శ్లో : త్వమ్-ఏకో లోకానాం పరమ-ఫలదో దివ్య-పదవీం
వహంతస్-త్వన్మూలాం పునర్-అపి భజంతే హరి-ముఖాః
కియద్-వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ
కదా వా మద్- రక్షామ్ వహసి కరుణా-పూరిత-దృశా 18
సాధకుడు క్రిందటి విరించి బ్రహ్మాయుః శ్లోకములో స్వామి నీ పాదారవింద దర్శనముచే విధివ్రాతను జయించి నీ అనుగ్రహమును పొందుదామనుకున్నాను కాని దేవతల వంగిన శిరముల కిరీటములు నాకు పాదదర్శనము లభింపచేయుటకు ఆతంకము అగుచున్నవి.అయినను నీ క్రీగంటి చూపు నామీద ప్రసరించినంతనే నా పాపములు పరిహరింపగలవు అని నేను ప్రస్తుతము దేవతలు చేయుచున్న స్తుతుల ద్వారా తెలుసుకున్నాను.
హే శివా!
తవ్మ్-లోకానాం పరమఫలదం-అన్నిలోకములలో నున్న చరాచరములన్నింటికి పరమపదమును/ముక్తిని అందీయగలవు.
ఎందుకంటే
త్వం మూలం-అన్నింటికి/అందరికి నీవే మూలము.
అని నీయొక్క దయా ప్రాశస్త్యమును
తిరిగి తిరిగి హరిముఖాదులు-ఇంద్రాది దేవతలు స్తుతిస్తున్నారు కృతజ్ఞతాభావముతో.
నిజమునకు వారందరును అతి సామాన్యులే.నీ చే అనుగ్రహింపబడినవారు కనుక స్వర్గాధిపతులుగా విరాజిల్లుచున్నారు.అయినను సంతృప్తిని చెందక నీ పాదసంసేవనాసక్తులై నీ సన్నిధానమును కోరి నిన్ను స్త్తుతించుచున్నారు.
వారిని అనవరతము అనుగ్రహించుచున్న నీ దయ నా చిన్ని ఓరికను అదే,
మద్రక్షా కియతి చ మదాశా-నన్ను రక్షించని కోరుచున్నది అదియును
కేవలము నీ
కరుణాపూరిత దృశా-నీ కరుణామృత దృక్కులతో.
ఓ శివా నన్ను సైతము నీ పాదసేవనములో మునిగి.కీర్తించే దాసునిగా అనుగ్రహింపుము.
No comments:
Post a Comment