మ-అర్థ-కామ-మోక్ష సాధనామార్గమునకు తార్కాణమైన తపోకామాక్షిగా కాంచి నగరములో కొలువైనది కామదాయిని .
జ్యోతి నిండ్రాయ్ ఉమయే
*****
****
భండాసురుని బారి నుండి భువన భాండములను సంరక్షించుటకు,
" చిదగ్ని కుండ సంభూతా దేవకార్య సముద్యతా" సత్తు-చిత్తు శాశ్వతప్రకాశ
లక్షణిగా ఆవిర్భవించినది.ఇది కథ.కాని ఇది భండ అజ్ఞానమును పారద్రోలు ప్రకాశమునకు సంకేతము.
శుక్రవార విశిష్టత
*********
నవగ్రహాలలో రాహు కేతువులను మినహాయిస్తే,వారములోని ఏడురోజులు ఏడుగ్రహ ప్రభావ సంకేతములుగా పరిగణిస్తే, భోగ కారకుడైన
శుక్రగ్రహ//శుక్లగ్రహ
ప్రభావదినముగా కామాక్షి అమ్మను శృంగార /శుభలక్షిణిగా // విశేషాలంకారము చేసి ,దర్శించి అలంకారసేవలో ధన్యులవుతారు.
కేన- అంచిత బ్రహ్మచే సేవింపబడిన కాంచి క్షేత్రములో వెలసిన కామాక్షి తాయి దివ్య తిరువడిగళే శరణం.
నరియ నరియ వణక్కంగళ్.
పచ్చ వైఢూర్యముం ఇచ్చయై ఇళదిట్ట పాద శిలంబొళియుం
ముత్తు మూకుత్తియం రత్తన పతకముం మోహన మాలై అళగుం
ముళుదు వైఢూర్యముం పుష్పరాగత్తినిల్ ముడితిట్ట తాళి అళగుం
చుత్తమై ఇరుకిండ్ర కాదనిల్ కమ్మలుం శెన్ కయ్యల్ పొన్ కంకణం
జగమెల్లాం విళై పెద్ద ముఖమెల్లాం ఒళువిద చిరుకాతు కొప్పిన్ అళగుం
అత్తివరదన్ తంగై శక్తిశివరూపత్తె అదయనాళ్ సొల్ల తిరమా
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్విడుం అమ్మ కామాక్షి ఉమయే.
********
ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు
చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును
ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం
గరళకంఠుని సతిగ మంగళముగ అలరారు తాళి ఘనము
శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు
జగములన్నింటికి వెలుగుతానైనది జనని నీ వదన మిహిర.
అత్తి వరదుని చెల్లి శక్తి శివ రూపిణివి అథముడిని వర్ణింపగా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే
***********
" సర్వారుణ అనవద్యాంగి-సర్వాభరణ భూషితా" అని లలిత రహస్యనామ స్తోత్రము కీర్తిస్తుంటే,ఆదిపరాశక్తి అద్భుత సౌందర్యలహరీ ప్రవాహములో మునకలు వేసిన ఆది శంకరులు "సౌందర్య లహరి" అను సాక్షాత్కారమును సకల కళ్యాణ ప్రదాయినిగా ఆవిష్కరించారు.
కామ కోటి-సౌందర్యమునకు హద్దుగా/తల్లి సౌందర్యమును మి,చినది లేదుగా,సమానాధిక వర్జితగా తల్లి ప్రతి వీక్షణము అళగు.
.ఆభరణములు అళగు.
అనుగ్రహము అళగు.
ఆశీర్వచనము అళగు.
తల్లి పాద-కేశాంతము అళగు.
అళగు అంటే అందము అనుకుంటే తల్లి అనుగ్రహమే అళగు.
అనుభూతియే అళగు.
అనునయము అళగు.
ఆ సౌందర్యము అనంత లహరీ ప్రవాహము.అఖండ తేజోవిరాజితము.అనన్య సామాన్యము.అపరాధ క్షమాపణము.
తల్లీ అధముడనైన నేను నీ వైభవమును ఏమని వర్ణించగలను?
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ" అనుకుంటూ,భావనలో,...
భావనామాత్ర సంతుష్టా అనుగ్రహమా అన్నట్లు,
అమ్మా, నా మొర ఆలకించి,నన్ను కరుణించదలిచావా,
ఒక్కసారి నీ పాద నమస్కార సౌభాగ్యమును ప్రసాదించు అని,
భావనలో తల్లి పాదములను పట్టు కొనిన నా నుదుటిని,
అమ్మ పదివేళ్లకు ధరించిన మెట్టెలు గట్టిగా వత్తుకుని,అమ్మ కరుణ నన్ను హత్తుకునేలా చేస్తున్నవేమో
.లత్తుక అలదిన పాదములను పట్టుకొను ప్రయత్నములో అమ్మ పాదమంజీరములు నన్ను తడిమి అభయమునిస్తున్నవా అన్నట్లు సవ్వడులు చేస్తున్నాయి.
"కుపుత్రా సంజాతే-కుమాతా నభవతి".కరుణాంతరంగ, వాలిన నా శిరమును లేవనెత్తుటకు కొంచము వంగి,తన తామరతూడులవంటి కరములతో నన్ను లేవనెత్తువేళ అమ్మ కంకణ ధ్వనులు తామును అనుగ్రహము ప్రసాదగుణ ధ్వనులను చేయుచున్నామనుచున్నవేమో,
బాహ్యమును మరచిన నేను అమ్మ కంఠహారములలో నవరత్న వజ్రవైఢూర్యముల నవనవోన్మేషకాంతులు నాలోని అజ్ఞానపు చీకట్లను తొలగించుటకు /తరిమివేయుటకు ఉద్యుక్తులై ఉజ్జ్వల ప్రకాశమాన భరితములైనవి.
ఆహా! ఏమి నా సౌభాగ్యము.అమ్మ ముత్యపు ముక్కుపుడక నన్ను సత్వగుణ సంశోభితుని చేయదలచినట్లున్నది.పుష్యరాగ
కాంతులతో సర్వమంగళ గళ విరాజమానమైన తాళి నన్ను మంగళానుగ్రహపాత్రుని చేస్తున్నది.
ఆళ్వారులచే "అత్తివరదన్" గా /వటపత్రసాయిగా కీర్తింపబడే వరదరాజస్వామి సోదరి సంసారప్రళయజలధి నుండి నన్ను రక్షించమని నీ దివ్య చరణములే
శరణమని నమ్మినానమ్మా.(అమ్మ నవరత్నభూషిత నవనవోన్మేషిని గా కీర్తింపబడినది.నవరత్నములు అమ్మదయతో స్వయం ప్రకాశకములైనవి)
.
మనది ప్రాకృత శరీరము.తల్లిది అప్రాకృత శరీరము.దానికి అమరిన/అలంకరింప బడిన ఆభరణములు కేవలము అలంకారములు కాదు ఆశీర్వాదములు అని అవగతమగుచున్నవేళ ,
క-అ-మ- గా త్రిమూర్తులను సృష్టించిన ,కాంచిక్షేత్రములో కొలువైన కామాక్షితాయి దివ్య తిరువడిగళే శరణం.
నరియ నరియ వణక్కంగళ్.
3. గదియాగ ఉందనై కొండాడి నినదుమున్ కురైగళై చొల్లి నిండ్రే
కొదుమయై ఎన్మీదిల్ పెరుమయై వీత్తునీ కుళప్పమై ఇరుప్పదేనో
సాధికారెండ్రునాన్ అరియమాల్ ఉందనై సదమాగ నంబినేనే
చేచాగిలుం మనదు వైతెన్నై రక్షిక్క సాధగం ఉనకిల్లయో?
మదిపోల ఒళివిట్ర పుగళ్ నెడుం కరముడయ మదగజన ఎండ్రతాయి
మాయనిద తంగయె పరమనదు మంగయె మాయనత్తిల్ నిండ్ర ఉమయె
అధికారి ఎండ్రునాన్ ఆశయాల్ నంబినేన్ అంబువైతెన్ని ఆళ్వాయ్
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే,
అంబకామాక్షి ఉమయే.
