ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥Wednesday, March 29, 2023
ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SAPTASAPTIMAREECHIMAAN)-10
Thursday, March 23, 2023
ANIRVACHANEEYAM ADITYAHRDAYAM(PRAJA-PRANA)-10
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః ।
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥Wednesday, March 15, 2023
ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(VIVIDHA KARTA ESHA)-09
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః ।
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః
Wednesday, March 8, 2023
ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(ESHALOKAAN PAATI)07
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ।
ఏష దేవాసుర-గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥గమనములకు అనువుగా ప్రభావితముచేస్తూ-నమస్కారములు.
Tuesday, March 7, 2023
ANIRVACHANEEYAMU-ADITYAHRDAYAMU(BHASKRAM-BHUVANESVARAM)-07
ANIRVACHANEEYAMU-ADITYAHRDAYAMU(SARVAMAANGALYAM)-06
సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ ।
చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥Monday, March 6, 2023
ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AKSHAYAM PARAM SIVAM)-05
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ ।
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ANIRVACHANEEYAM-ADITYAHRADAYAM(GUHYAM-SANATANAM)-04
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ ।
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥Sunday, March 5, 2023
ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AGASTYOE BHAGAVAAN RISHI)-03
కొండను నియంత్రించినవాడు అగస్త్యుడు.అగము/నగము అంటే కొండ.కొండను ఎత్తుగా పెరగవద్దని నియంత్రించిన మహా తపోశక్తి సంపన్నుడు.ఇది వాచ్యార్థము.
అగము అను శబ్దమునకు ఇంద్రియము అనునది మరొక భావము.అవి కొండల్లా ఎదిగి మనస్సును ఆవరించి కదలనీయవు.ఒక్క కొండను దాటుటయే ఎంతకష్టమో.అటువంటిది ఆరు ఇంద్రియములు ఆరు కొండలుగా మనసును చుట్టుముట్టి,పొరపాటున కదిలి వెళ్ళిపోదామనుకుంటే కదలక వాటి మధ్యలో నున్న లోయలలో పడవేస్తుంటాయి.
రావణాసురునిది అదే దయనీయమైన స్థితి.కామము అనే ఇంద్రియము కొండలా ఎదిగి కదలక నిలిచి సీతమ్మను అపహరించునట్లు చేసినది.ఎక్కడ తప్పించుకుంటాడో అని క్రోధము వానిచే సీతమ్మను నిర్బంధింపచేసి తనను వివాహమాడమనుట, అను రెండు విషయములతో కామము-క్రోధము రెండువైపులా పెద్ద కొండల్లా కమ్ముకున్నాయి.వెనువెంటనే తనకే దక్కాలన్న మోహము,ఆమె రామధర్మపత్ని అన్న మాత్సర్యము మరింత పెద్దకొండలై రావణుని బంధించాయి.ఎటు కదలలేడు.కదిలినా ఉండేది లోయలోనే తప్ప వాటిని దాటలేడు.వానిని ఆ కొండలనుండి బయటకు తెప్పించగలవాడు,వాని అవస్థను తప్పించగలవాడును అగస్త్యుడనే పాత్రధారుడే సుమా.అంతేకాదు.
రఘువంశ కులదైవము సూర్యభగవానుడు.
రాఘవునకు ఉపదేశము చేయబడినది ఆదిత్యహృదయము.
శ్రీ రామునకు ఉపదేశించినది సూర్యతనయుడు అగస్త్యమహాముని.
.అంతకు మించిన సన్నివేశమేముంటుంది.
సూర్య భగవానునికి-ఊర్వశికి భావనలో జనించి,కుండలో పెరిగి ప్రకటితమైన మహాముని అగస్త్యుడు/కుంభముని.
రాజగురువు వశిష్టుడుకదా ఆయన బదులు అగస్త్యుడు యుద్ధభూమిలో శ్రీరామునకు గుహ్యముగా ఆదుత్యహృదయము ఉపదేశించుట అన్న సందేహము కలుగవచ్చును.
