ప్రియ మిత్రులారా ,శరత్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు.
శ్రీ మాత్రే నమః.
" వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే
జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌః"
పార్వతీ-పరమేశ్వరులు శబ్దము-అర్థము వలె-పూవు-తావి వలె,శబ్దము-అర్థము వలె నిత్య సంబంధము కలవారు.తన రఘువంశ కావ్యారంభములో వారిని,వాగర్థ ప్రతిపత్తికై/ప్రతిభా-పాటవములకై వాగర్థస్వరూపులైన వారిని నమస్కరించి వరప్రసాదుదైన మహా కవి కాళిదాశుని కనికరించిన తల్లి ,మనలనందరిని కనికరించుచున్నదా యనునట్లు మహాకవిచే మరొక అమృత లహరి/అద్భుత వాగ్ఝరి అయిన 'కాళికా దసశ్లోకి" అను మరొక 13 శ్లోకము అంబాస్తుతిని మానవాళికి అనుగ్రహింపచేసినది.అతివేగముగా అమ్మ వారి అనుగ్రహమును పొందగలిగిన స్తోత్ర రాజము అమ్మవారిక్షిప్రప్రసాద గుణమునునకు ప్రతీకగా "అశ్వధాటీ స్తొత్రముగా" వాసికెక్కినది.వేగముగా పరుగులు తీయుచునంబ ఆడుగుఱ్ఱపు డెక్కల సవ్వడి వంటి శబ్ద వేగముతో,కళ్లకు గంతలు కట్తుకుని అటు-ఇటు చూడని ఏకాగ్రత కు మారుగా,గమ్యమును చేర్చుటకు పూనుకొనిన ఆ జగజ్జనని సాక్షిగా,ఏ మాత్రము అర్హత-అనుభవము -పాండిత్యము లేని ఈ ఉపాధి దుస్సాహసమును చేయుచున్నది.
13 శ్లోకములు పరమపద సోపానములు.
వాక్కు పరముగా అన్వయించుకుంటే "అశ్వధాటీ"పరుగులుతీస్తున్న ఆడగుఱ్ఱపు రెక్కల వేగమును అధిగమించిన వేగముతో శ్రావ్యమైన శబ్దాలంకారములతో,శాశ్వతమైన పరమపద సోపానమైన స్తోత్రము మన మనస్సును సత్తువైపునకు మళ్ళించి సంతుష్టులను చేయుగాక.
ప్రతి శ్లోకము రసరమ్యగుళికయే.అలంకార శోభితమే.పరమార్థ ప్రకాశ-పరిమళ భరితమే.తల్లి రూపము,నివాసము,స్వభావము,సాన్నిహిత్యము,దిరిత సంహారము వర్ణించుట వేయితలలున్న ఆదిశేషునికి సైతము సులభముకాది.శివమహిమ్నా స్తోత్రములో పుష్పదంతుడు విన్నవించుకున్నట్లు
అసితగిరి సమంస్యాత్ కజ్జలంసింధుపాత్రే
సురవరు తరుశాఖా లేఖినీ పత్రముర్వీ
లిఖితయది గృహీత్వా శారదా సర్వకాలం
తదపి తవగుణానాం......
అన్నట్లుగా,తల్లినివాసము-సంబోధనము-దివ్యమంగళరూప-సందర్శనము-వీక్షించిన సందర్భము,సన్నివేశము,శబ్దమకరందము,అర్థమాథుర్యము,సాధకునిపరిస్థితి-సాధనావిధానము-ఇతరగ్రంధశ్లోకములతో సమన్వయము,తల్లీ
నుగ్రహము సూచించిన సంకేతము మొదలగువానిని గ్రహించే ప్రయత్నము నేనుమీతో పాటుగా ప్రారంభిస్తాను.ఆపై అమ్మదయ.
యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.
సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.
ఈ నా చిన్ని ప్రయత్నములోను దోషములను-అజ్ఞానమును పెద్ద మనసుతో క్షమించి మనమందరము కలిసి చేసుకునే ఆరాధనముగా భావించి,నన్ను ఆశీర్వదించుదురు గాక.
No comments:
Post a Comment