Thursday, January 4, 2024

TIRUPPAAVAI-PASURAM-20

  


   తిరుప్పావై-పాశురం-20

   *********************



   " నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం

     పారార్థం స్వశృతిశతశిరస్సిద్ధమధ్యాపయంతీ

     స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్ కృత్యభుంగ్తే

     గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తుభూయః."


   పూర్వ పాశుర ప్రాభవము

   ******************

 

    అమ్మనీళాదేవిపురుషకార/ఉపకార స్వభావమును ,వారి శయ్యగా అలరారు అర్థపంచకమును,వారి మంచపుకొళ్ళగా నున్నచర్తుర్విధ పురుషార్థములను,కీర్తించి,తనతో పాటుగా మమ్ములను స్వామి,గుణవైభవమనే మడుగులో పంచేంద్రియ పరిశుద్ధతత్లో మునకలు వేయుటకు స్వామిని తోడ్కొని,నోముస్థలికి రమ్మని,ప్రార్థించిన,గోదమ్మ,

 ప్రస్తుత పాశుర ప్రాభవము

 ******************

  స్వామి,

!.ఋజుత్వమును

2.అమ్మ పోషకత్వమును

3.ముప్పదిమూడుకోట్ల అమరులను


 ముప్పదిమూడుకోట్లు-అనగా

 అష్టవసువులు-8

 ఏకాదశ రుద్రులు-11

 ద్వాదశాదిత్యులు-12

 అశ్వనీదేవతలు-2

  ఇక్కడ కోట్ల అను పదము సమూహమునకు సంకేతముగా చెప్పబడినది.వారందరు శ్రీకృష్ణ పరమాత్మ చే సంరక్షింపబడుచున్నారు.

4స్వామి భుజపరాక్రమమును

 అన్నింటికిని మించి

5.పరమాత్మ విమలత్వమును మనకు

 గోదమ్మ పరిచయము చేస్తున్నది.

6.నీలాదేవి స్వరూప-స్వభావములు

 7. మున్శెన్రు-ముందస్తుగానే అనిఒక అన్వయము.

 1.ఇడమున్రు 2.కాలమున్రు అని ముందస్తుగా అనుపదము

 చేతనులున్న ప్రదేశమునందు ముందుగా తానుండి,

 కురుక్షత్ర పాందవ రథ సారధ్యము

 ఇడమ్మున్రు/ శెన్రుగా అన్వయించుకోవచ్చును.

 

 2.ప్రత్యక్షముగా ఎల్లవేళ తాను చేతనుల ముందుగా నుండనప్పటికిని,తన ముందు చూపుతో వారికి రాబోవు కష్టములను గమనించి,వానిని నివారించుకోగల ఉపాయమును ముందే సూచించుట,

 పాందవులకు లాక్షాగృహ దహనము,రావబారము,ఇంకా ఇలా ఎన్నో విధముకుగా వారి/చేతనులమైన మనను రక్షించుట పరమాత్మ వాత్సల్యము.

8..గోపికలి/గోదమ్మ స్వామిని తమకు కావలిసిన  ఉక్కముం-తట్టొళియుం-తందు ఉన్ మణాళనై,

 విసనకర్ర-అద్దము-మరియు -నీ స్వామిని మాకు అనుగ్రహించమని అడుగుతున్న గోపికల చతురతను  మనకు చెబుతున్నది గోదమ్మ.

 స్వామి ఇంద్రుడు-బ్రహ్మ మొదలైన దేవతలు స్వామి దయతో ఎంతో మేలు పొందిన తరువాత కూడా స్వామికి కట్టుబడియుండక ఎన్నో ఇబ్బందులను కలిగించిరి.అయినప్పటికిని స్వామి వారికి శత్రువుల వలన కష్టములు కలుగునని,వారు అడుగక ముందే తాను వారి ముందర నిలబడి,శత్రు భయమును తొలగించు ఋజుస్వభావము కలవాడు.