వశిస్టుడు -అగస్త్యుడును ఒకే కుండలో ఊర్వశీ పుత్రులుగా పెరిగి మైత్రావరుణులుగా ప్రకటింపబడినారు.కనుక వరుస ప్రకారము గురుతుల్యులే.
ఆ విశిష్టమైన యుద్ధమును దర్శించుటకు దేవతలతో పాటుగా అగస్త్య్డుడును వచ్చినాడట.చింతాక్రాంతుడిగా నున శ్రీరామునికి గుహ్యమైన/సనాతనమైన ఆదిత్యహృదయ స్తోత్రమును ఉపదేశించి యథాగతం/తిరిగి స్వస్థలమునకు వెళ్ళి సూర్యునితో పాటుగా యుద్ధకార్యోన్ముఖుడైన రాముని యుద్ధమును చూచుటకు సన్నద్ధుడైనాడట.
రావణుడు వరప్రభావముచే శత్రాస్త్రములచే మరణముపొందనివాడు.రాముడు ధర్మయుద్ధమును మాత్రమే ఆచరించువాడు.అలిసిన రావణునితో యుద్ధముచేయుటకు మనసొప్పక ఇంటికి పంపించివేసిన ధర్మశాలి.
కథనం ప్రకారములో లంకలో సీత భగవంతుని ఆశ్రయించి యుద్ధరహితస్థలికి చీకటితో నిండిన లంకను వీడి చేరాలనుకుంటున్నది.రావణుడు ఉపాధిసక్తిని చైతన్యశక్తిగా భావించక పోరాడి ధర్మమును జయించాలనుకుంటున్నాడు.అదియును మూర్తీభవించిన ధర్మముతో.
రామచంద్రమూర్తి రావణుని బ్రహ్మాస్త్రముతో తుదముట్తించడు.ఎందుకంటే దాని ప్రభావము అమాయక జీవులకు సైతము ఆవరించివేస్తుంది.దివ్యాస్త్రములను ప్రయోగించడు.ఎందుకంటే మానవధర్మమును సమస్తలోకాలకు చాటిచెప్పలనుకున్నాడు.
రావణుని శాపవిముక్తుని చేయవలసిన బాధ్యత నిర్వర్తించాలంటే ధర్మయుద్ధము చేయవలసినదే.దానికి రావణుడు సహకరించవలసినదే.
కనుక రాముడు సమరే చింతయాస్థితుడుగా ఉన్నాడు.
రావణుడు సైతము నిస్సహాయుదై యున్నవేళ సారథి రథమార్గమును మరల్చి,సేదతీరే అవకాశము ఇచ్చాడు.తెలివి వచ్చిన తరువాత రావణునకు అది అవమానముగా అనిపించినది.కనక తతో యుద్ధములో విపరీతముగా అలిసిపోయానని-పరిశ్రాంతం,చింతయాస్థితిలో నున్నాడు.
ఇట్తి ధర్మ సంకతమును తొలగించగల వాడు సాక్షాత్తు సూర్య పుత్రుడైన అగస్త్యుడు మాత్రమే.రామునిది సూర్యవంశము.చేయవలసిన కర్తవ్యము సూర్యోపదేశము.
అంతే కాకుండా విజ్ఞుల కథనము ప్రకారము కోసలదేశ పాదాతి దళమునకు సంరక్షకుడిగా అగస్త్యుడు,నౌకాదళమునకు గుహుడు,ఆకాశ దలమునకు జటాయువు నియమింపబడ్డారని చెబుతారు.అదే కనుక నిజమయితే అది రాజ్య రక్షాధర్మము.
అగ్రతో దృష్ట్వా అనునది మరొక విశేషము.
అగ్రతో సమీపములో చూసి అని ఒక భావన.
