Saturday, December 10, 2022

AALO REMBAAVAAY-05



 ఐదవ పాశురం

***************
మాయనై మన్ను వడమదురై మైందనై
తుయపెరునీర్ యమునై యరైవరై
ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం
తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ.


 పరమాత్మ తత్త్వమను వేదవృక్షమునకు విత్తనము వంటి తిరుప్పావై లోని ప్రథమభాగమైన మొదటి ఐదు పాశురములు స్వామి మనలనుద్ధరించుతకు తనకు తాను పర-వ్యూహ-విభ-సర్వాంతర్యామి తత్త్వములనుగ్రహించుతయే కాక అంతర్యామియై తన భక్త వాత్సల్యమును ఏ విధముగా తనకు తాను యశోదమ్మకు ఒక చిన్ని తాటితో కట్టబడినాడో సంకేతముగా వివరించుచున్నది గోదమ్మ.
 ఇక్కడ మనము ఒక చిన్న విషయమును గమనించవలెను
.గోదమ్మ విత్తు అనినది.గింజ అనలేదు.ఈ రెండు పదములలో భావప్రకటనలో వ్యస్త్యాసమున్నట్లుంది.
 గింజలు మనకు ఆహారముగా అంతరించిపోవునవి.విత్తు తిరిగి తానొక మహావృక్షముగా రూపుదిద్దుకొని అనేక విత్తనములను సృష్టిస్తుంది.అదేవిధముగా తిరుప్పావై ఎందరెందరి మదిలో జీవనపరమార్థ భావములకు జీవము పోస్తుంది.
 ఇంకొక ముఖ్యవిషయము తూయోమాయ్ వందోం అంటున్నారు గోపికలు.పరిశుద్ధులై వచ్చామంటున్నారు.నిరపేక్ష భావముతో సకలలోక క్షేమమును కోరి మనస్సునై సిందిక్క మనస్పూరితిగా అర్పణభావముతో,వాయినాల్ పాడి ఇంద్రియములను సంకీర్తనమయము చేసుకొని,తూయ్మలర్-పరిశుభ్రమైన పువ్వులు అంటే
 అహింసా ప్రథమం పుష్పం
 నందుని కీర్తించేతప్పుడు పదునైన ఆయుధమును,పరాక్రమమైన భుజముపై ధరించియున్నాడు కాని ఆ పరాక్రమము కేవలము ధర్మసంరక్షనమునకు మాత్రమె.అదే విధముగా స్వామి ముఖమును వర్నించినప్పుడు కదిర్-ముదియం ముగత్తల్ అంటు పరాక్రమమును-ప్రకాశకత్వమును కీర్తించిరి కాని ఎక్కడ హింసను తెలుపలేదు.
మూడవ పాశురములో సైతము ఓంది ఉలగం నందు బలిని పాతాలమునకు పంపించినాదే కాని స్వామి హింసించలేదు.తాను యాచకునిగా మారి కతాక్షించినాడు.
 ఇంద్రియనిగ్రహం రెండవపుష్పం.కనుకనే గోపికలతో గోదమ్మ శియర్ మీర్గాళ్ అడిప్పాడి అంటూ చిన్నపిల్లము అయినప్పడి సెల్వం అంతూ గోకిఉలమనే సంపదగలవారమని ,రెండవపాశురములో కృత్యాకృత్యములను తెలియచేస్తూ,మూడవపాశురములో ఉత్తమన్ పేర్పాడి అంటూ,నాల్గవ పాశురములో ఆళిమలై కణ్ణా అంటు ప్రార్థనతో ప్రతి సారి మనస్సును కేంద్రీకరించి చేయవలసిన జగత్కళ్యాన వ్రతమును గురించి గోపికలను కలుపుకొనుచు ముందుకు సాగుచున్నది.
  

 గోదమ్మ తరువాతి పాశురము నుండి భాగవత ప్రశస్తిని తెలియచేస్తూ తపము అను పుష్పము,కరుణ అను పుష్పము,జ్ఞానము అను పుష్పము మొదలగు అనేక సుగంధపుష్పములతో పూజించు నోమునకు చెలులారా రండి అని గోపికల రూపములో,బహుముఖములైన స్వామి సాంగత్యములో నున్న గోపికలను మేల్కొలుపుచు వారిని తమతో కలుపుకొని వ్రతమునకు తీసుకుబోదలచిన 
 ఆండాల్ తిరువడిగలే శరణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...