మండలాంతర్గత పరమాత్మ రధగమనమునకు శుభారంభముగా వాలిఖ్యాది మహా మునులు వేదపఠనమును చేస్తుంటారట.
అసలు సూర్యునికి వీరికి కల అవినాబావ సంబంధమేమిటి? అన్న సందేహము కలుగవచ్చును.
సనాతన సంప్రదాయ ప్రకారము వీరు అంగుష్టమాత్ర పరిమాణములో కనిపించు మహా తపసంపన్నులని నిర్ధారించినప్పటికిని వారి ఆవిర్భావ కథనములు అనేకానేకములుగా చెప్పుకుంటారు.
వీరు అసంఖ్యాకులనియు,60,000 మించి యున్నారనియు నమ్ముతారు.
ప్రకృతి అవిచ్ఛిన స్వరూపమే వాలిఖ్యాదిములని (వాలహిల్యమని)కొందరు,ఋగ్వేద మంత్రములను వాలిఖ్యములంటారని కొందరు భావిస్తారు.ప్రజా పతి రేతశ్సు సీఘ్ర స్కలనము నొంది అనేకానేక మహాసక్తులని సృష్టించిందని నమ్ముతారు.
శివ పురాణ కథనము ప్రకారము శివ-పార్వతుల కళ్యాన మహోత్సవ సమయమున పార్వతిని చూసిన బ్రహ్మకు మనసు చెదిరి జారిపడిన వీర్యమును కాలితో కప్పచూడగా పరమేశ్వరుడు దానిని అగ్నికి హవిస్సుగా సమర్పించమనెనట.అప్పుడు అగ్నిలో నుండి సూర్యతేజముతో-తపోనిధులైన అంగుష్టమాత్ర పరిమాణముతో అనేకానేక దివ్య పురుషులు ఆవిర్భవించారట.వారు అనునిత్యము సూర్యోదయము నుండి-సూర్యాస్తమయము వరకు స్వామిని ప్రస్తుతిస్తూనే ఉంటారట.సూర్య రథగమనమునకు నాందిగా వారు ఆశీర్వచనములతో ఆదిత్యుని అర్చిస్తుంటారట.
తం సూర్యం ప్రణమామ్యహం.
No comments:
Post a Comment