కదా త్వాం పశ్యేయం-11 ******************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం." " అసారే సంసారే నిజభజనదూరే జడధియా భ్రమంతం " మాం అంధం" పరమకృపయా పాతుం ఉచితం మదన్య కో దీనః తవ కృపణ రక్షాతి నిపుణః త్వత్ అన్యం కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే." భావ శరణాగతి సమర్పణము భక్తి అనే పుష్పమును ప్రకాశింపచేస్తుంది.పరిమళింపచేస్తుంది.పరమాత్మ పాదపద్మములను చేర్చి పరవశింపచేస్తుంది. కాని పుష్పమును పొందాలంటే మొక్కయొక్క వేరునకుకదా పోషణము అవసరము. చర్మచక్షువులకు ఈ సిద్ధాంతము చిత్రముగా అనిపించవచ్చును.కాని ఈశ్వరచిద్విలాసము అదేకదా.గో క్షీరమును గ్రహించవలెనన్న గోమాత పొదుగును/శిరములను మాత్రమే స్పృశించవలెను.ఇది మరొక సాపేక్ష సిద్ధాంతము.సర్వాంతర్యామి సత్కృపను పొందవలెనన్నను "సర్వస్య శరణాగతి" యొక్కటే మార్గము. మనము రోజు చూసే పరమాత్మ సృష్టి అందచేయుచున్న సాపేక్ష సిద్ధాంతమును మన మనోఫలకముపై స్థిరముగా నిలుపుకుని ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. నాదం తనుమనిశం-శంకరం-నమామి మనసా-వచసా-శిరసా అన్న కీర్తన వినిపిస్తోంది శ్రావ్యంగా లోపలినుండి.కారుణ్యము కాఠిన్యపు ముసుగు తొడుగుకొని కట్లు విప్పుతున్నదా/కట్టిపదేస్తున్నదో అర్థముచేసుకోలేని పరిస్థితి శంకరయ్యది. ఒక వైపు తుమ్మెదలతో ఆడుకొనుచున్న బాలుడు. మరొక వైపు భాష్యమును చెప్పబోతున్న బాంధవుడు. శివయ్య ఇక్కడ కూర్చోవడం నా వల్లకాదు అనుకుంటూ తప్పుకున్నాడు శంకరయ్యకు చెప్పకుండానే. శంకరయ్యగారు మీ స్నేహితుడేడి? నన్ను చెప్పమంటారా లేక మీరు కూడా... ' ఆనందాశ్రుభిః ఆతనోతి పులకం నైర్మల్యతః చాదనం-----చరితామృతైః" లహరులలో మునకలు వేయించబోతున్నాడేమో శంకరయ్యను ఆ మూడుకన్నులవాడు,తన చరిత శ్రవణానందలహరులలో.తాతగారి మాటలతో. 1... మహాదేవుడు భృంగి అను భక్తుని సైగలననుసరించి సంధ్యా తాందవమును అనుగ్రహిస్తాడు. 2.గజాసురుని ఉదరములో దాగి , వానిని అనుగ్రహించాడు.అతని శిరమును-చర్మమును లోకపూజ్యము చేసాడు. 3.మన్మథుని బాణమునకు శక్తిని అనుగ్రహించినాడు. 4 నారాయణునికి మోహినీ రూపమును అనుగ్రహించినాడు. అనిచెబుతుండగా అయిపోయింది.ఈయన పని.మా తాత మాటల లహరులలో మునకలు వేయవలసినదే. ఎందుకైనా మంచిది.మరొక సారి హెచ్చరించివస్తాను అనుకుంటూ,వారి దగ్గరకు వచ్చి, తాతా ఒక్కనిమిషం అంటూ, ఓ శంకరయ్య గారు మా తాత చెప్పిన నలుగురిలో మొదటి ముగ్గురు అహంకరించి-హుంకరించినవారే. మీరనుకున్నట్లుగా వాళ్ళని మోసం చేసాడు ఆ-మహాదేవుడు.మొదటి వారి శక్తిని తీసివేసి ,మూడుకాళ్ల ముదుసలిని చేసాడు. రెండో ఆయనపొట్టచీల్చి బయటకు వచ్చాదండి బాబు.