Monday, December 26, 2022

AALO REMBAAVAAY-12

 


 పాశురము-12

 ************


తాదాతంత్యతను వీడి  జాగరూకము కమ్మా...

  ఒక్కొక్క సారి భాషను అధిగమించి భావము భాసిస్తుందనుటకు, ఈ ఉపాధికి గోదమ్మ అనుగ్రహించిన

"తాదాతంత్యతను వీడి  జాగరూకము కమ్మా:...దాసోహములు తల్లి.

 అంత్యత -పరాకాష్ఠ దశలో నున్న 

 తాదాత్-మమేక భావము.

 మనము మేల్కొలుపుచున్నది గోపికల రూపములో నున్న ఆళ్వారులను.వారు స్వామికి-చేతనులకు మధ్యనున్న నిచ్చెనలవంటివారు.

 వారెందరెందరినో స్వామి సమక్షమునకు చేర్చు ప్రక్రియలో కిందమెట్టుమీదనున్న చేతనులకు సహాయపడుటయే స్వామిసేవగా భావించు స్వభావము కల సహృదయులు.వారి చేయూతకై నిచ్చెన కిందిమెట్టుపై వేచియున్న చేతనులెందరో.

 వారు అంతర్ముఖమును వీడితేకాని అది సాధ్యపడదు.

 కనుక గోదమ్మ బాహ్యమునకు దోషముగా కనిపించే ఉదాహరణములతో వారి గుణ వైభవమును మనకు అందిస్తుంది

.

 మనము నిత్యానుష్ఠానమే ప్రధానము అనుకునే సమయములో దానిని సైతము వదిలివేసిన ,సంపన్నుని చెల్లెలా అని ప్రస్తుత గోపికను మేల్కాంచమంటున్నది. 

  

 ఓశై పడుత్త తైరరవం అని చల్లచిలుకు శబ్దమును,

  ఎరుమై సిరువీడు

మేయాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం-పశువులు చిన్నమేతకు కదిలి వ్యాపించి మేస్తున్నాయి అని,

కట్రుక్కరవై కణంగళ్ పలకరందు-అనేక పాడి ఆవులను ఒక్కరే అవలీలగా పాలుపితుకు నేర్పు కలవారు అను

 గోకులవాసుల నిత్యానుష్ఠానమును తెలియచేసిన గోదమ్మ ప్రస్తుత పాశురములో

నినైత్తు ములై వళియే నిన్రుపాల్ శోర

ననైతిల్లం శేరాక్కుం నర్చెల్వన్ తంగాయ్

 పాలుపితుకు నిత్యానుష్టానమును విస్మరించిన " నర్చెల్వన్" ప్రస్తావనతో విశేషానుష్ఠానుము యొక్క ప్రాముఖ్యతను వివరించుచున్న గోదమ్మకు  దాసోహములను సమర్పించుకుంటూ,ప్రస్తుత పాశురమును అనుసంధానమును చేసుకుందాము.


కనైత్తిళం కాట్రెరుమై కన్రు క్కిరంగి

నినైత్తు ములై వళియే నిన్రుపాల్ శోర

ననైతిల్లం శేరాక్కుం నర్చెల్వన్ తంగాయ్

పనిత్తళై వీళనిన్ వాశల్ కడైపట్రి

శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై శెట్ర

మనత్తుకు ఇనియానై ప్పాడవుం నీవాయ్ తిరవాయ్

ఇనిత్తాల్ ఎళుందిరాయ్! ఈ తెన్న పేరురక్కం

అనితిల్ల తారారుం అరుందేలో రెంబావాయ్.

1. ప్రస్తుత పాశురములో గోదమ్మ పాలునిండిన పొదుగులతో నున్న గేదెలను,

2.కట్టు విప్పక బంధించియున్న దూడలను

3.సమయమైనప్పటికిని పాలుపితుకక కృష్ణ  సేవకు వెళ్ళిన గోపాలకుని

 4.ఆదమరచి నిదురించుచున్న వాని చెల్లెలు యైన  గోపికను

 5.తమ దూడల ఆకలిని గ్రహించి తమకుతామే    గేదెలు         కుండలనిండా వర్షించిన పాలధారలచే చిత్తడి అయిన నేలను

 6.హేమంత మగుటచే పైనుండి కురుస్తున్న

 మంచును

 7.దక్షిణ లంకాధిపతియైన దశకంఠునిపై కోపించి దండెత్తి సం హారము చేసిన మనోభిరాముని 

 8.గోకులములలోని చుట్టుపక్కలవారికి నీ నిద్రను గురించి తెలుస్తుందన్న    గోపికల

 పరిహాసమును

 ప్రస్తావించినది. 


 కాట్రెరుమై-ప్రేమతో గేదెలు

 ఇళంగు-దూడలపై

 కంద్రుక్కు కిరంది-మాతృవాత్సల్యముతో

 ములైవళై నిన్రపాల్ శోర-పాలునిండిన పొదుగులతో సిద్ధముగా నున్నాయి.ఇది వాచ్యార్థము.

 కట్టివేయబడిన దూడలు చేతనులు-అనుగ్రహించనున్న జ్ఞానులు ఆ గేదెలు.వారందించే

  జ్ఞానసంపదయే క్షీరము.కాని    చేతనులు సమీపించి-అర్థించలేని స్థితిలో సంసారబంధములతో కట్టివేయబడి యున్నారు.

 

కనుక జీవులను ఉద్ధరించాలనే వాత్సల్యముతో వారు అంతట తమ బిడ్డలుగా(దూడలుగా  ) ఊహించుకొని జ్ఞానామృతమును వర్షించుచుండుటచే భూమి సైతము పునీతమైనది.

 ఇక్కడ మన అనుభవములోనికి 

 వచ్చుచున్న విషయము మనము ఇన్నిరోజులు గోపబాలురు వచ్చి పాలుపితికితే గాని దూడల కడుపునిండదు అన్న భావనతో నున్నాము. 

 .అది నిత్యానుష్ఠానము.కాని అప్రయత్నముగనే ఆ గోవులు-గేదెలు వాత్సల్యముతో తమకు తామె అమృతమును వర్షించగలవు.ఇది విశేషానుగ్రహము  .

 మన గోపిక అన్న చేసిన పాలుపితుకక పోవుట అన్న పని బాహ్యమునకు దోషము.నిత్యకర్మానుష్ఠానమును చేయలేదు.  .కాని దీనిని మించిన సంపదను పొందుటకై దీనిని విడిచివేసినాడు.అది గుణము.


 గోదమ్మ పాశురములో శ్రీరామునికి కోపమువచ్చి దక్షిణలంకాసురుని సంహరించుట అంతే యోగరహస్యము.

దక్షిణము వైపునున్న దశకంఠుడు.కుండలిలో జాగరూకత మరచి,పది ఇంద్రియములను నిగ్రహించలేని స్థితిలో నున్నవాడు.వానిని జాగృతమొనరించుటయే పరమాత్మ చేసిన మనోభిరామత్వము.

 ఓ చెలి!  మీ ఇంటిచుట్టుముట్టువారు నీ అలసత్వమును గమనించకముందే మమ్ములకరుణించి,మేల్కాంచి మాతో నోమును జరింపించుటకు రమ్మని,ఆమెతో పాటుగా


" పనిత్తళై వీళనిన్ వాశల్ కడైపట్ర"

 పైన మంచుకురుస్తున్న

 నేల చిత్తడిగ నున్న,


  అనుగ్రహమనే ఇంటి చూరుపట్టి నిలుచునియున్న,   

  మనలను సైతము నడిపించుచున్న 


   ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...