*******
నిన్ను నెరనమ్మి నీ పాదాలపై వాలి శరణుశరణన్నగాని
తగదమ్మ నామీద కనికరమునే మరువ,తాత్సారమది యేలనో
కఠినాత్మురాలవను విషయము తెలియక మనసార నమ్మినానే
క్షిప్రప్రసాదినిగ దాసుని రక్షింప జాగు నీకేలనమ్మా
వరమొసగు కరములు దరహాస ముఖముగల ఆదిపూజ్యుని తల్లివమ్మా
మాధవ సోదరి మాత పరమేశ్వరి మాయాస్వరూపిణివి నీవే
అధికారిణివి నీవు ఆశ్రయనిరాదరణ అప వాదు తగనిదమ్మా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
****
విరుత్తములో మొదటిదైన సుందరి..లో తల్లిని జ్యోతి స్వరూపముగా ప్రస్తుతించిన ఫలితమో ఏమో,పత్తు విరల్ అను రెండవ భాగములో తల్లిని తన భావనలో దర్శించగల భాగ్యవంతుడైనాడు. కటాక్షమునకు వేచియుండలేని తహతహ,గదియాగ...అను మూడవ భాగములో అధికారిణివి అంటూనే,తల్లితో తనకున్న చనువుతో నిందారోపణలను చేసుకునే అధికారమును స్వాధీనము చేసుకుని,తాత్సారము/ఆలస్యము చేయుట తగనిదని హెచ్చరిస్తున్నది.
హెచ్చరిక తల్లి నామమును-స్వభావమునకు తగిన బిరుదును గుర్తుచేస్తు తరలి రమ్మని మొరపెట్టుకుంటున్నది.
"ఎన్మనదు నడివిట్టు నీగాదు నిలువెత్తు ఏదుళు పుగళ్ వరువాయ్
"
తల్లీ నీ పాదముల ధ్యాసనుండి నా మనము కదలకుండుటకు నేనేమి చేయవలెనో తెలుపవమ్మా.
తల్లి సకలభువనములు నిన్ను మాధవసోదరిగా "ప్రస్తుతిస్తున్నాయి.
మా మాయొక్క ధవుడు మాయొక్క పరిపాలకుడు
. మాధవ
తంగచ్చి
ఆది పరాశక్తి వామనేత్రము నుండి (చంద్ర) నీలిరంగు కవలలు నారాయణుడు-నారాయిణి ఆవిర్భవించారని,గమన సంకేతమును నారాయణునిగా ,వాని సోదరిగా నిన్ను కీర్తించుచున్న వేళ నీవు నన్ను కరుణించుటకు కదలిరాకుండుట
,కఠినముగా ఉండుట నీకు తగనిది.
నామ సార్ధకతయే కాదు,స్వభావ సార్థకతకు కూడ నీ కఠినత్వము సరైనదికాదు.
నీ కఠిన హృదయమును కనలేని నీ భక్తులు నీవు నీ కృపాకటాక్షము అర్హతను లెక్కించక ఆదుకునే క్షిప్రప్రాసాదినివని కీర్తిస్తున్నారు.
అంతటితో తృప్తి చెందక ఆదిపూజ్యుడైన గణపతి దుష్ట సంకల్పములకు విఘ్నములను కల్పిస్తు, సరియైన వాటికి కలుగు విఘ్నములను తొలగిస్తు సిధ్ధి-బుధ్ధులను ప్రసాదించుట మాతగా నీవందించిన సంస్కారమే అని సన్నుతిస్తున్నారు.. నన్ను జాగుచేయక అనుగ్రహించినచో దానికి ఏ అపవాదము
లేక సార్థకమవుతుంది.
తన చూపుతోనే భక్తులను కొరతలేని/కొలతలేని ఆప్తకాములను/పూర్ణకాములను చేయు
కామదాయిని ఈ దీనుని పై దయతలచవమ్మా .
కామాక్షితాయి దివ్య తిరువడిగళే శరణం.
4.బూమియిల్ పిళ్ళయాయ్ పిరందు వలందు నాన్ పేరాన స్థలము అరియేన్
వామి ఎండ్రెన్నై శివగామి ఎండ్రెసొల్లి వాయినాల్ పాడి అరియేన్
మాతాపితా నినదు పాదత్తె నానుమె వనగి కొండాడి నరియేన్
స్వామి ఎండ్రెసొల్లి సద్రుదన్ కైకాపి చరణంగళ్ సైదు అరియేన్
సద్గురువు పాదారవిందైగళై కండు సాష్టాంగ దండ నరియేన్
ఆమింద బూమియిల్ ఆశయిన్ పోన్ మూఢ ఆశనీ కంద దరిదేన్
అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే,
**********
భూలోకమున ఎన్ని జన్మలెత్తినగాని ఏ క్షేత్రములు చూడలేదు
సత్పురుషులను దర్శించి భక్తితో వారిని ప్రస్తుతించినదియు లేదు
వామి నీవని, శివగామి నీవని తల్లి నిన్ను నోరార కీర్తించలేదు
మాతా పిత యనుచు పాదములు తాకి నే వందనము చేయలేదు
జ్ఞానులను గుర్తించి జాగరూకతతోడ సవినయ కైమోడ్పులీయలేదు
సద్గురువు పాదాలపై వాలి సాష్టాంగములు చేయలేదు
పరికించి చూచినను నా వంటి మూఢుడు
నీకెందు కానరాడు
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
************
అమ్మ ఆశీర్వచన భాగ్యమేమో ,ఈ విభాగములో సాధకుడు చేయవలసిన పనులను ప్రస్తావిస్తూనే,తాను చేయలేకపోయాననే పశ్చాత్తాపముతో పరమేశ్వరిని కరుణించమని పరిపరి విధములుగా ప్రాధేయపడుతున్నాడు.పుణ్యక్షేత్రముల,సత్పురుషుల,సద్గురువుల,జ్ఞానుల,మాతాపితల ఔన్నత్యమును కీర్తిస్తున్నాడు.వారిని గౌరవించవలసిన కనీస మర్యాదను తెలియచేస్తూ,కనువిప్పులేక తాను వాటిని నిర్వర్తించలేదని తనను తాను నిందించుకుంటున్నాడు.
వామి నీవని-శివగామి నీవని అను ప్రస్తావన వచ్చింది కనుక మనము ఒకసారి "నటరాజ పత్తు" లోని ఇదే విషయమును ఒకసారి ముచ్చటించుకుందాము.
"కడివెండ్ర పువిమీదిల్ అలయెన్ర ఉరుకొందు కనవెండు వాళ్వనంబీ"
పరమేశా! ఈ భూమి అనే సముద్రములో నిరంతరము కేరింతలు కొడుతున్నప్పటికిని తన ఉనికికి మూలము సముద్రమని గుర్తించలేని అలవలె,
తాయెండ్రు-సేయెండ్రు-నీయెండ్రు-నాయెండ్రు తమియేనే విణ్నవిట్టూ
తల్లని-పిల్లలని-నీవని-నేననని మాయ యనే సుడిగుందములో చిక్కుకొని,
ఉండుండు ఉరంగువదె -కండదె ఎల్లాదు,
నిద్రాహారములనుచు,
ఇరవు-పగలు- రేయి పవలు నేను మునిగియున్నవేళ,
ఇడైయెన్రు-కడైయెన్రు ఏడెండ్రు కేళాది రుప్పమన్ నడకాలమో?
నేను ఆ విధముగా అజ్ఞానములో ఎందుకున్నానని నన్ను ప్రశ్నించకుండుట నీకు న్యాయమేనా?
అని అయ్యను ప్రశ్నిస్తున్నాడు సాధకుడు
తనకున్న చనువుతో.
అమ్మను నిలదీస్తున్నాడు మన సాధకుడు నా మూఢత్వము గురించి తెలిసియు నన్ను హెచ్చరించక ,సవరించక ,కనికరించక ఉండుట నీకు తగనిదమ్మా అంటున్నాడు.
