Sunday, December 17, 2023

TIRUPAVAI-02




.


 




 తిరుప్పావై-రెండవ పాశురము


 *********************


 "మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం


  విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం


  తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం


  సంతఃపయోధి దుహితః సహజాం విదుస్త్వాం."


పూర్వ పాశుర ప్రస్తావనము


********************




 " తిరు-పావై " అనగా  శ్రీ  వ్రతము. పవిత్రమైననోము.ఇది నిజమునకు విల్లిపుత్తూరులో జరిగినదని పెద్దలు భావిస్తారు.తానొక గోపికయై,విల్లిపుత్తూరును రేపల్లెగా భావిస్తూ,తన చెలులందరినికలుపుకుంటు,యశోద-నందులను-బలరాములను -కృష్ణుని తమ నోముస్థలికి రమ్మని ఆహ్వానించుట,శ్రీకృష్ణునకు పోట్రి(మంగళములు) 

పాడుట,రాసలీలలు చేయుట చివరకు గోదాకళ్యాణముతో ఈ ద్రవిడప్రబంధము సకలజనులను ఆశీర్వదిస్తుంది

.


  రెండవ పాశురములో గోపికలు గోదమ్మతో పాటుగా "కాత్యాయినీ వ్రతమును " చేయ సంకల్పించుకుని,వ్రత నియమములను తెలుసుకుంటుంటారు.

.


  అసలు ఈ వ్రతమును చేయుటకు ముందు రేపల్లెలో వర్షములు లేక క్షామము సంభవించినదట.దానికి ఎందరు ఎన్నివిధములుగా ప్రయత్నించినను పరిష్కారము లభించలేదు.శ్రీమన్నారాయణుని అనుగ్రహముతో రేపల్లె లోని కన్నెపిల్లలు "కాత్యాయినీ వ్రతమును" భక్తితో చేస్తే 


వర్షములుకురిసి,రేపల్లె సుభిక్షమవుతుందని   తెలిసికొనిన రేపల్లె వాసులు,అప్పటివరకు నిషేధించిన తమకన్నె- పిల్లలను వ్రతమునకు అనుమతినిచ్చారు.


 ఇంకొక ముఖ్య విషయము వీరు"కాత్యాయిని"అర్చా మూర్తిని పూజించుతకు సిద్ధమవుతున్నారు.అదియును స్వామి విభవ సంకీర్తనమును చేస్తూ-సామూహికముగా.


 అసలు అర్చా స్వరూపము అంటే ఏమిటి?


 పరమాత్మ తన అవతారములను,


 1.వ్యూహావతారము


 2.అర్చావతారము


 3.లీలావతారము


 4.విభవావతారము గా ప్రకటించుచుంటాడు.


  పరమాత్మ-కాత్యాయిని మాత-శ్రీకృష్ణుడు రెండును అర్చావతారములే.


 సర్వత్ర వసిస్తున్న పరమాత్మ,


 మనలోనే ఉన్నాడని,మనలో జరుగుతున్న కదలికలన్నీ పరమాత్మ చైతన్యములే అని తెలిసికొనలేని.మందాత్ములను ఉద్ధరించుటకు,


మానవుడిగా వచ్చి,మానవులమధ్యన ఉంటూ,మానవాతీత శక్తులను అవసరమయినపుడు మాత్రమే ప్రకటిస్తూ,మిగిలిన వేళలలో మానవ నైజమునే ప్రదర్శిస్తూ ఉంటాడు."అర్చా మూర్తి"



 అందుకే మనము" కృష్ణపరమాత్మ" అని తరచుగా అంటు ఉంటాము.


        రెండవ పాశురము


       ***************


      వైయత్తువాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు


      చ్చెయ్యుం కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్


      పైయత్తు ఇన్ర" పరమన్ అడిపాడి"


      నెయ్యిణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి


      మై ఇట్టు ఎళుదోం మలరిట్టునాం ముడియోం


      శెయ్యాదన్  శెయ్యోం తీక్కురళై శ్శెన్రు ఓదోం


      అయ్యయుం  పిచ్చైయుం ఆందనయుం కైకాట్టి


      ఉయ్యుమారు ఎణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్.


      అమ్మకు,ఆల్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,సంకీర్తనముతో పాటుగా-పాద సంసేవనమును మేళవించిన పాశుర ప్రాశస్త్యమును అర్థము చేసుకునే ప్రయత్నమును చేస్తాను.



     


  గోదమ్మ ఈ విధముగా చెబుతున్నది.


     


     వైయత్తు వాళ్వీర్గాళ్-ప్రపంచములో నున్న జనులారా. 


      కేళీరో-వినడి.

  మనము మోహములతో నిండిన భూమిలో ఉన్నప్పటికిని,ఆనందముగా ఉంటున్నామంటే,



    పార్కడలుళ్-పాల కడలిలో


    పైయెత్తు ఇన్రా-విలాసముగా పడుకొని ఉన్నవాడు. 

     పరమన్-పరమాత్మ

 ,


     నాముం-మనలను రక్షిస్తున్నాడు.,


     నం పావైక్కు-మన నోమును రక్షించేవాడు .




     . అంతేకాదు,


     కిరిశైగళ్ సెయ్యుం-మనలను రక్షించే పనులనే 


    చేయువాడు.


        వాడి,


      "అడిపాడి"-పాదపద్మములను విడువద్దు.

       శ్రీనోములో నియమములుగా ,




     మనము కొన్నింటిని పరిత్యజిద్దాము.మరి కొన్నింటిని 


    పరిగ్రహిద్దాము.


   మొదటగా పరిత్యజించ వలసిన వాటి గురించి,


    ******************************




    1.నెయ్యినోం-నెయ్యిని తినవద్దు.


    2.పాలున్నోం-పాలను స్వీకరించవద్దు


    3.మై ఇట్టు ఎళుదం-అలంకరణలు వద్దు


    4.మలరిట్టు నా ముడియం.-పూలను సిగలో 


      ముడుచుకోవద్దు


     5. శెయ్యాదన్ శెయ్యోం--చేయ కూడని /చెడు పనులను 


        చేయవద్దు.


      6.తీక్కరళై శ్శెన్రుదోం-చెడు మాటలను చెవికి 


        రానీయవద్దు-వాటిని ఇంకొక చెవికి చేర్చవద్దు.


         ఎందుకంటే,


   కళ్ళకు కాటుకవద్దు.స్వామిని చూసేటప్పుడు అది అడ్డము 


   వస్తుంది.


   సిగలో పూవులు తురుముకోవద్దు.అది నాసికను తన 


    సువాసనతోమనలను  అధీనము చేసుకుంటుంది.పూవులు స్వామిని పూజించుటకే కదా.


    చెడు మాటలను వినవద్దు.అవి వినికిడి శక్తిని 


    దుర్వినియోగపరుస్తాయి.స్వామి సంకీర్తనమును వినలేము శ్రద్ధగా.


   చెడు మాటలను ఇంకొక చెవికి చేర్చవద్దు.ఆ పని నీ 


   వాక్కును నిర్వీర్యము చేస్తుంది.అప్పుడు అవి స్వామిసేవకు 


     సంపూర్ణముగా సహకరించలేవు.




        పరిగ్రహించవలసిన పనులు మూడు


         **********************


.అవి 1. కాయకము.2.వాచకము.3.మానసం


 1.కాయకము-శరీరముతో చేయవలసినవి.


 ప్రాతఃస్నానము-చేయిచాచి వితరణగా దాన ధర్మములు 


 చేయుట-కాయకము.


 2 మానసికముతో కూడిన కాయకము.


  దానధర్మములను ,


  అయ్యయుం -భాగవతులకు-


  పిచ్చయుం-పేదలకు-


  ఆందనతుం-యోగులకు వితరణ గా,లోభమును  విడిచి 


   చేయాలి.


 3.వాచకము.


   త్రికరణ నామ సంకీర్తన -వాచకము.


పరమాత్మ చింతనము-ఆంతరంగిక దర్శనము మానసికము


   వీని గురించి,.


     ఎణ్ణె- కొంచము ఆలోచించు.


    ఈ పాశురములో అమ్మ మనకు ఏయే పనులను 


    ఆచరించాలో-ఆచరించకూడదో తెలియచేసినది.


     మన అజ్ఞానము అసలు ఎందుకు చేయాలి? అనే ప్రశ్నను 


     మనలో కలిగించ వచ్చును.ఎందుకంటే మనము 


     తమోగుణ పూరితమైన సంసారములో/జగతిలో 


       నున్నవారలము కనుక.


     అందుకే గోదమ్మ తమోగుణ/చీకటి నిండిన 


   భూమండలమందుండియును, ఆనందముగా నున్న గోపికలారా! అంటు,


    నిశ్చయజ్ఞానముతో మనకూ నారాయణనే" 


   నారాయణుడొక్కడే" శరణము అంటు అనన్యశరణత్వమును 


   ప్రస్తావించినది.


    అన్యధా శరణం నాస్తి-త్వమేవ శరణం మమ"అంటు, 


     అమ్మ చేతిని పట్టుకుని ,అడుగులను కదుపుదాము.


     ఎందుకు అంటే, ఇవి నీకు 


1.,ఉయ్యుమారు-ముక్తిమార్గములు.మరియును 


 2.ఉగందు-సంతోష ప్రదములు.కనుక,


  భగవతుని దయ ప్రసరించిన ఓ భాగ్యశీలులారా-


  వ్రతమును చిత్తశుధ్ధితో చేసుకొనుటకు తరలి రండి.


     ఏలో- -ఓ జనులారా,



   ఎన్-పావో-   శ్రీ   వ్రతమునకు రండి,అని పిలుచుచున్న ఆండాళ్ తల్లి తో,మన అడుగులను కదుపుదాము.. 




     ఆండాళ్  దివ్య తిరువడిగలే శరణం.





.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...