కదా త్వాం పశ్యేయం_18
*************************
"జిహ్వ చిత్త శిరోంఘ్రి నయనశ్రోతైః అహం ప్రార్థితం
నమామి భగవత్ పాదం శంకరం లోకశంకరం."
",ప్రభు! త్వం దీనానాం ఖలు పరమ బంధుః పశుపతే
ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వ మనయోః
త్వయైవ క్షంతవ్య "శివ"' మత్ అపరాధశ్చ సకలాః
ప్రయత్నాత్ కర్తవ్యం మదవనయం బంధుసరణిః"
నేను పశువును.నువ్వు పశుపతివి.మనిద్దరికి మధ్యన జగత్పిత-జగత్ పుత్ర బంధమున్నది అన్న విషయము లోకవిదితమే.
కాని ఆ బంధము సమ్యక్ బంధము.సంపూర్ణ బంధము.
అందులో నన్ను వీక్షించుట-నా తప్పులను క్షమించుట-నన్ను రక్షించుట అన్న మూడు విషయములు దాగిఉన్నవికదా .వానిని లోకవిదితముచేయుటకు మనది కేవల బంధముకాదని-సంబంధమని ,సదాశివుని కీర్తిస్తూ ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.
" ఓం నమః శివాయ."
త్వరగా నడవవయ్యా శంకరయ్యా.నేను ఈ దొంగను అక్కడనున్న కార్యకర్తకు అప్పగించాలి.అసలే రద్దీగా ఉంటుంది.పైగా ఇతని అవలక్షణముల జాబితాను వల్లించాలి.ఆయనకునచ్చితేనే స్వామి దగ్గరకు అనుమతిస్తాడు.లేకపోతే మళ్ళీ సంవత్సరము జాతరకు తీసుకు రమ్మంటాడు.
అనగానే "అవలక్షణములా" ఆశ్చర్యముగా అడిగాడు శంకరయ్యా ఆ పెద్దమనిషిని.
అవునయ్యా బాబు క్రిందటి సంవత్సరం ఒకతను అప్పటి కార్యకర్తతో,
తనతో నున్న వ్యక్తిని చూపిస్తూ,
"అసారే సంసారే నిజభజనదూరే" అనగానే ,మెల్లగా మారతాడులే అని వెనక్కి పంపించేశాడు.
మరొకవ్యక్తి,
'దురాశా భూయిష్టే దురధిపగృహద్వార ఘటకే "
ఇంటి ముందర నిల్చున్నందుకేనా,తిరిగి వెళ్ళిపోతాడులే అన్నాడు.
అంత కష్టమా అక్కడ మనకు అనుమతి దొరకటము అని అడిగాడు శంకరయ్య.
అదేకదా! నేను చెప్పేది.గతసంవత్సరము వాళ్ళే కాకుండా ప్రస్తుతము వాళ్ళు ఎంతోమంది.
పాహి-పాహి పరమేశ్వరా-
హర హర మహాదేవ శంభో
మహేశా-పాపవినాశ
అన్యథా శరణ నాస్తి..
అంటూ శరణుఘోషలు మంగళవాయిద్యములవలె మారుమ్రోగుతున్నాయి.
దర్శనమునకై వచ్చినవారిని వరుస క్రమములో నిలబెడుతున్నాడొకప్రమథుడు.
స్వామి సన్నిధిని ఎలా ప్రవర్తించాలో తెలియచేస్తున్నాడొక ప్రమథుడు.
మరొక వ్యక్తి అసహనముగా,
ఏమయ్యా ! ఎన్నాళ్లు పడుతుంది మీ స్వామికి నాకోరికను మన్నించడానికి? ఎందుకు జాప్యము చేస్తున్నాడు? చేయటము చేతకాకనా అంటే,
బ్రహ్మ ఐదో తల అప్రయత్నముగా గిల్లివేశాడు కదా అపరాథము చేశాదని.
అయినా నేనేమైనా అసాధ్యమైన కోరికనుకోరానా,అంటూ,
"నిత్యం స్వ ఉదరపోషణాయ సకలాన్ ఉద్దిశ్య విత్తాశయా వ్యర్థంపర్యటనంకరోమి"
ఎంతసేపు చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ,దానికి కావలిసిన విత్తమువైపు పరుగులు తీస్తున్నానయ్యా" కాస్త వాటిని ఆపు అని అడిగాను.రేపురా-మాపురా అంటున్నాడు ఆ మహాదేవుడు అని దబాయిస్తున్నాడు.
ఎందుకలాచేస్తున్నాడు? ఆ మహాదేవుడు అర్థంకాక అడిగాడు శంకరయ్య.
కొందరు మహాదేవుడంటుంటే మరికొందరు మాయదేవుడంటారు.
కొందరు నమ్ముతారు.మరికొందరు నమ్ముతున్నట్లు నటిస్తారు,
కొందరు స్వామి అంటే భయపడతారు మరికొందరు భయమును నటిస్తారు.
కొందరు అర్థిస్తారు మరికొందరు అర్థిస్తున్నట్లు నటిస్తారు.
నటిస్తారా అంటూ,
తనపరిస్థితిని తలచుకున్నాడు.తాను సైతము నిందించిన వాడేగా స్వామిని.ఇప్పుడు మాత్రం నిజమెంతో నిశితంగా పరిశీలించాలన్న తలపును తరిమివేయలేదుగా.ఇంకా నాలో తచ్చాడుతూనే ఉందిగా....
ఎందుకంటారంటారేమిటండి.ఏకాగ్రత ఏదీ?చిత్తశుద్ధి ఏది? "ఈయనకు తమాషాగా ఉంది ఈశ్వరానుగ్రహము."
మనస్పూర్తిగా నమ్మి వేడుకుంటే మహాదేవుడు
మన్నించ ...క ఉంటాడా....
ఇంతలో తనతో పాటుగా ఒక గోమాతను తోలుకుని వస్తూ,పరమేశ్వరా నీ పాదపద్మములనే గోశాల యందు దీనిని కట్టనిమ్ము.ఈ తల్లి నిరంతరము ఆనందామృతమనే క్షీరధారలను అనుగ్రహించగలది.అని వేడుకుంటున్నాడు.
'అమితముదమృతం ముహుః దుహంతీం
విమల భవత్పద గోష్ఠమా వసంతీం
సదయ పశుపతే సు పుణ్యపాకాం
మమః పరిపాలయ భక్తిధేనుం ఏకాం."
అంటే పాదాలను సేవిస్తూ,ఆనందించాలనుకుంటున్నాడా అతను.
పైగా గోశాల-గోక్షీరము-అంటున్నాడు .......
చెదరని భక్తిని అనుగ్రహించమంటున్నాడు.మళ్ళీ మాయలోపడితే మహేశ్వరుని మరచిపోతానేమో నన్న భయముతో, తన భక్తి అనే ఆవును,తనను పాలించమని,ప్రార్థించుచున్నాడు.
స్వామి ఒప్పుకుంటాడా/కాదని తప్పుకుంటాడా శంకరయ్య ?నువ్వేమనుకుంటున్నావు,?
అని అడగగానే ,అంతర్మథనం ఆరంభమయినద శంకరయ్యలో.
అనుగ్రహం వర్షించ సాగింది ఆ ప్రాంగణములో.
కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.
'తన్మై మనః శివ సంకల్పమస్తు
వాచే మమశివపంచాక్షరస్తు
మనసే మమ శివభావాత్మ మస్తు".
పాహిమాం పరమేశ్వరా.
(ఏక బిల్వం శివార్పణం)