Sunday, October 9, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-02( SIVAANAMDALAHARI)

 గళంతీ శంభో త్వత్-చరిత-సరితః కిల్బిష -రజో

దళంతీ ధీకుల్యా- సరణిషు పతంతీ విజయతామ్

దిశంతీ సంసార-భ్రమణ-పరితాప-ఉపశమనం

వసంతీ మత్-చేతో-హృదభువి శివానంద-లహరీ 



 మొదటి శ్లోకములో పార్వతీపరమేశ్వరులు అస్తోక సమస్తభువనములకు శుభములందించువారిగా స్తుతిస్తూ,మనకు వారి సర్వవ్యాపకత్వమును తెలియచేశారు. 

  కాని మనము ఉన్న (అందరు కాదు) ఉన్న ప్రస్తుత పరిస్థిని గ్రహించి వారు ఎక్కడున్నారో తెలియక కాలమును వృధా చేస్తామన్న తలపుతో, వారుండే స్థానమును/అదియును మనకు అత్యంత సమీపముగా /మనము చేరి గుర్తించదగినదానిని సూచిస్తున్నారు.

   "విజయతాం దిశంతీం"

 మనకు విజయమార్గమును చూపించుటకై,వారు చేయు ప్రయాణము,తొలగించు అడ్దంకులను,కలిగించు శుభములను వివరిస్తున్నారు నాలుగు రమ్యమైన క్రియాపదములతో.

 1.గలంతీ-ప్రవహిస్తూ,

 2.దళంతీ-ప్రక్షాళిస్తూ

 3.పశంతీ-పడగొట్టివేస్తూ

 4.దిశంతీ-దిశను చూపిస్తూ

   మనలను అనవరతము కాపాడుటకు ఇక్కడే మన చేతో హ్రదము-చైతన్యముతో నుండిన 

హ్రదము-సరసు నందు కొలువై యున్నారు.

 దీనినే రుద్రము,

" నమః పార్యాయచా-వార్యాయచ"

 పారము అనగా నదికి(సంసారమనే) అవతలనున్న గట్టు.అవార్యము అనగా ఇవతలిగట్టు.

 సంసారబంధములనుండి విడుదలకోరువారు పార్యులు.భోగములు కోరువారు అవార్యులు.

 దయాళువు అనుగ్రహమును గలంతీ ప్రవహింపచేస్తున్నాడు.

  ఆ ప్రవాహము కిల్బిషములను/పాపములను-దళంతీ-ప్రక్షళనమొనరించుచున్నది.

 ధూళిని తొలగించిన ప్రవాహమును మన అజ్ఞానము తెలిసికొనలేక మూర్ఖత్వమను అడ్డుగోడలను నిలిపినది.అవియే

 ధీకుల్యా-వాటిని దాటివేయుటయే,ప్రవాహమును పరుగులెత్తించుటయే పతంతీ-

 అడ్దువచ్చినవాటిని నెట్టివేస్తూ,ప్రవాహము 

"విజయతాం దిశంతీ"

 విజయమునకు మార్గమును చూపిస్తున్నది.అదియును దిక్కుతోచని అసారమైన సంసారము నిజమను భ్రమలో నున్న వారిని పునరుద్ధరించుటకు.

  


 


 శ్రీలలితారహస్యసహస్రనామములో చెప్పబడినట్లు తల్లి"సుధాసారాభివర్షిణి" మన సహస్రారము నుండి అవరోధములను తొలగించుచు ,మనలను మనసనే కొలనులలోఆనందపు అలలుగా  నివసిస్తూ,మనలను అనుగ్రహించుగాక.

 సర్వం పార్వతీపరమేశ్వర చరణారవిందార్పణమస్తు.


 సర్వం పార్వతీపరమేశ్వర చరణారవిందార్పణమస్తు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...