దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ ।
ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ప్రస్తుత శ్లోకములో రెండు పాత్రలు ప్రవేశింపబడినవి.అవి,
1.అగస్త్య మహాముని
2.దేవతలు.
ఇంకొక విశేషము మొదటి శ్లోకములో యుద్ధమునకు సిద్ధముగా సమీపించిన రావణుని ప్రత్యర్థి రామచంద్ర ప్రభువుగాను పేర్కొనబడినది.
రాముడు భగవానుడు.
రామునికి ఉపాగమ్యా-సమీపమునకు వచ్చినవాడు ఋషి అగస్త్యమహాముని.
ఇంకొక విచిత్రము ఈ యుద్ధమును వీక్షింపచేయుటకు అగస్త్యుడు దేవతలందరిని తనతో కలుపుకొని/కూడి వచ్చెను.
అగస్త్య-గమ్య అగస్త్యుడు వచ్చెను.
అగస్త్య సమాగమ్యా-అగస్త్యుడు-దేవతలతో కలిసి వచ్చెను.
వచ్చిన అగస్త్యుడు
రామం ఉపాగమ్యా-రాముని దగ్గరకు సమీపించెను.
అంటే రామునికి అగస్త్యమహాముని ఆదిత్యహృదయమును ఉపదేశించునపుడు మిగిలినవారు వినలేదా/యుద్ధము జరుగలేదా అను అనుమానములు కలుగ వచ్చును.
అది సామాన్యమైన రామ-రావణ యుద్ధము కాదు.అంతా నిమేషము-రహస్యము-రమణీయము.
అంతే కాదు అభ్యాగతో అన్న పదం ప్రయోగించబడినది.అంటే వారు అనుకోకుండా,తిథి-వార-నక్షత్రములను గమనించకుండా వచ్చే అతిథులు కారు.ఎప్పుడెప్పుడు వారు రావణ శమ్హారమును ప్రత్యక్షముగా వీక్షించి,శ్రీరామచంద్రునకు జయజయధ్వానములతో,పుష్పవర్షమును కురిపించవలెనన్న కాంక్షతో నున్నవారు.
అంతే కాదు.అగస్త్యమహాముని ఆదిత్యమంత్రమును ఉపదేశించి వెడలిపోయినాడు.చివరి వరకు అక్కడలేదు.
అసలు రామచంద్ర ప్రభవు యుద్ధముచేయువేళ కులగురువైన వశ్ష్టుడు రాకుండా అగస్త్యుడు రావటం,,మంత్రోపదేశము చేసి మరలిపోవటం ఎమిటి?
అసలెవరీ అగస్త్యుడు.అన్న విషయమును తరువాతి సంచికలో తెలుసుకుందాము.
No comments:
Post a Comment