కదా త్వాం పశ్యేయం-10
*********************
" జిహ్వ చిత్తశిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం".
" ప్రభుః త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః
త్వ యైవ క్షంతవ్యాః శివ మత్ అపరాధశ్చ సకలాః
ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః"
అంటూ ఆ దీనబంధువుని మనో ఫలకముపై స్థిరముగా నిలుపుకుని,ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.
విస్తుబోయి ఆ తుమ్మెదవంక తదేకముగా చూస్తున్న సంకరయ్య కన్ను,తన పనిని చెవికి అప్పగించిందా అన్నట్లుగా,
" సకలము నీవేనని తెలియని తెలివిని పెంచి
వికలము చేసినవి మనమును తలపులు పొంచి
తికమక వీడినది శివ-శివా కటాక్షము మెచ్చి
సకలము మీరేనని తెలిపినది శివాభ్యాం నమామి"
అని, భృంగికృత శివస్తోత్రమును శ్రావ్యముగా పాడుతూ,పూజముగించుకుని వస్తున్నారు తాతగారు..
అయ్యో-అయ్యో అపచారము తుమ్మెదను చూపిస్తూ మహాదేవుడంటావురా నీవు ,నీ పిల్లచేష్టలు అని మనమని మందలిస్తూ,అయ్యా మీరేమి అనుకోకండి.అంటూ వారివైపు చూస్తూ ,మీకు నేను ఏ విధముగా సహాయపడగలను అని వినయముగా ప్రశ్నించారు.
ఇంతలో ఆ చిన్నపిల్లవాడు,తాతా,ఆ సహాయమేదో నేను చేసాలే.శివుడు ఎలాఉంటాడో,ఏమిచేస్తుంటాడో తెలియదని -నాకు తెలిస్తే చెప్పమనగానే చెప్పేసాలే.,దీనిని చూపిస్తూ అంటూ నవ్వేసాడు .
అంతేనంటావా బడవా.కాని ఈ తుమ్మెద మహ-అసిత,చాలా నల్లని రంగుతో ఉంది.మహాదేవుడు,
మహా-సిత అందుకేగా కర్పూరగౌరం అని వినలేదా అని మందలిస్తూ,అయ్యా అదొక భావనము.
అని కళ్ళుమూసుకుని అది ఒక్కటే కాదు ..అనగానే
శంకరయ్య వాక్కుతో బాటుగా చర్మము సైతము దాని రోమములను నిక్కబొడిచి పులకిస్తోంది .నాసికసైతము పరమేశ్వర వైభవ పుష్ప పరిమళములను ఆఘ్రాణిద్దాము.ఓ శంకరయ్యా ఆలస్యముచేయక ఆ రెండో భావ సమన్వయమును కూడా వినేద్దాం అని తొందరపెడుతోంది .
"మనసులో సునామి మౌనముగా భాసిస్తున్నది" బయట.
మా శంకరయ్యకు ఇటువంటి కథలు అంతగా నచ్చవులెండి.పట్టుకోవాలనుకున్న వానిని చూపించేసారుగా.ఏమేమి చేస్తుంటాడో చెప్పాడుగా ఆ చిన్ని బాలుడు.మేము తొందరగా వెళ్ళి ఆ తుమ్మెదలను పట్టుకునే పనిలో ఉంటాము అంటూ శివయ్యా, మౌనమునకు మాటల మంత్రం వేసాడు.
' మనోబుద్ధ్యహంకార చిత్తాను...చిదానందరూపం శివోహం-శివోహం' అంటూ శంకరయ్య చిత్తవృత్తులతో సిత్రంగా ఆటలాడుకుంటున్నాడు శివయ్య.అవునంటె కాదనిలే-కాదంటె అవుననిలే అంటే ఇదేనేమో.శివోహం.
శివయ్యా ఆ తుమ్మెదనెంతసేపటిలో పట్టుకుంటాను.బుద్ధులు చెబుతాను.పూర్తిగా మార్చేస్తాను..
నువ్వేమికంగారుపడకు.
పదినిమిషాలు ఈ తాతగారు చెప్పేదేమిటో విని వెళదామన్నాడు.శంకరయ్య.
అదే నేను చెప్పేదికూడా శంకరయ్య .ఈ పెద్దమనిషి తుమ్మెదను పూర్తిగా మార్చేస్తాడు.దానితో పాటుగా మిమ్మల్ని సైతము పూర్తిగా మార్చేస్తాడేమోనని నా భయమంతా అన్నాడు శివయ్య ,భయపడుతున్నట్లుగా.
ఇంతలో మనవడు మీరు సరిగానే చెప్పారండి శివయ్యగారు.మా తాత నన్ను కూడా పూర్తిగా మార్చాలని ప్రయత్నించాడు నన్ను ఈతుమ్మెదలతో ఆడుకోనీయకుండా.
శంకరయ్య గారు మరొకసారి ఆలోచించండి
.నేను చెప్పిన దానికి విరుద్ధముగా,తుమ్మెద మహాదేవుడని-ఆదతుమ్మెద అదే భృంగీ పార్వతీదేవి అంటూ అంతటితో ఆగక భృంగి అను మరొక భక్తుడున్నాదని,తాందవమని-రావణుడని,మన్మథుడని-వింటినారి అని ,భక్తులని ఇలా ఏవేవో మాటలనే ఇటుకలను పేర్చి ,పరవశమనే సిమెంటుని వేసి,భక్తి అనినీళ్ళుపోసి తడిపి,కరుణ అనే మేస్త్రీ తో పెద్దకోటను నిర్మించి ,మిమ్మల్ని బంధించేస్తాడండి.
మిమ్మల్ని పూర్తిగా మార్చేసి-అటుకదలనీయడు-ఇటు కదలనీయడు.
ఆశ్చర్యముగా చూస్తున్న శంకరయ్యతో,
మీరు మా తాతమాటవింటున్నట్లయితే,
పదినిమిషాలు కాదు బాబు ఆ ప్రవచనము-పదిజన్మలైన సరిపోవంటాడు.
శంకరయ్యగారిని, అదే మీ మిత్రుని కాస్త జాగ్రత్తగా నిర్ణయించుకోమనిచెప్పండి .శివయ్యగారు.
నేను నా తుమ్మెదలతో ఆడుకోవటానికి వెళ్ళాలి అంటూ పారిపోయాడు.
శంకరయ్యా ! శంకరయ్యా! ఏమంటావు వెళ్దామా /తాతగారి కథలు వింటానంటావా?
ఉలుకు లేదు-పలుకులేదు.
నీఇష్టం.పదినిమిషాలైన-పదియుగాలైనా పరమానందమే అంటావా... చెప్పు అని అంటుండగా ,
' గళంతీ శంభో త్వత్ చరిత సరితః కిల్బిషరజో
గలంతీ ధీకుల్యా సరణిషు పతంతీ,విజయతాం దిశంతీ.....అని ఆశీర్వదిస్తున్నట్లుగా శంకరయ్య మనసును ఆక్రమించుకుంటోంది.
కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.
'తన్మై మనః శివ సంకల్పమస్తు
వాచే మమశివపంచాక్షరస్తు
మనసే మమ శివభావాత్మ మస్తు".
పాహిమాం పరమేశ్వరా.
(ఏక బిల్వం శివార్పణం)
No comments:
Post a Comment