 స్వామి,

 సెప్పముడయాయ్-సర్వజ్ఞుడు

 తిరల్ ఉడయాయ్-సర్వాత్మకుడు

 విమలాయ్-

 పాపములను హరించు శక్తి అమలము

 పాపములను చేయించు అజ్ఞానమును హరించు శక్తి విమలము.

 అంతే కారనమైన అజ్ఞానము తొలగినచో పాపకర్మములకు తావుండదు.

 సర్వ శుభలక్షణ లక్షిత యైన నీళాదేవి, ఉపాయమైన నీవు మాత్రమే మాకు   స్వామిసేవనమునకై విసనకర్రను-అద్దమును -స్వమిని అనుగ్రహించవమ్మా అని ప్రాథించుచున్న ,

 ఆండాళ్ తల్లికి-ఆళ్వారులకు అనేకానేకదాసోహములను సమర్పించుకుంటూ,పాశురములోనికి ప్రవేశిద్దాము.

 

ఇరువదవ పాశురము.
******************

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్శెన్రు

కప్పం తవిర్కుం కలియే ! తుయిళెరాయ్

శెప్పం ఉడయాయ్ ! తిఱలుడైయాయ్ శేత్తార్కు

వెప్పం కొడుక్కుం విమలా!తుయిళెరాయ్

శెప్పన్మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱుమఱుంగళ్

నప్పినై నంగాయ్ తిరువే తుయివెళాయ్

ఉక్కముం తట్టొళియుం తందు ఉన్ మణాళనై

ఇప్పోదో ఎమ్మై నీరాట్టు ఏలోర్ ఎంబావాయ్.

ఓం అనంతకళ్యాణగుణనిధియే నమః
******************************
కిందటి పాశురములో 'పంచశయనిత్తిల్ అని ఐదు విశేషగుణశోభితమైన -అర్థపంచకమును మనకు పరిచయము చేసింది గోదమ్మ.క్షిప్ర ప్రసాదముగా అవి వారికి లభించినట్లున్నాయి,వారు అక్కడనే వారి గడపముందే నిలబడి ఉన్నారు.అవి ఏమిటంటే,

1.స్వస్వరూపమును తెలిసికొనుట-గోపికలు తమను జీవులుగా గుర్తించారు.అదియే స్వస్వరూప జ్ఞానము.

2. పరస్వరూపము-స్వామిని పరమాత్మగాను ప్రశంసిస్తున్నారు.అదియే పరరూప జ్ఞానము.

3.స్వామిని మేలుకొలిపి అద్దము-విసనకర్రతో-పాటుగా స్వామిని తీసుకుని వెళ్ళి జలకములాడతలిచారు.భగవద్గుణగణములలో మునిగితేలుట.అది.అదియే పురుషార్థ జ్ఞానము.

4. ఎంత వేడుకున్నను స్వామి మేల్కొనుటలేదు.అనుగ్రహించుటలేదని గమనించుటయే విరోధికృత జ్ఞానము.

5.దానిని అధిగమించుటకు వారు నీలమ్మను స్వామిని అద్దము-విసనకర్రతో పాటు అనుగ్రహించమని,అదియును "ఇప్పోదు" ఇప్పుడే
ఇంక మేము విరహవేదనను తాళలేమని విన్నవించుకుంటున్నారు.ఇది ఉపాయ జ్ఞానము.

దర్శనమునకై వేచియున్నవి వారి చక్షువులు.సంకీర్తమునుతో సత్కరించుచున్నవి స్వామిని వారి సంకీర్తనము.క్షణమైనను సేవింపక ఉండలేని పరిస్థితి వారిది.

