నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః ।
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ-న్నమోఽస్తు తే ॥ 15 ॥ ప్రస్తుత శ్లోకములో నమస్కార ప్రక్రియ ప్రవేశింపబడినది.అంతేకాదు ఖగోళ వాసులైన నక్షత్రములు-తారలు-గ్రహములు-ఉపగ్రహములలో అంతర్యామిగా దాగి విశ్వరచన చేసిన పరమాత్మ
పర-వ్యూహ-అర్చా-అంతర్యామి తత్త్వములు పన్నెండు విధములుగా /ద్వాదశాత్మన్ గా ప్రస్తుతింపబడుతున్నాడు.
సామాన్య వ్యవహారములో నక్షత్రము-తారలు ఒక్కటిగానే భావింపబడుతున్నప్పటికిని,వైజ్ఞానికముగా సందర్శించిన వారు నక్షత్రములలో అశ్వనీ మొదలైన 27 వాటికి ప్రాముఖ్యతనిచ్చి వాటిని స్వయంప్రకాశములుగా/పగటిపూటను సైతము మనకు గోచరించువానిగాను భావిస్తారు.
తారలు అసంఖ్యాకములైనప్పటికిని వాటిని స్వయంప్రకాశములుగా కాక రాత్రియందు మాత్రమే ఆకాశమున కనిపించువానిగా సూర్యశక్తికి కనుమరుగు స్వభావము కలవానిగా భావిస్తారు.
అదేవిధముగా సూర్యుడు నక్షత్రమని వైజ్ఞానికులు-నవగ్రహములో ఒక గ్రహముగా ఐతిహాసికులు భావిస్తారు.అదే విధముగా చంద్రుని ఉపగ్రహముగానే అంగీకరిస్తారు వైజ్ఞానికులు.సూర్య కిరనములనుండి తమ చల్లదనమును-చక్కదనమును కల వెన్నెలనందించుచునాడని భావిస్తారు.
రాహు-కేతులను చాయా /నీడలుగా గ్రహములుగా గణిస్తారు.
అప్పుడు మిగిలినవి ఐదు గ్రహములే.పంచభూతములను-పంచేంద్రియములతో మేళవించి ప్రపంచమును నడిపించుటకు
పరమాత్మ అంతర్యామిగా వీనిలోనికి ప్రవేశించి,పన్నెండు విధలుగా పన్నెండు నెలలలో ప్రకాశిస్తూ-పరిపాలిస్తుంటాడు.
"బృహత్వాత్-బృమ్హణత్వాత్ ఇతి బ్రహ్మ."అన్నింటికంటె ఏదిఉత్కృష్టమైనదో అది,బృహతి.బృమ్హణము అంటే వ్యాపకత్వము.ఏది అన్నిటికంటె మహోత్కృష్టమైనదో,ఏది అన్నింటియందు వ్యాపించి యుందో అదియే "బ్రహ్మము." వేదము ఆదిత్యుని బ్రహ్మముగా కీర్తిస్తుంది.సర్వజీవుల యందలి ఆత్మయే బ్రహ్మము.అది జగతఃస్థుషః -తాను కదలకుండ ఉంటూ అన్నింటిని కదిలించే శక్తి గల స్థావర-జంగమాత్మకము.
No comments:
Post a Comment