పెద్దలు మనకొక చిన్న ఉదాహరణతో సత్పురుషుల-జ్ఞానుల-సద్గురువుల -క్షేత్రములను మార్గదర్శకములుగా,మహిమోపేతములుగా ,కీర్తిస్తారు.
కన్ను దర్శనశక్తి కలిగిన ఇంద్రియమే అయినను తనను తాను చూడలేదు.అంతేకాదు తనను అనవరతము రక్షించుచున్న కనురెప్పను చూడలేదు.మనము మన కన్ను తనను-తన కనురెప్పను చూడవలెనన్న దానికి (కన్నాడి) అద్దము అవసరము.అదేవిధముగా భక్తుని-భగవంతుని అనుసంధానముచేసే వారే పైన చెప్పిన సత్పురుషులు-సద్గురువులు-జ్ఞానులు-మాతాపితలు.లోకకళ్యార్థము వారు ధర్మమును ఆచరిస్తూ ,సకల లోకములను భగవతి పాదములను చేర్చగల పరికరములుగా మారతారు
మన్మధునికి విజయమును అనుగ్రహించిన,కాంచి క్షేత్రములో కొలువైన మాత కామాక్షి,
దివ్య తిరువడిగళే శరణం.
5.పెట్రితాయెండ్రునై మెత్తవుం నంబినాన్ పిరియమై ఇరుందేనమ్మా
పిత్తలాయ్ తక్కారి ఎండ్రునాన్
అరియాదు ఉన్ పురుషనై మరందునమ్మా
భక్తనాన్ ఇరుండ
ఉన్ చిత్తముం ఇరుంగామల్ పారాముగం మిదుదుదాన్
బాలన్ నానెప్పడి విసనవిల్లామలె పాంగుడన్ ఇరుప్పదమ్మా
ఇత్తనై మోసంగళ్ ఆకాదు ఆకాదు ఇదు ధర్మమల్లలమ్మా
ఎందనై రక్షిక్క చింతైన
గిల్లయో ఇదినీది అల్లవమ్మా
అత్తిమగన్ ఆశయళి పుత్తరన్ మరందాదో అది ఎన్న కరుప్పరమ్మా
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే,
************
పాహియని రక్షింప పాదములు పట్టితిని జాగుచేయుట తగనిదమ్మా
ఇంత కాఠిన్యము ఎందును కనరాదు నీ పతిని మరచితినమ్మా
భక్తులను బ్రోవ నీ చిత్తమే కాకున్న పెడముఖము పాడికాదు
జాలియన్నది మరచి శిక్షింపగ నన్ను పక్షపాతము చూపకమ్మా
ఇంతటి మోసము సరికాదు సరికాదు ఇది ధర్మమనరే ఓ అమ్మా
సుంతైన రక్షించ చింతించకున్నావు ఇది నీతికాదె ఓ యమ్మా
కరిముఖునిపై ప్రేమ కనికరము మరచినది "కుమాతవు" నీవు కావమ్మా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
****
భక్తుడు తాను బాలకుడనని కనుక ఏ దోషములు చేయకుండా ఉండలేనివాడినని,తల్లీ నీవు పెట్ర తాయివి అని సంబోధిస్తున్నాడు.పెద్దమనసుకల తల్లివి.
బమ్మెర పోతన అన్నట్లు,
అమ్మలగన్న యమ్మ-ముగురమ్మల మూలపుటమ్మ-చాల పెద్దమ్మ-
చాల పెద్దమ్మ అయినప్పటికిని భక్తుని కరుణించుటకు మనసొప్పక పెడముఖము పెట్టినదట.అది తల్లి స్వభావము కానప్పటికిని,
పిత్తలాయ్-టక్కారి,
కావాలనే తన టక్కరితనముతో, ఆ టక్కరితనము పిత్తలాయ్-పరాకాష్టలో చూపుతు కనీసము ముఖమైన భక్తునివైపుకు తిప్పటములేదుట
.
తల్లీ నీ పెడముగము,నన్ను రక్షించుటకు తలచకుండుట వలన నీ భక్త రక్షణివి అన్న బిరుదుకు అపవాదు వచ్చును కనుక ఇంతటి మోసమును చేయుట నన్ను కనికరించకుండ ఇంతటి మోసము చేయుట,
నీయొక్క వైభవమునకు తగినది కాదు.
నీవింత కఠినాత్మురాలివని తెలిసి యుంటె నీ పతినే ప్రార్థించెడి వాడిని.ఆ విషయమునే మరచితిని అంటు ,
నటరాజ పత్తు లోని భక్తుడు చెప్పినట్లు,
" వందు వందు ఎన్రు ఆయిరం చొల్లియుం చెవియెన్న మందముందో"
నిన్ను రమ్ము రమ్ము అంటు లెక్కలేనన్ని సార్లు పిలిచినప్పటికిని నీ చెవులకు వినిపించలేదా, లేక
నీవు నాట్యమాడువేళ,
మానాడ-మళువాడ-మదియాడ-మంగై శివగామి యాడ-ఉలగు కూటమెల్లా యాడ-కుంజరముఖత్త నాద,
అంటూ నీ వారితో సంతోషముగా తాండవమాడుటేనా లేక దీనులను రక్షించుటను కూడ ఆలోచిస్తున్నావా/లేదా అని ఉపేక్షను ఆరోపిస్తున్నారు.
దంతి ముఖుడు-ఆరుముఖముల వాడు ఇద్దరే నీ పిల్లలనుకుని,మమ్ములను నీ పిల్లలుగా భావించుట లేదేమో అని నిష్ఠూరములాడుతున్నారు.
బాలకులు దోషరహితులుగా ఉండరన్న విషయమును గమనించక ఉన్నప్పటిని,
ఇందుల నీరేడు మేనలత్తిల్ తాయి సొల్లు ఇనియం విడువదిల్లై.
నీ పాదములను విడువను అంటు మాతృకా వర్ణస్వరూపిణి-ఆ బ్రహ్మ కీటక జననిని పశ్చాతాపముతో తల్లీ నీవు అవ్యాజకరుణామూర్తివి అయినప్పటికిని గజముఖునిపై ప్రేమ నిన్ను జగదోధ్ధరణకు సుముఖము చేయకున్నది.మేమందరము మీ పిల్లలమే తల్లీ సరగున వచ్చి నన్ను రక్షించి,
"కుపుత్రా సంజాతే-కుమాతా న భవతి" అను ఆర్యోక్తిని రూఢిచేయితల్లి అని కరుణావీక్షణ కామాక్షితాయి దివ్య తిరువడిగళే శరణం అంటున్నాడు.
నరియ నరియ వణక్కంగళ్
6.మాయవన్ తంగైనీ మరకతవల్లినీ మణిమంత్ర కారిణీయె
మాయా స్వరూపిణీ మహేశ్వరియునీ మలై అరసన్ మగళాననీ
తాయి మీనాక్షిని సద్గుణవల్లినీ దయానిధి విశాలాక్షిణీ
దారణిల్ పెయ్పెట్ర పెరియనాయగియు నీ
శరవణనయీండ్ర వళుమీ
పేయ్గలుడ నాదినీ అత్తనిద బాగమది పెరుపేర వళందువళనీ
ప్రణవస్వరూపిణీ ప్రసన్న వల్లినీ పిరియ ఉన్నామలయునీ
ఆయి మగమాయినీ ఆనందవర్షిణీ అఖిలాండవల్లి నీయే
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
****************
మాధవుని సోదరివి మరకత వల్లివి మంత్రస్వరూపిణివి నీవే
మాయా మహాశక్తి మాహేశి మానిని మలయాచలేశు పుత్రీ
మాత మీనాక్షివి సద్గుణవర్షిణివి దయానిధి విశాలాక్షివి
జగములను పాలించు జగన్నాయకి నీవు శరణాగత రక్షకి
శివ వామభాగిని భువనైక మోహిని చిత్స్వరూపిణివి నీవే
ప్రణవ స్వరూపిణి అరుణాచలేశ్వరి అఖిలాండమంత నీవే
ఆర్త జన పోషిణీ ఆనందవల్లినీ అఖిలాండ సంధాయినీ
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే అంబ కామాక్షి ఉమయే.