ఓ స్వామి-ఓ,
తిరలుడయాయ్-సర్వాంతర్యామి,

నీవు మాకు దర్శనభాగ్యమును అనుగ్రహించకపోవుటకు కారణం
అది నీకు సాధ్యముకానిదని కాదు.మమ్ములను నీ సంకీర్తన భాగ్యముతో కాసేను పరవశించే భాగ్యమును అనుగ్రహించావా స్వామి,అలాగే కానీ.అవధరించవయ్యా అని,

కృష్ణా!-కష్టములను తొలగించేవాడ,

మున్సెన్రు-ముందరనే-వారు నిన్ను అర్థించకనే,వారు బాధపడకూడదని,
నీవు వెళ్ళి, వారికి
మున్శెన్రు-ముందర నిలబడతావు-నేనున్నాను,మీకేమి భయములేదని.

వెళ్ళి ఏమిచేస్తావంటే,
వారి,
కప్పం-కంపనము,శత్రుభయముచే వారికి కలిగిన భయముతో కూడిన వణుకును,
తవిర్కుం-పోగొడతావు.పూర్తిగా
అప్పుడా భయము వారి శత్రువును దహించివేస్తుంది.అంతటి ,

శెట్రార్కే-శత్రువులకు
వెప్పముడక్కు- వెరపు/
భయమును కలిగిస్తావు.వారిని నశింపచేస్తావు.

శత్రువులను మట్టుపెట్టే మహాపరాక్రమము నీది కన్నా.!

అట్టినీవు నిదురవీడి,బయటకు రాలేక పోవుటకు కారణము మామీది నిర్లక్ష్యముకాదు.కాసేపు మా సంకీర్తనను వినాలనుకున్నావా స్వామి.

ఇప్పుడు వారు నీలాదేవిని కూడ అర్థముచేసుకున్నారు.అమ్మ మనకు తప్పక స్వామిని మేలుకొనమని చెప్పి దర్శనభాగ్యమును కలిగిస్తుంది.ఆమెను స్తుతించుటయే ఉపాయము అని తల్లిని సంకీర్తిస్తున్నారు.

నప్పిన్నాయ-నంగాయై,
విమలాయై,అమ్మా,నీవు

సెవ్వాయ్-శిరుమరుంగళ్-ఎర్రని పెదవులు-కరుణ వాక్యములు,

సన్నని నడుము కల సాముద్రిక శుభలక్షణములు కల,తిరువే-సౌందర్య/సౌశీల్యవతివి.

నీవు మేలుకొని,స్వామిని మేలుకొలిపి,

స్వామి నోమునకు మాకిస్తానన్న,

ఉక్కముం-తట్టొళియుం-విసనకర్ర-అద్దమును,

(వాటితో పాటు స్వామిని) మాకు,
ఇప్పోదు-ఇప్పుడే,

ఉన్-మణాలునై-నీ నాధునిచే,జగన్నాధునిచే,

స్వామిచే,
తందు-ఇప్పించవమ్మా.

గోపికలు అడిగిన -స్వామి అనుగ్రహిస్తానన్న విసనకర్ర-అద్దము పరమార్థమునందిస్తాయా అనుకుంటే

ఏమిటా విసనకర్ర?

విసనకర్ర .తాను నిశ్చలమైనదైనా చలనముతో అందరికి గాలిని,గాలితో పాటు హాయిని ఇస్తుంది.సుగంధమైన దుర్గంధమైన ఒకటిగానే స్వీకరిస్తుంది.మిత్రులని-శత్రువులని భేదములేకుండా చేయు సహాయతాభావ నిదర్శనమే ఆ విసనకర్ర.శేషత్వ తత్వము-పరతత్వము,తిరుమంత్రము-ద్వయమంత్రము అని కూడా ఈ భావమును గౌరవిస్తారు.

ఏమిటా అద్దము?

తమ తమ స్వస్వరూపమును చూపించకల శక్తి ఆ అద్దముది.

వాటిని స్వీకరించి,నిస్సంగులై ఆ నీలమేఘుని గుణవైభవమను తీర్థములో ఇప్పొదె ఎమ్మె నీరాట్టెలొ
,స్నానముచేసి,నోమునోచుకొనుటకు తహతహలాడుచున్న గోపికలతో పాటునున్న గోదమ్మ చేతిని పట్టుకుని ,మనము మన అడుగులను కదుపుదాము.

ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.





.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...