సనాతన పూజావిధానములో జలమునకు ప్రాధాన్యత ఉంది.పూజా ప్రారంభమునందు చేయు ఆచమనీయము,షోదశపూజలో చేయు అర్ఘ్యము-పాద్యము-శుద్ధ ఆచమనీయము,శుద్ధోదక స్నానము,ఉదకశాంతి ఎంతో ముఖ్యమైనవి.
బాహ్యమునకు సుచియై చతిలో జలమును గాయత్రీమంత్రపూర్కముచేస్ ఊర్ధ్వ దిశగా చేయు సంధ్యావందన ప్రకృఇయగా భావిస్తారు.కొందరు మూడు సంధ్యలయందును సూర్యునికి అర్ఘ్యమును సమర్పించే విధానమును పాటిస్తారు.
దీనివలన వాతావరణ పారిశుభ్రమునకు ఆటంకము కలిగించే సూక్ష్మజీవులు నశించి పర్యావరణము పచ్చగా ఉంటుందని సమర్థిస్తారు.ఇది కాదనలేని అంసమే.
ఆధ్యాత్మికముగా ఆలోచిస్తే గరుడ పురాణములో చెప్పబడినట్లు మనకు సూర్యునికి మధ్య అడ్డముగా మందేహులు అనే అసురులు ముసురుకుంటారని వారిని మంత్రపూరిత(గాయత్రీ) జలముతో-దోసిలి నింపుకుని పైకి విసిరిన అద్దకులు తొలగిపోవునని భావిస్తారు.అదియును కాదనలేని విషయమే.
శ్రీ లలితారహస్య సహస్ర నామ స్తోత్రములో చెప్పబడినట్లు,
కేవాలా-కైవలానర్ఘ్యా-కైవల్యపదదాయిని" అన్న శ్లోకమును విచారిస్తే అర్ఘ్య అన్న పదమును గడియగా భావించి,గడియలులేని కైవల్యమును కేవలానర్ఘ్యగా అమ్మను అనుగ్రహించేదానిగా కీర్తిస్తారు.
మన-దేహులు పదమును కొంచము పరిశీలిస్తే దేహులు-మనమున కలుగుచున్న జాడ్యమే/చీకటే అసురత.దానిని తొలగించకలిగినవి సూర్యకిరణములు.
మన శరీరావయములలో కొన్ని నల్ల రంగుతో-మరికొన్ని ఎర్ర రంగుతో-ఇంకొన్ని తెల్లరంగుతో,కొన్ని గోధుమ వర్ణముతో రంగు-రంగులతో చైత న్యరూపముగా ప్రకాశించుచున్నవి.ఏ విధముగా సూర్యకిరణములు తెలుపునుండి విస్తరింపబడి ఇంద్రధనుస్సుగా మారుచున్నవో మన దోసిలి యందలి నీరు సైతము సూర్యకిరణముల కాంతిని స్వీకరించి పలురంగులుగా మారి పంచేంద్రియములను చురుకుగా పనిచేయించుచున్నవి.
మనలోని పరమాత్మయే అనేకానేక చేతనములని సంకేతించుటయే అర్ఘ్యప్రదానమని పెద్దలు దానిని ఆత్మనివేదనముగా భావించి ఆచరిస్తారు.
సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీసహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ||
తం సూర్యం ప్రణమామ్యహం.
No comments:
Post a Comment