Tuesday, November 15, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-22

 


 న రుద్రో రుద్రమర్చయేత్-23

 ***********************

" స్వస్తి ప్రజాభ్య: పరి-పాలయంతాం

 న్యాయేన మార్గేణ మహీం మహీశ:

 గో-బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం

 లోకా: సమస్తాత్ సుఖినో భవంతు."

            శాంతిమంత్రం.


 విశ్వపరిపాలనలో గోవులను-బ్రాహ్మణులను సంరక్షించుటచే సమస్తలోకములు సుఖముగా నుండునుగాక.

 ఇది" విశ్వశ్రేయో మంత్రము"


  .ఇందులో వచ్చిన గో-బ్రాహ్మణ శబ్దములు అత్యంత  ముఖ్యమైనవి.సంస్కారవంతమైనవి.గో శబ్దము సకల దేవతా స్వరూపము.దేవతలనగా ఇంద్రియములు అనే అర్థమును కూడా చెబుతారు.అదేవిధముగా పంచభూతములను కూడా అన్వయిస్తారు.సమస్త వాక్కులను కూడా గో శబ్దముగా భావిస్తారు.అంటే ఒక విధముగా విశ్వమును గో శబ్దముతో సంకేతిస్తూ,దానిలో దాగిన,దానిలోనే కాదు,తనలో దాగియున్న ఈశ్వరచైతన్యమును-తాను చూస్తున్న చైతన్యమును బిబ-ప్రతిబింబములుగా.

గ్రహించగలిగిన వాడు బ్రాహ్మణుడు.తనలోపల/తన చుట్టు ఉన్న ఈశ్వరచైతన్యమును గుర్తించి,గౌరవించుటయే బ్రహ్మజ్ఞానమని పెద్దలు చెబుతారు.



 అహం బ్రహ్మాస్మి-నేను బ్రహ్మము కంటే వేరుకాదు అను తత్త్వమును అర్థముచేసుకొని ఆరాధించువేళ సమస్తలోకములు సుఖముగా ఉంటాయి.


    ప్రియ మిత్రులారా ఈ నాటి బిల్వార్చనలో మనము "గో" శబ్దము యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.

  రుద్రమునము గో శబ్దము,


  1.వ అనువాకము-8వ మంత్రము

 

 " ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః

   ఉతైన విశ్వాభూతాని.."

   ఏ రుద్రుడు సర్వప్రాణులకు సాక్షాత్కారమునొసంగుటకై ఆదిత్య రూపమున ప్రకటింపబడుతూ,తన కిరనములనే చేతులతో తాకుతూ,గోపాలురలను,నీరు తెచ్చే వారిని,పామరులను తాకుతూ పవిత్రులను చేయుచున్నాడో అట్టి రుద్రునకు నమస్కారములు.

  సమస్త ప్రాణులకు నిన్ను దర్శించే భాగ్యమును కలిగిస్తున్న సదాశివా నమస్కారములు.


  7వ అనువాకము-16 వ మంత్రము

 " నమో వాస్తవ్యాయచ-వాస్తుపాయచ"

  అలంకారికులు వాసు శబ్దమును/వస్తువుగా స్వీకరిస్తూ

 గోవులు అను భావములో అన్వయిస్తారు.ఒక విధముగా పశుసంపద నిచ్చే పశుపతి నమస్కారములు.


  9వ అనువాకము-4వ మంత్రము

 " నమో గోష్ఠ్యాయచ-గృహ్యాయచ"

    గో రూపముగానే కాదు గోశాల రూపముగా నున్న రుద్రునకు నమస్కారములు.

  10 వ అనువాకము-7వ మంత్రము

  " ఆరాత్తే గోఘ్న ఉతపూరుషాగ్నే"

   గోవులను తనలో లీనముచేసుకొనువాడు-ప్రళయకాల రుద్రునిగా గోవులను చంపువాడని కీర్తించినది

.