సాహిత్య పరముగా అన్వయించుకుంటే,
"నానృషి కురుతే కావ్యం"
మూర్తీభవించిన జ్ఞానము ఋషి.అందులోను తన జ్ఞానమును సరజన శ్రేయస్సుకై అందించువాడు.కనుకనే అగస్త్యుడు సమస్తలోకములకు సమ్మంగళాశాసనముగా ఆదిత్య హృదయస్తోత్రమును అందించెను.
తం సూర్యం ప్రణమామ్యహం
ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(UPAGAMYAA AGASTYO)-02
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ ।
ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిఃANIRVACHANEEYAM- ADITYAHRDAYAMU(TATOE YUDDHAM)-01
తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥ఆ అగ్రతోదృష్ట్వా అని ఆరాధించేవారు ఉన్నారు.
Saturday, March 4, 2023
ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-INTRO
ఆదిత్యహృదయము
*************
"ఏకం సత్ విప్రా బహుధా వదాతి"
వాల్మీకి విరచితమైన "శ్రీమద్రామాయణము" లోని యుద్ధకాండమునందు "ఆదిత్యహృదయస్తోత్రము" అగస్త్యమహాముని చే అనుగ్రహింపబడినదని ఆర్యోక్తి.
కథాకథన ప్రకారముగా,
దక్షప్రజాపతి కుమార్తె అదితి.కశ్యప ప్రజాపతి ధర్మపత్ని.వీవివి సంకేత నామములు.వానినే గౌణ/గుణమును తెలియచేయు నామములని చెబుతారు.అదితి అనగా అఖండము.కష్య అనగా ప్రకాడము.అకహండ ప్రకాశమే వారి దాంపత్యము.
మాతృస్వరూపిణి అయిన అదితీదేవి ధర్మసంరక్షణమునకై "అదిత్యోపాసనమును" ఉపాయముగా భావించి,తన భర్త అనుమతిని స్వీకరించి,పరమాత్మను ప్రార్థించుటకు పూనుకొనెను.
పరమాత్మ(సూర్యభగవానుడు) తల్లికి ప్రత్యకముగా కనబడి,సుష్మ్న అనే కిరణము ద్వారా ఆమె గర్భవాసము చేసే వరమును ప్రసాదించెను.
తరువాత జరిగిన కథను మనము ముందు సంచికలలో తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
అదితి అనగా అఖండముగా మనము భావించుకుంటే అఖండమునకు లభించిన అనుగ్రహమే "ఆదిత్య హృదయము".
పరంజ్యోతిని అదితిగా భావించుకుంటే పరమాత్మ ప్రకాశమే ఆదిత్య హృదయము.
కిరతి-వ్యాపకము-కిరణము.వ్యాపకత్వమే హృదయమైతే దానిని వ్యాపింపచేసేది అదితి.అంటే వ్యాపకశక్తి-వ్యాపకత్వమే ఆదిత్యహృదయము.
విత్-తెలుపునది వేదముగా భావిస్తే,వాటిని
త్రయీ వేద్యము గా భావిస్తే మూడువేదములుగా,
మూలశక్తి-ఋఇగ్వేదముగా
చైతన్యశక్తి-యజుర్వేదముగా
వ్యాపకశక్తి-సామవేదముగా అన్వయించుకుంటే
వేద సారమే ఆదిత్యహృదయము.
నాదమయముగా నమ్మితే,గాయత్రీమంత్ర రహస్యమే ఆదిత్యహృదయము.
"నేలనీరు నింగిచేరు ఆ సూర్యుని సాక్షిగా
నింగినీరు నేల జారు ఆ వర్షము సాక్షిగా"
అన్న వాక్యములను గ్రహిస్తే
అగ్ని-సోమాత్మక తత్తము ఆదిత్యహృదయము.
మన ప్రయత్నముగా ప్రతి శ్లోకమును అర్థమును గమనించి-గ్రహించుటకు స్వామి కరుణను అర్థిస్తూ
ముందుకు సాగుదాము.
తం సూర్యం ప్రణమామ్యహం.
