చేతనులు ప్రపంచముతో అనుబంధమునేర్పరచుకుంటే మోహము.పరమేశ్వరితో అనుబంధమేర్పరచుకుంటే మోక్షము.కనుకనే,
"మనసేవ మనుష్యాణాం కారణం బంధ-మోక్షకం" అన్నారు పెద్దలు.
శ్రీదేవి ఖడ్గమాలలో తొమ్మిది ఆవరనలు ఉన్నాయి.
అంచలంచలు లేనిమోక్షము చాలా కష్టము కనుక సాధకుడు అణిమ శక్తితో తన పయనమును ప్రారంభించి బిందువునకు చేరవలసి ఉంటుంది.
ఇది స్థూలము నుండి సూక్ష్మ దిశగా పయనము.
కారణము,
బిందువు త్రికోణముగా తన విస్తరణను ప్రారంభించి త్రైలోక్య మోహన చక్రము వరకు విస్తరించి హద్దులను ఏఋపరచినది.
తొమ్మిది విభాగములు ఒక్కొక్కచక్రేశ్వరి కొంతమంది యోగినులతో/సహాయక శక్తులతో నిండియుంటుంది.
ఆనిర్ణీత చక్ర ప్రాంతమునకు అధికారిణి పరిపాలిని చక్రేశ్వరి.ఆమెను స్వామిని అనికూడా అంటారు.పరమేశ్వరి అంశయే స్వామిని.భగవతి.
భగవతి/స్వామిని అధీనములో మరికొన్ని శక్తులు సాధకుని స్వామిని దగ్గరకు చేర్చుటకు సిద్ధముచేసి సహాయపడుతుంటాయి.
మనకు అర్థమయ్యే విధముగా చెప్పుకోవాలంటే స్వామిని దగ్గరకు /భగవంతుని దగ్గరకు చేర్చగల "గురువులు" ఈ యోగినులు.
అహం బ్రహ్మాస్మి అన్న విషయము అర్థముకావాలంటే జగమ్మిథ్య అన్నవిషయమును గ్రహించగలగాలి.
గు కారో అంధకారస్య రు కారో తన్నివారనం.
యోగినులు గురువులై చక్ర ఆవరనమును చైతన్యపరుస్తూ చక్రేశ్వరిని సైతము మూర్తీభవించిన చైతన్యముగా ప్రకాశింపచేస్తాయి.
1. మొదటి ఆవరనములోని గురువులు ప్రకట యోగినులు.చక్రేశ్వరి త్రైలోక్య మోహన.
పేరులోనే ఉంది ఈ ఆవరనము స్థూలమునకు-ద్వంద్వములకు సంబంధించినది.సాధకుడు ఎటువంటి ప్రలోభములకు నవరసములకు,అరిషడ్వర్గములకు,మానవ వికారములకు బానిస కాని నాడే రెండవ చక్రములోనికి ప్రవేశించగలడు.
2. రెండవ ఆవరనము సర్వ ఆశా పరిపూరకము.జ్ఞాన సంకేతము.పద్మపురేకుల వికసనము సంకేతము.ఇక్కడి గురువులు మానసికస్థితిని తెలియచేస్తూ గుప్త విద్యతో ప్రకాశిస్తుంటారు.చక్రేశ్వరి సర్వాశా పరిపూరక.ఆవిడ అనుమతితోనే సాధకుడు మూడవ ఆవరణములోనికి ప్రవేశించగలడు.
3.మూడవ ఆవరణమును సర్వ సంక్షోభణ చక్రము అంటారు.
సంక్షోభణము అనగా స్పందన.ఈచక్రములోని యోగినులు/గురువులు సాధకుని మనసులో ద్వంద్వ ప్రకృతి గురించి ఆలోచించేటట్లు చేస్తారు.వారి అనుగ్రహముతోనే సాధకుడు చక్రేశ్వరికి నమస్కరించి నాల్గవ ఆవరనము లోనికి ప్రవేశించగలుతాడు.సర్వ ద్వంద్వక్షయంకరీ నమో నమః
4.ఇప్పటివరకు మనము మూడు ఊహా చరస్రాకార రేఖలు,16 పద్మదళములు,ఎనిమిది పద్మదలములున్న మూడు ప్రాకారములను దాటి,
14 త్రికోణములున్న నాల్గవ ఆవరణములోనికి ప్రవేశిస్తున్నాము.ఇక్కడ నాడీమండలము/ప్రాణసక్తి యైన కుండలిని ఏ విధముగా పనిచేస్తుందో సాధకుడు గురువులైన యోగినుల ద్వారా తెలుసుకుని,తన శరీరమును అనుగుణముగా సంసిద్ధము చేసుకుని చక్రేశ్వరి అనుగ్రహముతో ఐదవ ఆవరనములోనికి ప్రవేశిస్తాడు.
5.ఐదవ ఆవరణములో బయటవైపునకు పది త్రికోణములు పది వాయువులను సూచిస్తూ ఉంటాయి.
ఐదు ప్రధాన వాయువులు.మరొక ఐదు ఉపవాయువులు.మన శరీరము తన విధులను సవ్యముగా చేసుకోవాలంటే అనగా
గాలి పీల్చటము,కనురెప్పవేయగలగటము,ఆవులింత,విసర్జనము మొదలగు పనులకు చైతన్యస్వరూపమైన పది శక్తులే ఆధారము.
6.సాధకుడు ఆరవ ఆవరనము యైన సర్వరక్షాకర చక్రములోని ప్రవేశించి అక్కడనున్న పదిమంది యోగినుల ద్వార అగ్నితత్త్వమును తద్వారా తనలో జరుగుతున్న జీర్ణవ్యవస్థను తెలుసుకోగలుతాడు.
7 ఏడవ ఆవరనము సర్వరోగహరము.ఇక్కడి శక్తులు ఎనిమిది కోణముల రూపములో సంకేతించబడినారు.వీరినే,
శీతోష్ణములుగను,సుఖదుఃఖములుగను,త్రిగుణములుగను ఇచ్ఛ గను భావిస్తారు.
8.ఇప్పుడు సాధకుడు తన శరీరములోని పాపిట స్థానమును యోగినుల,చక్రేశ్వరి అనుగ్రహముతో చేరుకున్నాడు.ఈ ఎనిమిదవ ఆవరనమును సర్వ సిద్ధిప్రద చక్రము అంటారు.ఇక్కడ పంచతన్మాత్రలు,మనసు,రాగద్వేషములు ఎనిమిది త్రికోణములుగా సంకేతించబడినవి.ఇక్కడి గురువులైన యోగినులు అతిరహస్యమైన అమ్మ తత్త్వమును సాధకునికి అనుభవములోని తెస్తూ,తొమ్మిదవ ప్రాకారమైన ,
9.బిందు స్వరూపమైన,ఏకాత్మకమైన,అవ్యక్త మహత్తును పరిచయము చేస్తారు.
ఇంతకంటే కావలిసినది ఏముంది? అక్కడికిచేరాలంటే మనము భవబంధములనే మూటలను విడిచివేయగలగాలి.అరిషడ్వరగములను అల్లంతదూరములో ఉంచాలి.యోగినుల అనుగ్రహమునకు పాత్రులమై,చక్రేశ్వరి,మహా భట్టారికా పాదములను విడువకుండా పట్తుకోగలగాలి.
శ్రీ మాత్రే నమః.
No comments:
Post a Comment