**************
" అరుణాం కరుణాంతరంగితాక్షిం
ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం
అణిమాదిభిరావృతాం మయూఖైః
అహమిత్యేవ విభావయేం భవాని."
అమ్మ వీక్షణమే ఈక్షణశక్తి.ఇఛ్చాశక్తి.మధురలో మీనాక్షిగా,కంచిలో కామాక్షిగా,కాశిలో విశాలాక్షిగా తల్లి అనుగ్రహమును వర్షిస్తున్నది.
అమ్మ" మలై అరసన్ మగళాననీ-"మంచుకొండల రాజ పుత్రి.కరిగే స్వభావము మంచుది.కరుణతో కరిగే స్వభావము మన అమ్మ కామాక్షిది.తల్లి కరుణామృతవర్షములో మునకలు వేస్తూ,
హిమగిరి తనయే హేమలతే
అంబ ఈశ్వరి శ్రీ లలితే అని ,
అని తల్లిని ప్రస్తుతించారు శ్రీ ముత్తయ్య భాగవతారు.
మన సాధకుడు,
అమ్మా నీవు హైమవతివి మాత్రమే కాదు,అరుణాచలేశ్వరివి.సర్వ పాపములను దహించివేసే ఆదిపరాశక్తివి (అగ్నితత్త్వము) నీవే అంటు ,అమ్మను ప్రస్తుతిస్తూ,
తల్లి నీ కరుణా కటాక్షమే వివిధ నామరూపములలో భాసిస్తున్నదని నా దోషములను దహించివేసి,నీ చల్లని చూపుతో ధన్యుని చేయి అని వేడుకుంటున్నాడు.
శ్రీ లలితా రహస్య సహస్ర నామములో కీర్తించినట్లు,
"వ్యాపిని వివిధాకార విద్యావిద్యా స్వరూపిణి" అన్న అమ్మ సర్వ వ్యాపకత్వమునకు సందేహములేదు.
ప్రహ్లాదుడు చెప్పినట్లు ,
ఎందెందు వెతికి చూసిన అందందే గలడు దానవాగ్రణి,అని నుడివినట్లుగా,
విరుత్తములోని ఈ భాగము అమ్మ కన్నుల జాలువారు కరుణను,దర్శింప చేస్తున్నది.
" రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి
రక్షించు జగదీశ్వరి అని కీర్తిస్తూ
,
కంచి కామాక్షి-మధుర మీనాక్షి-కాశి విశాలాక్షి "కాంతి మహాదేవి గా మంగళ హారతిని అందించిన అజ్ఞాత కవి, ముగ్గురు తమ వీక్షణమాత్రముననే క్షిప్రప్రసాదత్వమును ప్రసాదిస్తున్నారని చెప్పకనే చెప్పారు..
*******
"మణ్నాది భూతములు విణ్ణాది అండమ్ని మదియునినడిబుదియే
మదియున్ని రవియున్ని పునలున్ని అనలున్ని మందల విరండేడు నీ
పెణ్ణుమ్ని ఆణుమ్ని పల్లుయున్ కుయిరిన్ని పిరవున్ని ఒరువన్ నీయే
వేదాది వేదమ్ని పాదాదికేశమ్ని పెట్రితాయి తందనీయే
పొన్నున్ని పొరుళున్ని ఇరుళన్ని ఒళియున్ని బోధక్కవందుగురుని
పుగళ్నాగ్ కిరకంగళ్ ఒంపదం నీమీద భువనంగళ్ పెట్రవరునీ
ఎన్నిరియ జీవకోటిగళిండ్రు వప్పనే ఎన్ కురగళాల్ కురైప్పేణ్
ఈశనే శివగామి నేశనే ఎన్ ఇండ్ర తిల్లైవ నటరాజనే."
అంటూ,
నటరాజ పత్తు లో సాధకుడు ఇదేవిషయమును
" మణ్ణాది బూతములు-విణ్ణాది అంటు భూమ్యాకాశములు,
మదియున్ని-రవియున్ని-సూర్య-చంద్రులను,
,పునలున్ని-అనలున్ని-మంచుని-నిప్పుని,
మండలమిరండేదు-పద్నాలుగు భువనములను,
పెణ్నున్ని-ఆణ్ణున్ని-స్త్రీ-పురుషులను
,ఇరుళన్ని-ఒళియున్ని-చీకటి-వెలుగులను
ఒన్ పది కిరకంగళ్-తొమ్మిది గ్రహములను,
,
పొణ్ణున్ని-పొరుళున్ని-అనేక జీవరాశులను,
వేదాది వేదుడిని-వేదాదివేద్యుడు,
పాదాది-కేశముని-ఆపాద మస్తకముని సృజించి,
అంతే కాదు,చీకటితో నిండిన శిష్యునికి,
అజ్ఞానమును తొలగించే వెలుగైన గురువుగా,
" బోధక్క వందు గురునిగా ప్రకాశించు,"
నిన్నేమని నేను చెప్పగలను,
అసలు ఇది-అది అని కాదు
"న్ నరియ జీవకోటింగళిండ్రు అప్పనే"
-
సకల చరాచర జీవరాశులనిటి సం రక్షకుడవైన తండ్రివి ,
భువనంగళ్ పెట్ర వరునీ-నీవే పెద్దమహాదేవుడవని
ప్రస్తుతిస్తూ,
ఎన్ కురగళాల్ కురైప్పేన్-
నా దోషములను కనుమరుగు చేసి కనికరించు అని వేడుకుంటున్నాడు.
స్వామిని పెట్రవాన్ అన్నట్లుగానే,మన అమ్మను పెరియ నాయగి /జగన్మాత ,ఓ శివ వామ భాగిని,కరుణామృత వర్షిణియైన
తాయి కామాక్షి నీ దివ్య తిరువడిగలే శరణం.
అంటూ, అనేకానేక నమస్కారములతో
(నరియ నరియ వణక్కంగళ్.)
పేయ్పిళ్ళయాం నాళు తాన్ పెట్ర పిళ్ళయై పిరియమాయ్ వలర్క విలయో
కల్లాగిలుం మూచు నిల్లామల్ వాళ్విడుం
కదరినాన్ అళుద కురలిల్
కడిగితరి నట్టినురు కూరుమదిలాగిలం కాదినిల్ దుళువదిలలో
ఇల్లాదవన్ మంగళ్ ఎన్మీదిల్ ఏనమ్మ ఇని విడువత్తిల్లై చుమ్మా
ఇరువురుం మదిపిడితు తెరుతన్నిల్ వీళ్వదు ఇదు దరమం నుల్లరమ్మా
ఎల్లోరం ఉన్నయే సొల్లియే యేసువర్ ఇది నీది అల్లావమ్మా
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే.
**************
శ్రీ మాత్రే నమః
**************
అల్లరి పిల్లల బుగ్గ గిల్లియు తల్లి బుధ్ధులను నేర్పించదో
పెనుభూతమైనను తన పిల్లలను మిగుల ప్రేమతో పెంచునమ్మా
ఆయాసపడుచున్న నా ఆర్తనాదమును పెడచెవిని పెట్టకమ్మా
ఆవగింజంతైనను జాలిలేదా నీకు కఠినశిల కరుగునమ్మా
ఆనవాలే లేని అన్ని అపరాధములు విడిచిపెట్టక ఉండకమ్మా
హెచ్చైన కరుణతో వచ్చి రక్షింపక రచ్చ చేయుట తగనిదమ్మా
దయలేని దానివను పదిమంది వేసేటి నింద నీకేల నమ్మా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.అంబ కామాక్షి ఉమయే.
***************************
" సరోజ దళనేత్రి-హిమగిరి పుత్రీ
నీ పదాంబుజములే సదా నమ్మినానమ్మా. ( శ్రీ శ్యామ శాస్త్రి.)
శుభమిమ్మా-
తల్లీ ! ఈ దీనుని కనికరించుటకు కదిలిరాకున్నావు.వరదాయినివైన నీవు పరాకు చేయుచున్నావు.