Friday, March 3, 2023
SIVATANDAVA STOTRAMU(ANUGRAHAMU)-15
పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15.
ప్రస్తుత శ్లోకము కథాపరముగా అన్వయించుకుంటే పూజను ముగించే సమయమున,సాయం సంధ్యా సమయమున చదివినటయితే అశ్వములు-ఏనుగులు-రథములు లభించుటయే కాక అవి మరలిపోక స్థిరముగా ఉంటాయని చెప్పబడినది.పది నాలుకలు కల రావణుడు దీనిని పఠించినట్లు-పరమేశ్వరునిచే అనుగ్రహింపబడిన కథనము కలదు.ఒక విధముగా ఇది సంప్రదాయ మంగళాశాసనము.సంపదలను అనుగ్రహించేవాడు శంకరుడు.అనగా సంకరుడు అను నామము-శిరముపై జటలు-గంగ-చంద్రవంకను ధరించి,మెడలో పాములను హారములుగా ధరించి,డమరు నాదమును మ్రోగించుచు ,అమ్మ పార్వతీదేవిని కూడి తాండవమాడు స్వామిని స్మరించుకుంటే అసమాన సంపదలను పొందుతారని ఆర్యోక్తి.
కాని కొంచము నిశితముగా పరిశీలితే ఎన్నో విశిష్ట పదముల వివరణను గ్రహించగలిగితే మనము తప్పక మన మనసును పరమేశ్వరార్పనము చేయకుండా ఉందలేము.
స్వామి తాందవమును వర్ణించిన సాధకుడు ఆ పవిత్ర తాండవము తనలో కూడా నిరంతరము జరుగుచున్నదని,ఆ నర్తనమును గమనించుకొనుటయే లక్ష్మీ సుముఖత్వముగా గ్రహించగలగాలి.
తన స్వస్వరూపమును అర్థముచేసుకొనుటయే పూజ.పూజానంతరము పఠించుట అని చెప్పబడినది.
తన నిజస్థితిని గ్రహింపచేయునదియే "దశవక్త్ర గీతం."
పదినాలుకలు పలికిన పదితలల వాని విరచితమైన స్తోత్రమిది అంటుంది కథనము.
పది ఇంద్రియములు(ఐదు జ్ఞానేంద్రియములను-ఐదు కర్మేంద్రియములను చైతన్యవంతము చేయునది శివతాందవము అంటుంది విచక్షణ.
పంచభూతములను-పంచ తన్మాత్రలను సమస్థితిలో నుంచునదే శివతాండవము అంటుంది ప్రకృతి.
పంచకృత్యములను-వాటి సమన్వయమును తెలియచేయునది స్వామి తాందవము అంటుంది సనాతనము.
దశదిశలను సమన్వయ పరచుట అంటుంది మరొక వాదము.
ఏది ఏమైన ఎవరు ఏ విధముగా అన్వయించుకొనిన మనలోని వివేకమును జాగృతపరచునది తాండవ స్తోత్రము.
కనుకనే నీవు కనుక దానిని గమనించి గౌరవిస్తే నీ తమోభావము తొలగి నీ మనసనే గుఱ్ఱము నిన్ను అనుసరిస్తు,రథమనే నీ ఉపాధిని ఉన్నతముగా మలచి,నిన్ను ఉధ్ధరిస్తుంది.
ఏక బిల్వం శివార్పణం.
Thursday, March 2, 2023
SIVATANDAVASTOTRAMU(VISUDDHIM ETI SAMTATAM)-14
ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||
Wednesday, March 1, 2023
SIVATANDAVA STOTRAMU(SIVETI MAMTRAMUCHCHAREN KADA-WHEN)-13
కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||
SIVATANDAVA STOTRAMU( KADA SADASIVAM BHAJE--ELIGIBILITY TO WORSHIP)-1212
దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || 12 ||
TANOTU NAH SIVAH SIVAM-12
తనోతు నః శివః శివం-12 ***************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...