Sunday, March 31, 2024

ADITYAHRDAYAMU-SLOKAMU-31

 


  ఆదిత్యహృదయము-శ్లోకము-31

  ***********************

 ప్రార్థన

 *******

 "జయతుజయతు సూర్యం సప్తలోకైక దీపం

  హిరణసమిత పాప ద్వేషదుఃఖస్యనాశం

  అరుణకిరణ గమ్యం ఆదిమాదిత్యమూర్తిం

  సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."


 పూర్వరంగము

 ***********

 పరమాత్మ పన్నెండు నెలలు ఋతుచక్రమునకు అనుకూలముగా తనపరివారమును-తానుసైతము మలచుకుని,ద్వాదశాదిత్యులుగా దర్శనమిస్తున్నాడో,ఏ విధముగా సకలజగములను సకలగ్రహములను సంరక్షించుచున్నాడో,ఏ విధముగా సర్వపాపములను నశింపచేయుచున్నాడో వివరించిన అగస్త్యభగవానుడు,చివరి శ్లోకములో ,

 మహేంద్రః ధనదః కాల యమ గా అలరారుతున్న పరమాత్మ సూర్యభగవానునిగా ప్రకటితమగుచు,రావణాసురునికి అంత్యకాలము సమీపించినదని తెలిపి,రాముని రణోన్ముఖుని చేస్తూ,ఆశీర్వదించి తరలినాడట.

 శ్లోకము

 ******

 "అథ రవిరవదన్నిరీక్ష రామం

  ముదిత మనాః పరమం ప్రహృష్యమాణః

 నిశిచరపతి సంక్షయం విదిత్వా

 సురగణ మధ్య గతో వచస్వరేతః"

   ఇతి శ్రీమద్రామాయణే యుద్ధ్ధకాండే

   ఆదిత్యహృదయ స్తోత్రం సంపూర్ణం."

  ఎంతటి చమత్కారి ఈ అగస్త్యభగవానుడు.రాముడు సూర్యుని ప్రార్థించగానే పరిస్థితిని గ్రహించి,రామునకు జయము-రావణునకు క్షయము కలుగు సమీపమును గ్రహించి,ఆనంద మనస్కుడై రాముని దీవించి,

 సంతుష్టుడై తరలినాడట.

 ఆదిత్యహృదయస్తోత్రము రామునకు ఉపదేశిస్తున్నట్లుగా భావింపచేస్తు ఎంతటిచమత్కారమును చేసినాడో అగస్త్యభగవానుడు.
 మన చేత అటుచూడండి,రాముడు యుధ్ధభూమిలో చింతాశోకముతో నిండియున్నాడు.ఎదురుగా వచ్చిన రావణునిచూశాడు.రామ రామమహాబాహో అంటూ మాటి మాటికి రామనామస్మరనమును మనచే చేయించాడు.
 నిశితముగా పరిశీలిస్తే నామికి-నామమునకు భేదములేదని అర్థమవుతుంది.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...