నేను పాపినని/రక్షించుటకు తగినవాడిని కానని అనుకుంటున్నావా/లేక నేను నిన్ను రక్షిపలేనని నన్ను నమ్మింప దలచినావా?
కోరి వచ్చిన వారికెల్లను కోర్కెలొసగే బిరుదు కదా-అయినను,
అతిభారమా నన్ను బ్రోవ-నే తాళజాల, తరలి రావమ్మా నన్ను బ్రోవ అని నేను నిన్నే శరణము కోరి వచ్చియున్నాను.
" హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః" శ్రీ లలితా రహస్య సహస్ర నామ స్తోత్రము.
అమ్మా నీ మాతృవాత్సల్యము నీ కరుణావీక్షణమనే సంజీవినిచే,పరమేశుని ఫాలనేత్రాగ్నిచే దహనము కావింపబడిన మన్మథుని పునర్జీవితుని కావింప బడినప్పుడే
ఋజువైనవి
కనుక ఆలస్యము చేయకు నన్ను ఆదరించుటకు.
" నటరాజ పత్తు" లో,
ఇదే విధమైన విన్నపమును పరమేశునికి చేస్తూ,పిల్లలమైన మేము అల్లరి చేయకుండా ఉంటామా? అదే నీ పిల్లలైన వినాయకుడు కుమారస్వామి అల్లరి చేస్తే వారిని సరిదిద్దక ఊరుకుంటావా అని అడుగుతునే, ఇంకొంచము చనువుతో అయినా నేను,నిన్ను ఏమన్నా,
" పంపు శూనయమెల్ల వైపల్లి మారణం తంపనం వశియమెల్లా
పాతాళ మంజనం పరకాయ ప్రవేశం మధుమల్లా సాదమల్లా
అంబు కుళిగం విళిగం మొళిందు మందిరమెల్లా"
అయినా నే నిన్ను ఏమైన కనికట్టు చేయమన్నా/నన్ను కదలకుండా చేయమన్నా/పాతాళమునకు వెళ్ళమన్నానా/పరకాయ ప్రవేశము చేయమన్నా/విషమును తేనెగా భావిస్తూ/పోనీ అమృతమనుకుంటూ సేవించమన్నానా? అసలు అనలేదే!
నిన్ను చేయమనలేదు.కనీసము నాకొరకు నిన్ను అసాధ్యమైన పాశుపతాస్త్రము వంటి అస్త్రములను యుధ్ధములో విజయమునొందుటకు ఇమ్మనలేదే
అసలు నేను నిన్ను ఏమని కోరుకుంటున్నాను
నా దోషములను సవరించి సన్మార్గమును చూపమని కాని నీకు
" ఇరు సెవియు మందమో-కేలాడ అందమో"
రెండు చెవులు సరిగా వినిపించుటలేదో లేక
వినపడనట్లుగా నాతో ఆడుకోవాలనిపిస్తున్నదో
అయినా నీ పాదములను
ఉన్ వడి విడువనెల్లా అంటున్నాడు.
అమ్మా అయ్య వలెనే నీవును నాతో వినపడనట్లు ఆడుకో దలిచావా?
లేకపోతే
" ఎల్లారుం ఉన్నయే" అంతా నావాళ్ళే అంటూ,
సొల్లియే ఏసువర్-అభయవాక్యములు పలుకుతూ-వరములనిస్తానంటూ,
కదలిరాకున్నప్పటికిని,
" ఇల్లాద వన్ మంగళ్ ఎన్మీదిల్ ఏనమ్మ ఇని విడువ నత్తిల్లై చుమ్మా"
నన్ను రక్షించి మంగళములను సమకూర్చే
భారము నీదే.నను కటాక్షించే వరకు నీ పాదములను విడువను అని పట్టుపట్టిన సాధకుని,కరుణించబోతున్న,
కామాక్షి తాయి దివ్య తిరువడిగళే శరణం.
నరియ నరియ వణక్కంగళ్.
మై ఎండ్రు పొయిసొల్లి కయితనిల్ పొరుళ్ తట్టి మోసంగళ్ పన్నినేనో
ఎన్నమో తెరియాదు ఇక్షణం తన్నిలె ఇక్కట్టు వందదమ్మా
ఏలైనాళ్ సెయిద పిళై తాయ్ పొరుళ్ అరుళ్ ఎన్ కవళై తీరుమమ్మా
చిన్నంగళాకాదు జయమిల్లయో తాయె శిరునామమగుదుదమ్మా
శిందనై ఎన్మీదిల్ వైదునరు భాగ్యమరుళ్ శివశక్తి కామాక్షి నీ
అన్నవాహనమేరి ఆనందమాగో ఉన్ ఆడియేన్ మున్వందు విరప్పాయ్
అలగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మకామాక్షి ఉమయే.
******************
ఎన్ని జన్మలలోన ఎన్నెన్నో పాపములు మూఢునిగ చేసినానో
కల్లలెన్నో పలికి చేతివాటము చూపి మోసములు చేసినానో
ఏమిటోతెలియదు ఈ క్షణము తరుముచు ఇక్కట్టు వచ్చెనమ్మా
గొప్ప మనసుతో నీవు తప్పించకున్నను
నా కలత తీరదమ్మా
అపరాజితవు నీవు అపరాధినే నిన్ను ప్రార్థించుచుంటినే అమ్మా
చిన్నబుచ్చక నన్ను మన్నించుటయు నీదు కాదనలేని కరుణయేనమ్మా
హంస వాహినివిగా ఆనందదాయివై దరిశనమునీయవమ్మా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే-
అమ్మ కామాక్షి ఉమయే.
******
" ఉన్ అడియేన్ మునవందు విరప్పాయ్"
అదియును,
అన్నవాహనమేరి-హంస వాహినియై,
ఆనందమాగో-ఆనంద స్వరూపిణివై.
ఐహిక సుఖముల వలన లభించే సత్ఫలితములు సంతోషమును కలిగిస్తాయి.కాని అవి శాశ్వతములు కావు.తాత్కాలికములే.కాలమునకు వాటిని కబళించే సక్తి ఉంటుంది.
ఆముష్మికము వలన లభించే సత్ఫలితములు ఆనందాన్ని కలిగిస్తాయి.ఆనందము కాలపరిమితిని అధిగమించి అలరారుతుంది.
తల్లీ నీవు ఆనందముగా/ప్రసన్నముగా సాక్షాత్కరించమని తనను ఆనందమయునిగా ఆశీర్వదించమని అమ్మను వేడుకుంటున్నాడు సాధకుడు.
తల్లీ కామాక్షి నా ముందుకు వచ్చి,నీ పాదదర్శన భాగ్యమును ప్రసాదించుతల్లీ!
నేను నీదరి చేరలేని అశక్తుడను ,అజ్ఞానములో మునిగియున్న వాడను కనుక జ్ఞానదాయిని నిర్హేతుక కృపతో హంసవాహినివై నా ముందుకు వచ్చి,నీ పాదసేవా భాగ్యమును అనుగ్రహించు తల్లీ అని ప్రార్థిస్తున్నాడు సాధకుడు.
" హంస వాహ సమాయుక్తా విద్యాదాన కరీ మమ" అని సరస్వతీ స్తోత్రము .
సత్యముకానిదానిని సత్యమనుకొనుట-సత్యమైన దానిని అసత్యమనుకొనుటయే అవిద్య.అన్నింటిలో దాగిన ఏకత్వమును గ్రహించలేకుండట.జ్ఞానమును పట్టుకొనుటకు దారులు వెతుకుట-పరుగులు తీయుట.ఫలితమును కనకుండుటయును అవిద్యయే.
.
మనలో ఉన్నదానిని చూడలేక ,మరుగున ఉన్నదనుకొనుట మాయ.
జగద్గురువులు 'సౌందర్యలహరి"లో అమ్మా! భగవతి నీవు "అవిద్యానం అంతర్ తిమిర మిహిర లహరి"వని తల్లీ !
