ఉగాది శుభాకాంక్షలు.
*****************
కామ-క్రోధ-లోభ-మోహ-మదమాత్సర్యాలలో
క్రోధిని నేనేనంటూ,అరవై వత్సరముల తరువాత,
అరుదెంచుచున్నావా "ఆత్మీయ స్వాగతము."
ప్రకట క్రోధమెప్పుడును పరమాత్మ అనుగ్రహమే
స్థితప్రజ్ఞతనందించే పరిణామపు అనుభవమే
అసలు,
అతిమెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల
సమయము పట్టుతుంది శనికి చుట్టడానికి
పన్నెండు రాశుల చక్రాన్ని.
మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల
సమయము పట్టుతుంది గురువు చుట్టడానికి
పన్నెండు రాశుల చక్రాన్ని
30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజమే 60
అందుకే తెలుగు సంవత్సరాలు అరవై.
ఓరుపు నేర్పిస్తాయి నేరుపుగ ఈ గ్రహములు,
, అరవై సంవత్సరములు,
జాబిలి కూతురులో లేదా నారద కుమారులో
వాటిపేర్లు ప్రభవ నుండి అక్షయ అని
వరాహమిహిరుడు అన్నాడు భృగుసంహితలో
వారించబడక కొనసాగుతున్నాయి కాల గతిలో
గురువు-శని తమ గమనములో ప్రతికూలమో/అనుకూలమో
కదులుతూనే ఉన్నారుగా.
గుణ-దోష భూఇష్ఠముల వాటిగమన పరిణామములే
ప్రతి ఒక్కరి ముందునున్న పంచాంగ ప్రమాణాలు.
ఏది ఆదాయమో/ ఏది రాజ పూజ్యమో
వ్యయము వ్యవహారమేమో/ అసలేది అవమానమో
అతిగా ఆలోచించారా( గురువు-శని)
సమయమెక్కువవుతుందని సగములో ఆపరు కదా
సతమతమగు నడక యని సహనము కోల్పోవరు కదా
నిజమే
ఆరు శత్రువుల కట్టడియే ఆరు రుచుల పచ్చడి
క్రోధమేమి చేయగలదు సహనమే సహాయమైన వేళ,
నేరిమి-కూరిమి-ఓరిమి కంచుకోట యైన వేళ
శుభకామానలందిస్తూ, అభయము తానౌతుంది.
No comments:
Post a Comment