ఇంకెక్కడి ప్రాణము .హరీ అంది. మూడవ ఆయనను తన మూడవకన్ను తెరిచి కాల్చివేసేస్తూను.ఏమైంది.బూడిద మిగిలింది. ఆ నాల్గవ ఆయనను అమ్మాయి కమ్మన్నాడు.తనను ఆకర్షింపచేయాలన్నాడు.ఆ మహా-మహా-దేవుడు. నా ఈ నల్లతుమ్మెద చూడండి.,మాయలు లేవు-మర్మాలు లేవు.మహదానందపరుస్తుంది.నన్ను మారమనదు-తానూ మారదు. మా తాత మాటల మత్తులో పడ్దారంటే మిమ్మల్ని మీరు మరిచిపోతారు.తరువాత మీ ఇష్టం.కరుణ అంటూ కథలలో మిమ్మల్ని నిండా ముంచేస్తాడయ్యా బాబు. అది తెలుసుకునే ఆ శివయ్య జాగ్రత్త పడ్డాడు. మీరేమో, " ఆత్మానావేత్ ద్రష్ట్వ్యః-శ్రోతవ్యో-మంథవ్యో-నిధిధ్యాసతవ్యః" లాగా కదలక-మెదలక కూర్చున్నారు. కాకపోతే ,ఇంకకథలు మొదలుపెడతాడండి బాబు మా తాత.మన త్రాత. అంతలోనే తాతగారిని చూస్తూ,కానీయండి కాలకంఠుని కథాలహరీ ప్రవాహమును .కదిలి రమ్మనండి కిల్బిష రజ నిర్మూలనా ప్రక్షాళమును గావించమనండి. ఫలితముగా, పశ్యతీతి పశుః-కేవలము చూడగలడు కాని చూసినదానిని అర్థముచేసుకోలేడు,సమన్వయ పరచుకోలేడు కాని స్వామికరుణ బంధమును-సంబంధముగా మార్చివేసి, పశువును-పశుపతిని, చేస్తుందని, అబ్బో-అబ్బో ఇలా ఎన్నెన్నో వాడిమాటలు పట్టించుకోకండి .పసివాడు అని, " మనము కన్నుతో చూస్తే కనిపించేదిఒకటి మనసుతో భావిస్తే మురిపించేది మరొకటి" యద్భావం తద్భవతి అనగానే, శంకరయ్య ఆతృతగా నిజంగానే వాళ్ళు అహంకరించారా అని అడిగాడు. కథలు కనికట్టు చేస్తాయి శంకరయ్య. స్వామి సంహరించాడంటే వారిని సంస్కరించాడన్న మాట. భృంగి అను భక్తుని ద్వారా'అర్థనారీశ్వర తత్త్వమును" లోకవిదితముచేసాడు. గజాసురుని లోకపూజ్యునిచేసాడు. మన్మథుని మనోమథనునిగా (మనందరి) అనుగ్రహించాడు. ఇంతకీ ఆ ఆడవేషము వేయించినది అమృతమును ఆనందామృత లహరులుగా మనకు అందించుటకే కదా .సు-మనో-అంటే,సుమనస్కులు కదా. "సుమనో వనేషు -సత్పక్షః-" హృదయాలో విహరించమని కదా అభ్యర్థన అని..... తాతగారు .చెబుతునే ఉన్నాడు.శంకరయ్య వింటూనే ఉన్నాడు. ఒక వైపు వచోలహరి ఉరకలు వేస్తూ శంకరయ్య కిల్బిషరజములను-మన మనో కిల్బిష రజములను ప్రక్షాళనము చేస్తున్నది.మరొక వైపు శ్రవణానంద లహరి ఆలోచనలనే అడ్దుగోడలను కూల్చేస్తూ,అశుతోషుని అనుగ్రహములో మునకలు వేసేందుకు పిల్లకాలువలను తవ్వుతోంది. కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ. 'తన్మై మనః శివ సంకల్పమస్తు వాచే మమశివపంచాక్షరస్తు మనసే మమ శివభావాత్మ మస్తు". పాహిమాం పరమేశ్వరా. (ఏక బిల్వం శివార్పణం)
Thursday, November 23, 2023
KADAA TVAAMPASYAEYAM-11

Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment