Tuesday, September 6, 2022

YAADAEVI SARVABHOOTESHU-01

ధ్యానం
ఆరక్తాభాంత్రిణేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యాం
హస్తాంభోజైస్సపాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ ।
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీ

ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ ॥

 


 సంకల్పము-సామర్థ్యము-సాఫల్యము మూడు తానైన ఆ ఆదిశక్తి అనుగ్రహమా అన్నట్లుగా గమనము ప్రారంభమై శుభసంకేతముగా ప్రవేశద్వార తూర్పుదిక్కునకు చేర్చినది.ఈ ఆవరనము మూడు మార్గములతో విశాలముగా ఊహా చతురస్రాకారములతో భుజముల మధ్యన కొంత వంగి కరదీపికల వంటి కరుణాంతరంగులైన ఎనిమిది సిద్ధిదేవతలతో పాటు ప్రాప్తి-సర్వకామ అను మరో ఇద్దరితో ద్వారములదగ్గర ప్రకాశించుచుండగా పదిద్వారములను కలిగియున్నది.వాటినే శాక్తేయులు త్రైలోక్యమోహనచక్రము యొక్క మొదటి భూపురము అంటారట.మొన్న మా తాతయ్య చెబుతుంటే విన్నాను.వెంటనే మీరు నన్ను ఆ పదిద్వారములదగ్గరనున్న వారెవరు అని అడుగుతారేమో.వారిని అష్టసిద్ధులు ప్రాప్తి సర్వకామ అను మరో ఇద్దరు శక్తులను కలుపుకొని ఉంటారట.వారిని,


1.అణిమ

2.లఘిమ

3.మహిమ

4.ఈశిత్వ

5.వశిత్వ

6.ప్రాకామ్య

7.భుక్తి

8.ఇచ్చా

9.ప్రాప్తి

10.సర్వకామ అని పిలుస్తారట.

   గరిమ సిద్ధి ఉందని కొందరు లేదని కొందరు వాదించుకుంటుంటారట.

   ద్వారమునకు పక్కగా నిలబడి లోపలి విశేషములను వివరిస్తూ,సాధకుడు మెలగవలసిన విషయములను బోధిస్తూ,తరువాతి ద్వారము చేరుటకు తాము పక్కకు జరిగి ముందుకు నడిపిస్తాయట వీటి అనుగ్రహము మనకు కళ్ళకు కట్టినట్లు కనబడుతుందిట పరిశీలిస్తే.ఈ పదిశక్తుల సహకారముతో రెండవదారివైపునకు అడుగులు కదుపుతున్నాడు సాధకుడు.

  ఆ మార్గము ఎనిమిది మూసుకునియున్న తలుపులతో తాళమువేసియున్నట్లున్నదట.తాలపుచెవి కూడా అక్కడే ఉన్నదట.వారినే మహాలక్ష్మీసమేత సప్తమాతృకలని పిలుస్తారని మా తాతయ్య చెప్పాడు.

   వారిపేరు,

 1.బ్రాహ్మి

 2.మాహేశ్వరి

 3.కౌమారి

 4.వైష్ణవి

 5.వారాహి

 6.మాహేంద్రి

 7.చాముండే అని సంకీర్తిస్తారట.


    ఈ శక్తులు సాధకునకు సత్సంకల్పమును కలిగించి,దానిని నిలబడునట్లుచేసి,ముందునకు నడుచునట్లు చేస్తూ,మూడవ మార్గము వైపునకు నడిపిస్తాయట.

   ఈ మూడవ మార్గము పదిమూసిన ద్వారములతో సాధకుని తగిన సూచబలిస్తూ ఒకొక్క అడుగును సుగమముచేస్తుంటాయట.వారినే

 1.సర్వసంక్షోభిణి

 2.సర్వవిద్రావిణి

 3.సర్వాకర్షిణి

 4.సర్వవశంకరి

 5.సర్వోన్మాదిని

 6.సర్వమహాంకుశే

 7.సర్వఖేచరే

 8.సర్వబీజే

 9.సర్వయోనే

 10.సర్వ త్రిఖండే అని కీర్తిస్తారు

    ఈ 28 శక్తులను ప్రకటయోగినులు అని అంటారట.చక్రేశ్వరి నాయికను త్రిపుర అని ప్రశంసిస్తారట.

సామాన్యునుని  ఆలోచన ప్రకారము శ్రీమన్నగరమునకు చేరాలంటే ఏడు దారులద్వారా వెళ్ళాలి అనుకుందాము.ప్రతి దారిలోను కొన్ని తలుపులు మూసుకుని ఉంటాయి అనుకుందాము.మనము ఒక్కొక్క తలుపును తెరిపించి,అవి దారి ఇస్తేగాని ముందుకు వెళ్లలేము.ఒక్కొక్క ద్వారము యొక్క గడియ ఒక్కొక్క విధముగా అమర్చబడి,తాళమువేసియున్నది అన్నీ. తాళములే అయినప్పటికి వాటి రూపములు పనిచేయువిధానము అవి తెరచుకొనుటకు ఉపయోగించు తాళపుచెవులు వేరు.అవి అక్కడే ఉంటాయి.మనము వాటిని గుర్తించి ఎ0చుకొని ముందుకు వెళ్లగలగాలి.ప్రవేశిస్తుండగానే అక్కడ ఎత్తైన ప్రదేశములు,లోతైనవి,ఇరుకుగా ఉండేవి,విశాలముగా ఉండేవి కంకరరాళ్లతోఉండేమార్గములు,చదునుగా ఉండేదారులు,పాకుడు దారులు ఇలా ఎన్నెన్నో విభిన్న దారులను దాటివెళ్ళాలంటే వాటికి అనుగుణముగా మన శరీరమును,మనసును ఎలా సిద్ధము చేసుకోవాలో తెలియచేస్తూ సహకరించే అమ్మ అనురాగమే మార్గములో విరాజితమైన కరదీపికలు.

సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు.


 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...