మాలో నున్న నీ చైతన్యమనే వెలుగు ,మా మనసులో నిండియున్న చీకట్లను పారద్రోలే ప్రకాశమమ్మా అని ప్రస్తుతించారు.
.
ఈ భాగములో సాధకుని అంతరంగ చీకటి అమ్మదయతో కొంచము కొంచము తొలగుచు,తన తప్పిదములను ఒక్కొక్కటిని గురుతు చేస్తూ,పశ్చాత్తపముతో పరివర్తనము చెంది అమ్మ దయకై ప్రాధేయ పడునట్లు చేస్తున్నది.
ముడుచుకు పోయిన జ్ఞానము మూఢత్వమై ఇక్కట్టుగా/ఇబ్బందిగా తరుముచు వచ్చుచున్నది.
నేను పూర్వజన్మలలో ఏ ,ఏ పాపములను చేసినానో కదా!
అదియును
వినోదమునకై చేసినానో/విలాసమునకై చేసినానో/విర్రవీగుతూ చేసినానో తెలియదు.
ఒకటేమిటి? లెక్కలేనన్ని.చెప్పలేనన్ని.
పొంచి ఉంచి నిన్ను తుంచివేయు పూర్వపాప కర్మ-పేర్మి తోడ.అన్నారు పెద్దలు.
నటరాజ పత్తు లో సాధకుడును ఇదే విధముగా,
" వళికండు ఉన్నడే తుదియాద పోదిలం" అమ్మా/అయ్యా నాకు దారి కనిపించుటలేదు.కనిపిస్తుందని అనిపించుటలేదు.
"మోసమే చెయ్యనుం-దేశమే కవరినుం"
మోసముతో దేశాన్ని గెలవాలనుకున్నానేమో,
అమ్మా నేను ఈ జన్మలోని తెలివితక్కువతనమునకు బాధపడనా లేక,
" ఎన్ మున్ పిరవిన్ కడవనో-"
నా పూర్వజన్మల గురించి తలచుకొని బాధపడనా అను తికమకలో నున్నానమా.
అసలు నా పూర్వ జన్మలకు కారణము,
శ్రీ ములుగు పాపయారాధ్యులవారు తన దేవీ భాగవతములో సెలవిచ్చినట్లు,
" తల్లులకెల్ల తల్లియగు తల్లిని కానగలేక ఎందరో
తల్లుల గర్భకోశమున తానుదయించుచు జన్మజన్మలున్
తల్లుల సంతరింతురిల ఓ పరశక్తి నీవె మా
తల్లివటన్న మాత్రమున ఇక తల్లులు లేర్కదా ధరిత్రిపై."
అన్న సత్యమును గ్రహించలేక,
"పునరపి జననం-పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం."
అనుకుంటు కలవరవడుతున్న నన్ను,జ్ఞాన సంకేతమయిన హంసను ఎక్కివచ్చి,,జ్ఞాన స్వరూపమైన కామాక్షి అమ్మా!కరుణించి నా కలతను పారద్రోలుము. ,హంసవాహినివై సాక్షాత్కరించి,నాలోని అజ్ఞానమును పారద్రోలి నన్ను అనుగ్రహించవమ్మా,అని ప్రాధేయపడుతున్న సాధకుని త్వరలో అనుగ్రహించబోతున్న కామాక్షి తాయి దివ్య తిరువడిగలే శరణం.ఎందనైపోలవే జననం ఎడుత్తోర్గల్ ఇంబమాయ్ వాళ్దిరిక్క
యాన్ సెయిద పావమో ఇత్తనై వరుమయిల్ ఉన్నడియె తవిపదమ్మా
ఉన్నయాయ్
తుళ ఎండు ఉరుదియాయ్ నంబినేన్ ఉన్
పాద సాక్షియాగ
ఉన్న ఎడి వేరుతునై ఇని యూరయుం కాని
ఉలగం తనిల్ నెందనెక్క
పిన్న ఎండ్రెండ్రు
నీ సొల్లామల్ ఎన్
వరుమయె పోకడిదు ఎన్నై రక్షి
బూలోగం మెచ్చవే బాలమార్కండ పోల్ పిరియమాయ్ కాతిదమ్మా
అన్నయె ఇన్ను మున్ అడియేనె రక్షిక్క అడ్డి సేయాదే అమ్మా
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే,
అమ్మ కామాక్షి ఉమయే.
*********************
ఎందరో నావలె జన్మమెత్తిన గాని ఆనందమొసగినావే
నా పూర్వ పాపమే తరుముతు వచ్చినది నీ చరణమె శరణమమ్మా
నీవె నా అభయమని నెరనమ్మినానమ్మ నీ పాదమె సాక్షి కాగా
నిన్ను మించినవారు వేరెవరు కనరారు ఎన్ని లోకములు గాలించినా
సమయమిది కాదని నువు జాలమే చేసినచో దీనునికి రక్ష ఎవరు?
భువనములు కీర్తించ బాలమార్కండేయుని బ్రతికించినట్లుగానే
ఇప్పుడైనను
వచ్చి నన్ను రక్షింపగ బెట్టు నీకేలనమ్మా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే,
****************
పరిణితి చెందిన పశ్చాత్తపము,
అన్యథా శరనం నాస్తి - త్వమేవ శరణం మమ" అని ,కంచర్ల గోపన్న,
"ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవ రామచంద్రా
నన్ను రక్షింప నీకంటె రక్షకులెవరయ్యా " రామచంద్ర అన్నట్లుగానే, మన సాధకుడు కూడ,
నేను నిన్న పెడచెవిని నా విన్నపమును పెట్టితివి అన్న,
కఠిన శిలవలె కరుణలేక ఉన్నావన్నా,
గణపతిని చూసి మురిసిపోతు నన్ను రక్షించుట మరచితివి అన్న,
ఇంకా ఎన్నెన్నో నిందారోపణలను చేసినా , వానిని నాచే చేయించినది నా పురాకృత పాపముల వల్ల నన్ను వెంటాడుచున్న విపత్తులేనమ్మా.అమ్మా! నీవు వాటిని క్షమించి,నన్ను కరుణించు.
శ్రీ శ్యామశాస్త్రిగారు వేడుకున్నట్లు,
" నిన్నే నమ్మినాను సదా ,నా
విన్నపమును బ్రోవుమా."
తల్లీ!నీవు,
" భోగీంద్ర సన్నుత పూత చరితా,
పురుహూత పూజితా పరదేవతా"
శ్యామ కృష్ణ సహోదరి-భక్త కామితార్థ ఫలదాయకి
కామాక్షి కంజదళాయతాక్షి
కారుణ్యమూర్తి కద నీవే" అని తప్పిదమును మన్నించమంటున్నాడు.
"అబ్బ తిట్టితినని ఆయాసపడవద్దు-ఈ
దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా" అన్నట్లుగా,
ఉన్నడియె తవిపదమ్మా-
నీ దివ్య చరణములే నాకు శరణములు అంటున్నాడు సర్వస్య శరణాగతిని కోరుతు.
రక్షించ నీ కంటె రక్షకులెవరయ్యా రామచంద్రా -అన్నట్లుగానే మన సాధకుడు తల్లీ,
ఎన్ పోకడిదు-నేనెక్కడికి వెళతాను?
ఒకవేళ వెళ్ళి శరణు వేడినా,
ఎన్నై రక్షి? ఎవరు నన్ను రక్షించగలరు? నీవు తక్క అంటున్నాడు.
నటరాజ పత్తు లోని సాధకుడు సైతము పరమేశా నీవు నన్ను రక్షించాలని అనుకుంటున్నప్పటికిని,
పరమేశా! నీవు దయార్ద్ర హృదయుడవు.నన్ను రక్షించదలచినను,
" నా తలరాత నెంజముందో"
అధికముగా నున్న నా పాపఫలితములుగా నీ అనుగ్రహమునకు అవరోధములుగా మారినవేమో తండ్రీ.నన్ను నీదయకు దూరము చేయుచున్నవేమో?
