కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,
సర్వాశాపరిపూరకము
****************
'మనోబుద్ధయహంకారచిత్తాను" అంటూ ఆదిశంకరులు చిత్తవృత్తులను చిదానందముగా విపులీకరించారు.
" కంజాక్షునకు గాని కాయంబు కాయమే" అంటూ ప్రహ్లాదుని ద్వారా అదే సత్యమును నొక్కివక్కాణించారు.
షోడశదళపద్మముగా తన శక్తులను 16 విభాగములు చేసి,తనకుతాను పలుమారులు ఆవృత్తమగుచు జీవులను తమకుతాము స్వయంసమృద్ధులుగా భావింపచేస్తోంది అడ్డుగా నిలిచిన మాయ.
ప్రతి మనిషి తన పంచేంద్రియములద్వారా,పంచభూతముల సహాయముతో,పంచతన్మాత్ర పరంపరతో ప్రకటింపబడుట వెనుక దాగిన పరమరహస్యమే,అజ్ఞాతముగా దాగి,ఆసరగా నిలబడుచున్న పదహారుశక్తుల ప్రస్తావనము.
ఈ శక్తులను గుప్తయోగినులు/ఆకర్షణశక్తులగాను భావిస్తారు.
చిత్తమనే భరిణెలో మనస్సు-బుద్ధి-అహంకారము మొదలగు చిత్తవృత్తులు కొంతసమయముంది మరలినను,వాటివాసనలు జ్ఞాపకములుగా ముద్రింపబడిఉంటాయి.
కామాకర్షిణి,బుద్ధ్యాకర్షిణి,ఆత్మాకర్షిణి,అహంకారాకర్షిణి,స్మృత్యాకర్షిణి ,శరీరాకర్షిణి మొదలైన సహాయక శక్తులు సాధకుని విచక్షణను స్పష్టీకరిస్తుంటాయి.
సర్వాశాపరిపూరక చక్రములోని గుప్తయోగినుల
వాత్సల్యమును పొందిన సాధకుడు చక్రేశ్వరియైన త్రిపురేశి దేవికి నమస్కరించి,మూడవ ఆవరణమైన"సర్వ సంక్షోభణ చక్రము"లోనికి గుప్తతరయోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు.
No comments:
Post a Comment