  చమకము 10 వ అనువాకములోను గో ప్రసక్తి వచ్చినది.వివిధ దశలముదున్న ఆవుదూడలని రక్షించమని వేడుతూ,పాప-పుణ్యములకు సంకేతములుగా,

 ధేనుశ్చమే-అప్పుడే ఈనిన ఆవు

 వేహతాశ్చమే-వట్టిపోయిన ఆవు అని గో ప్రసక్తి వచ్చినది.

 సకలదేవతా సమాహార స్వరూపమే గోమాత.

 లలితారహస్య సహస్ర నామావళి అమ్మవారిని

 "గోప్త్రీ-గోవిందరూపిణి" అని సంకీర్తించినది.

 సదాశివుని సంగతి సరేసరి.గోవు కర్ణభాగము నేనంటూ గోకర్ణక్షేత్రమును,పృష్ట భాగము నేనంటూ కేదారనాథ  క్షేత్రము",పాదములున్న ప్రదేశము నేనంటూ గోష్పాదక్షేత్రము ,గోక్షీర ప్రాశస్త్యమును నేనంటూ క్షీరామ (పాలకొల్లు) క్షేత్రం...అసలు స్వామి గోరూపములో వాక్కులుగా సర్వత్ర భావింపబడుతు,భాసిల్లుతు,భాషించుతు,మనలను అనుగ్రహిస్తూనే ఉన్నాడు.

  ఓం నమః శివాయ.


 " గవాం శతసహస్రాణాం రక్షితా గౌతమో మునిః
   తపసో గోష్పదే క్షేత్రం ఆయాతః క్షామ వారకః"
    ఒకసారి ధర్మగరిష్ఠుడైన గౌతమ ముని క్షామ బాధితమైన స్థలమున నున్న జీవులను రక్షించుటకు తన తపోఫలమును ధారపోసి అనేకానేక గోగనములను రక్షితూ,ఆహారమును అందించుచున్నాడట.తృప్తులైన జీవులు గౌతమ మహామునిని స్తుతించుట విని సహించలేని కొందరు ఒక మాయాగోవును కల్పించి పచ్చికను మేయుచున్నట్లు చేసిరి. దర్భతో దానిని అదిలించగానే అది విలవిల కొట్టుకుని మరణించెను.
 జరుగ వలసిన కథకు నాందిగా.గోహత్యా పాతక ప్రాయశ్చిత్తమునకై పరమేశుని  బ్రహ్మగిరివద్ద ధ్యానించసాగెను గౌతముడు.స్వామి ప్రత్యక్షమైన్ తన జటాజూటమునుండి ఒక జటను అనుగ్రహించి, త్రయంబకేశ్వరమునుండి ప్రవహించి సాగుతు అది గోహత్యాప్రదేశము దగ్గర వచ్చి ఆగినదట.

 గోహత్యా పాతక ప్రాయశ్చిత్తమున ప్రవహించినది
 కావున" గోదావరి" గాను,గౌతముని ప్రార్థనను అనుగ్రహించి వచ్చినది కావున" గౌతమి"గాను కీర్తింపబడుతున్నది.

 అప్పటి నుండి ఆ ప్రదేశము" గోవు ఊరు గా" పిలువబడుచుండెడిది.కాలక్రమమున గొవ్వూరు/కొవ్వూరుగా మారినదట.

 ఈస్థలమంతయు గోవు పాదములచే పునీతమైనది కనుక "గోష్పాద క్షేత్రము" గాను ప్రసిద్ధి కెక్కినది.
 బాలాత్రిపురసుందరిగా అమ్మవారు-సుందరేశ్వర స్వామిగా అయ్యవారు స్వయంభువులై అనుగ్రహిస్తున్నారు.సుందర గోవిందుని  క్షేత్రము" కూడా హరిహరాద్వైత ప్రతీకగా ఆరాధింపబడుతున్నది.

 గర్భాలయములో లింగరూపునిగను,విగ్రహరూపునిగను పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు.
 క్షిప్ర ప్రసాద  వెలిసిన ఆదిదంపతులు అనవరతము మనలను రక్షించెదరు గాక.
  మరొక కథా కథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.

        ఏక బిల్వం శివార్పణం.
   

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...