నేను నా అశక్తతకు దుఃఖించటము తప్ప ఏమి చేయలీని దీనుడను.
పరమేశా!
నేను
'అల్లామల్ నాన్ ముఖల్ తన్నియేల్ నోవనో?
నేను అసలు తెలివితేటలు లేనివానిగా నున్నందుకు దుఃఖించనా? లేక
ఉన్నిలె ఇనవందు మూళయేండ్రురువనో-
నా మూర్ఖత్వమును తలచుకొని దుఃఖించనా? లేక
తన్నైనందళువనో
నా దుస్థితికి బాధపడనా లేక
ఉన్నై నందళువనో
నా మీద నీదయ రానందులకు బాధపడనా,
అసలివన్నియును కాదు
9." మున్ పిరవి పెన్నలిల్ సెయిదనెన్రు అళువనో"
పురాకృత పాపములను తలచుకొని బాధపడనాలేక
" ఎళి పెరియ అండంగళుం కాయ మైత్తువిల్
బ్రహ్మాండములతో బంతులాడు నీకు
" ఎన్ కురైకళ్ తీర్థాల్ పెరియా"
నా ఆపదలను తీసివేయుట పెద్ద పనియా?"
కానేకాదు అని నిశ్చింతతో నుండనా అని నిటలాక్షుని కటాక్షమును అర్థిస్తాడు.
మన సాధకుడు కూడ అమ్మ నీకటాక్షమును నా కర్మఫలితములు చేరనీయటము లేదేమో( అమితముగా నుండుటచే)
అయినను మించిపోయినది లేదు,
మార్కండేయుని యమపాశమును విడిపించినది.
అల్పాయుష్కుని చిరంజీవిని చేసినది మీ కరుణ.
తల్లీ నీ నిర్హేతుక కృపాకటాక్ష స్పర్శచే నా దోషములు తొలగిపోయి నన్ను రక్షించిన నీ కరుణ, బాల మార్కండేయుని చిరంజీవిని చేసి చరితార్థమైన విధముగా ఆ చంద్ర తారార్కము ఆరాధ్యనీయమై యుండును అని అను సాధకుని సత్వరము అనుగ్రహించు,కామాక్షి తాయి దివ్య తిరువడిగళే శరణము.పారదని ఉళ్ళళవుం బాగియత్తోడెన్నై పాంగుడని రక్షిక్కవుం
భక్తియాయ్ ఉన్ పాదం నిత్తము దరిశిత్త బాలరుక్కరుళ్ పురియవుం
శీర్పెట్రిదేగతి శిరుపిడిగిలను గామ
శెంగలియ అనుగామలం
సేయనిడ బాగియం శెల్వంగళైతల్లి జయంపెట్రు వాళ్వి వరవుం
పేర్పెట్ర కాలనై పిన్ తొడర ఒట్టామల్ పిరియమాయ్ కాతిదమ్మా
పిరియమాయ్ ఉన్మీదు సిరియ
నాళ్ సొన్నకవి పిళ్లైగళై
పొరుదు రక్షి
ఆరదనిల్ మనల్ కువిదు అరియపూజై సేత ఎన్నమ్మ ఏకాంబరి నీయే
అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే ,
అమ్మ కామాక్షి ఉమయే .
*******************
10.తారకము నీవని నమ్మినట్టి నన్ను సరగున రక్షించవే
భక్తితో నీపాద నిత్యదర్శనముల భాగ్యమే కడురమ్యము
దేహదోషంబులను చెంతరానీయనను అభయహస్తము నీయుమా
భక్తితో స్తుతియించు భాగ్యమ్ముతో పాటు జయములను వర్షించుమా
యమునిపాశము నన్ను దరిచేరలేని కడుప్రేమతో బ్రోవవమ్మా
పటుతరము కాని నా స్తుతిదోషమెంచక "చుట్టు శ్రీరామ రక్ష"
ఇసుక మహదేవుని మనసార కొలిచిన మాతల్లి ఏకాంబరియు నీవే
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
*****************
"
విరుత్తము తొమ్మిదవ భాగములో సాధకుని అనుగ్రహించుటకు అమ్మ హంసవాహినియై జ్ఞాన స్వరూపముగా దర్శనమిచ్చినట్లున్నది.
నిందించుటను మాని,తల్లిని ఆర్తితో అర్చిస్తున్నాడు."తపోకామాక్షిని"
తన్మయత్వముతో సంకీర్తిస్తున్నాడు సాధకుడు.
తల్లీ ఏకాంబరి నువ్వు తప్ప నన్ను రక్షించగల సమర్థులెవరు/ అనుచు "ఏకామ్రేశ్వరుని అర్థాంగిని ఏకాంబరి అంటు వేడుకుంటున్నాడు.
కాంచిలోని ఆమ్రవృక్ష విశిష్టతను వివరిస్తున్నాడు.ప్రళయకాలాంతర సైతము ఆ చెట్టు ఏమాత్రము చెక్కుచెదరక ఒకేఒక విధమైన ఫలమును నిరంతరముగా అందిస్తుంటుందట
.అదియే జ్ఞానమనే ఫలము. ప్రళయానంతరము శివప్రసాదుడైన చిరంజీవి మార్కండేయుడు కాంచిలో తిరుగుచు,ఆమ్రవృక్షమునెక్కి జ్ఞాన ఫలమును తినుచున్న సుబ్రహ్మణ్యుని చూసి,ధన్యుడైనాడని పెద్దలు చెబుతారు.
ఈ విషయమును ముచ్చటించుకుంటుంటే, మనకు,సాక్షాత్తు అమ్మ స్వరూపమైన శ్రీ ముత్తుస్వామి దీక్షితారు దర్శించి,అందించిన "కంజ దళాయతాక్షి" కీర్తన స్పురణ
కు వస్తుంది.అమ్మ ,
" ఏకానేకాక్షర స్వరూపమును" ప్రస్తుతిస్తుంది.తల్లి నీవు ఏకాక్షరస్వరూపమే అయినప్పటికిని అనేకాక్షరములుగా (మంత్ర స్వరూపములుగా విస్తరిల్లుతూ) విరాజిల్లుతుంటావు.
అంతే కాదు నీవు గుహ్యమాతవు.
కామాక్షి తాయి! ఓ ఆదిపరాశక్తి! నీవు కేవలము
"ఏకానేకాక్షరివి మాత్రమే కాదు."
ఏకానందామృత లహరివి.
బ్రహ్మానందమున భక్తులను అనవరతము ఓలలాడించే కరుణాంతరంగవి.
పరాత్పరి-పరమేశ్వరి నీవు,
ఏకానేకాక్షరి-ఏకానందామృత లహరివి మాత్రమే కాదు,
ఏకాగ్ర మనో లయకారివి
ఏకాగ్రతతో నిన్ను ఆరాధించు సాధకుని మనమును నీ పాదపద్మముల యందు లగ్నము చేయించి,తరింపచేయు ఏకాంబరివి.
" ఏకం బ్రహ్మం న ద్వితీయం"
బ్రహ్మమొక్కటే-పర బ్రహ్మమొక్కటే అని తరించాడు అన్నమయ్య.
అనేకత్వములలో దాగిన ఏకత్వము నీవు.అనేక నామములకు గల ఏకనామివి నీవు.
అనేక గుణములలో దాగిన నిర్గుణము నీవు.
అనేక వర్ణములలో దాగిన నిరంజనము నీవు.
అనేకాకారములో దాగిన నిరాకారము నీవు.
తల్లీ నీవు, నామ-రూపములను-
గుణదోషములను-
వెలుగు-నీడలను,
పాప-పుణ్యములను కల్పిస్తున్నప్పటికిని వీటికి అతీతమైన దానవు.అని తెలిసికొంటినమ్మా.
తల్లీ వాగ్భవకూటములో విరాజిల్లుతున్న తామరరేకుల వంటి కన్నులు జ్ఞాన సంకేతములై జగములనేలుచున్నవి ఓ కంజదళాయతాక్షి.
నీవు కమలా మనోహరిగా కమలామనోహర రాగములో ప్రస్తుతింపబడుతు నామ-రూపములకు అతీతముగా అలరారుచున్నావు.
నీ కృపాకటాక్షమే వాణి-లక్ష్మి తదితర శక్తిస్వరూపములు.
కనుకనే లలితా రహస్య సహస్ర నామము
" శ్రీమత్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజా" అని ప్రస్తుతిస్తున్నది.
ఆదిశంకర విరచిత సౌందర్య లహరి,
" శివే శృంగారార్థే" అంటు నీ దృక్కుల విలక్షతను వివరిస్తున్నది.
తల్లీ నిన్ను భక్తి
," మామవ శివ పంజర శుకి" శివత్వము అను పంజరములో నున్న చిలుకగా చాటుతూనే,నిన్ను కుంజర గమనే అని ప్రస్తుతిస్తున్నది.
పంజరములోని చిలుక ఎగురగలదా( సాధారణమైనదైనచో) కాని నీవు సకల జగములకు స్థితి కార్యమైన క్రియాశక్తివి.శివుడు సూత్రధారునిగా స్థిరత్వముతో నుంటూ నీచే ముజ్జగములను పరిపాలింప చేస్తున్నాడు.
నిర్వహణ కర్తిగా నీ ఠీవితో కూడిన నడక గజగమనమును అనుగ్రహిస్తున్నట్లున్నదమ్మా.కాని
నిజమునకు, అది నీచే కదిలింపబడుచున్న జగముల నడక తల్లీ.
జగధ్ధాత్రి! నీ కనుసన్నలచే పదునాలుగు భువనములను సంరక్షించు,నీ అనుగ్రహము ఈ దీనుని అనుగ్రహించలేదా?
తల్లీ నీ స్వభావము చల్లని వెన్నెల వంటిదని,పున్నమి చంద్రుని వంటి ముఖము నీదని నేననుకోను.అ పోలికలు నీవు వాటికి అనుగ్రహించిన వరములు.
వేడి లేని వెలుగులతో నున్న నీ ముఖము వేడిన్వెలుగైన పరమేశుని మూడవ కన్ను నుండి వెలువడిన అగ్నిచే దహింపబడిన వేళ,వేడిలేక కేవలము వెలుగును మాత్రమే ప్రసాదించు నీ ముఖమునుండి వెలువడిన కరుణ యను వెన్నెల మన్మథుని,పునర్జీవితుని కావించినట్లు,
పాపాగ్నితో దహించబడుచున్న నన్ను నీ వెన్నెల కిరణములతో అనుగ్రహించమని వేడుకునుచున్న సాధకుని,అనుగ్రహించుచున్న "తాయి కామాక్షి దివ్య తిరువడిగళే శరణం."
నరియ నరియ వణక్కంగళ్.
ఎత్తనై జననం ఎడుత్తేనో తెరియాదు ఇబ్బూమి తన్నిలమ్మా
ఇనియాకిలుం కృపై వైతెన్ని రక్షియుం ఇని జననం ఎడుత్తిదామల్
ముక్తితర వేణుమేన్ ఉన్నయో తొళుదునాన్ ముక్కాలం నంబినేనే
మున్ను పిణం తోణాదా మణితరై
పోలనీ ముళితిరుక్కదేయమ్మా
11.వెట్రిపెర ఉన్మీదిల్ భక్తియాయ్ సొన్నకవి విరుత్తంగళ్ పడినుండ్రియుం
విరుప్పముడ నీకేట్టి అళిదుడుం శెల్వత్తె విమలనార్ ఏసపోరార్
అత్తరిడ వాగత్తె విట్టువందెన్నరుం కురైగళై తీరునమ్మా
అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
******************
11ఎన్నెన్ని జన్మలు నన్ను రాపాడినవో ఈ భూమిపై తెలియదమ్మా
ఇప్పటికైనను మరుజన్మ లేకుండ నన్ను రక్షించవమ్మా
ముక్తిదాయినివనుచు ముక్కాలములు నిన్ను భక్తితో కొలిచినానే
ముందెన్నడు నిన్ను చూడలేదనుచు నను మందభాగ్యుని చేయకమ్మా
భక్తులకు కామాక్షి విరుత్తానుగ్రహము సర్వతోముఖ విజయము
ఒప్పుకొన నీకిట్టి బెట్టుసరి శర్వాణి విభుని విడి బ్రోవవమ్మా
అక్షయంబైన నీ వీక్షణముతో మా ఆపదలుకడతేరునమ్మా
అవ్యాజకరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
************
" కురైగళై" అపదలు తీరునమ్మా.అని నొక్కి వక్కణిస్తున్నాడు సాధకుడు గట్టి నమ్మకముతో.
ఆపదలను కడతీర్చునది అమ్మ కామాక్షి కృపావీక్షణమే.కాదనలేని సత్యమది.
ఇంకొక చమత్కారము.అర్థనారీశ్వరి యైన అమ్మ విరాగి యైన అయ్య మాతను కాదనలేక ఐశ్వర్య ప్రదానము కావించుటలేదేమో.కనుక ఒక్కసారి అయ్యను వీడి,తన మాతృవాత్సల్యముతో అమ్మగా-అమ్మలగన్న అమ్మగా ఆర్తిని తీర్చి,భక్తి సామ్రాజ్యమను ఐశ్వర్యమును అనుగ్రహహించమంటున్నాడు ఆర్తితో.
విరుత్తములోని పదవ భాగములో కామాక్షి తల్లి భక్తుని కోరికను తీర్చదలచి,హంసవాహినియై ముందుకు వచ్చి నిలిచి సాక్షాత్కరించినది.సాధకునిలో సత్వగుణము ప్రచోదనమైనదేమో,త్రికరణ శుధ్ధుడై అమ్మను అర్చించుచున్నాడు.
"పాలించు కామాక్షి పావని పాపశమని "ఫ్ అని ప్రస్తుతిస్తున్నాడు.
తల్లీ నీవు సుజనులకెల్లా సంతోష ప్రదాయినివి(ఇహములో) మనోరథప్రదాయినిగా పేరుపొందితివి.
దశరథములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు పంచేంద్రియములు మన ఉపాధి అను రథమును అమ్మ అందించుచున్న శక్తితో, తల్లి కరుణ అనే సారథితో బహుముఖములుగా నడిపించుచు తేజోవంతము చేయుచున్నవి.
వీటిలో రథము-రథనిర్మాణ పరికరములు ర థ గమనము-రథ గమ్యము అన్నీ కామాక్షి తాయి కరుణయే.
రుద్రనమకములో చెప్పినట్లు,
" రథేభ్యో-రథపతిభ్యశ్చవ" నమో నమః.
అమ్మ కామాక్షి తాయి విరుత్తమును పఠించిన, వినినను-మననము చేసికొనినను సకల సౌభాగ్యప్రదము.
అసలు తమిళమే తెలియని నాచే కుప్పలుకుప్పలుగా దొరిలిన తప్పులను సవరించినను సభక్తిపూర్వక అర్చనయే.సౌభాగ్య ప్రదమే.
ఆ తేజస్సు వాటిది కాదు.తల్లి తేజోమయ కీర్తి విస్పూర్తివంతమై మనలోని దశ ఇంద్రియములను మన మనోరథము ఈప్సితమును నెరవేర్చుకొనుటకు సహకరించునట్లు చేయునది తల్లి సాక్షాత్కారము.
ఫల స్తుతి/ఫలశృతి
-------------------
విరుత్తానుగ్రహము సర్వత్ర విజయప్రదము.అమ్మ కృపావీక్షణము అనవరతము అతులిత శుభప్రదము.
మిత్రులారా!
మా దత్త పుత్రుడు చిరంజీవి సాయి ప్రసన్న స్పూర్తినిచ్చి అతిపవిత్రమైన అమ్మ కామాక్షి విరుత్తానుగ్రహమునకు సూత్రధారియైనాడు.భగవతి చిరంజీవి సాయిపై కుటుంబముపై సర్వవేళ లా
కృపాకటాక్ష వీక్షణ ధారలను వర్షించును గాక.
No comments:
Post a Comment