" హ్రీంకారస్తు మహామాయా భువనాని చతుర్దశా
పాలయంతు ఫలా తస్మాత్ చక్రకోణంప్రవేశ్మితే"
పదునాలుగు చక్రకోణములుగా ప్రకటింపబడుతూ,పదునాలుగు భువన భాందములను పరిపాలిస్తున్న పరమేశ్వరికి ప్రణామములు.
పరాత్వరి అనుగ్రహముతో మనము ,
1.త్రైలోక్య మోహన చక్రము
2.సర్వాశా పరిపూరక చక్రము
3.సర్వ సంక్షోభణ చక్రము నందు అధిష్ఠించి,అనుగ్రహిస్తున్న
1.ప్రకటయోగినిలు
2.గుప్త యోగినులు
3.గుప్త తర యోగినుల సహాయముతో
నాల్గవ చక్రమైన
4.చతుర్దశారము/పదునాలుగు త్రికోణములున్న చక్రము లోనికి ప్రవేశిస్తున్నాము.
మూడు ఆవరనములో నున్నప్పుడు సాధకుడు,
నేను వేరు-పరాత్పరి వేరు అన్న ద్వంద్వ భావములుకలవాడై,
అమ్మను ప్రార్థిస్తే సంతసించి,నా ఎదుట ప్రత్యక్షమై నన్ను అనుగ్రహిస్తుంది అన్న వస్తు భావన మిళితమైన వాస్తవములో ఉంటాడు.
ఆ భావనకు అనుగుణముగానే మొదటి చక్రమైన భూపురము చతురస్రాకార (ఊహా)మూడు రేఖలు,పదహారుదళముల పద్మము,అష్టదళ పద్మము సాధనా ప్రారంభమునకు వీలుగా,అత్మ తత్త్వ విచారణకు అనుగుణముగా వికసిస్తున్న జ్ఞాన రేకులతో సాధకుని బిందువు చేరుటకు అనుగుణముగా సిద్ధముచేస్తున్నది ఆ
"అంతర్ముఖ సమారాధ్యా-బహిర్ముఖ సుదుర్లభా"
సూక్ష్మ తత్త్వ గమన సంకేతమే త్రికోణముగా నాల్గవ ఆవరణము మనలోని చేతనాశక్తిని పరిచయము చేస్తుంది.
హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతర దీపికా" అనికీర్తిస్తున్నది లలితా సహస్ర రహస్య నామములో.
అనాహత చక్రములో ప్రభాపూరితమై,శబ్ద బ్రహ్మాత్మికమైన చిత్శక్తి,
సంప్రదాయ యోగినులు అను శక్తుల రూపముగా,పదునాలుగు ముఖ్య నాడులుగా విరాజిల్లుతూ ఉపాధిని/చేతనునిశక్తి వంతముచేస్తున్నది.
మరొకవిషయము సాధకుడు ఈ ఆవరనములోనే,
స్వయంభూలింగమును చుట్టుకుని యున్న కుండలినీ శక్తితో కూడిన "సుషుమ్నా" నాడి గురించి తెలుసుకుంటాడు.
మరొక భావనను తెలుసుకోవాలంటే,
1.మనసు
2.బుద్ధి
3.చిత్తము
4.అహంకారములతో కూడిన
10 ఇంద్రియ సమ్మేళనమే
చతుర్దశారచక్రము.
ఈ ఆవరనములోని యోగినులు
1.సర్వ సంక్షోభిణి
2.సర్వ విద్రావిణి
3.సర్వాకర్షిణి
4.సర్వ ఆహ్లాదిని
5.సర్వ సమ్మోహిని
6.సర్వ స్తమ్ణిని
7.సర్వజృంభిణి
8.సర్వ వశంకరి
9.సర్వ రంజని
10. సర్వ ఉన్మాదిని
11.సర్వార్థ సాధిని
12.సర్వ సంపత్తి పూర్ణి
13.సర్వ మంత్రమయి
14.సర్వ ద్వంద్వ క్షయంకరీ.
పరమేశ్వరి,
మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి,దీని నీవార సూక పరిమానములో ప్రాణశక్తిగా ప్రకాశ్మొదలగు స్తున్నది తల్లి అని కీర్తిస్తున్నది "మంత్ర పుష్పము"
సుషుమ్నా నాడి ప్రాణ వాయువు.ఈ నాడి "సర్వ ద్వంద్వ క్షయంకరీ."సంపత్తిపూరిణి అను ఇడా నాడిని,సర్వ మంత్ర మయీదేవి అను "పింగళ" నాదిని కలిగియుంటుంది.నిరంతర రక్త ప్రసరనమును(శుద్ధిచేస్తూ) జరుపుతుంటుంది.
ఈ నాడీ మండలము మనలను ,మన మెదడును,మనైంద్రియములను నిరతరముచైతన్య వంతముచేస్తున్నదన్న విషయమును సాధకుడు గ్రహించగలుట ప్రారంభిస్తాడు.మనలోని వాక్కు పయనము,ఇంద్రియ నిబద్ధత గ్రహించటం ప్రారంభము అవుతున్నట్లుగా,కాలప్రవాహము,చైతన్య ప్రావహము తో పాటుగా జ్ఞాన ప్రవాహమును గుర్తించటమ్మొదలుపెడతాడు.
అంటే తాను అనుకునే దేహము తాను కాదని,దానిలో దాగి చైతన్యమును కలిగించుచున్న ఆత్మయే తాను అని గ్రహించుట ప్రారంభం అవుతుంది.
ఆ అభేద జ్ఞానమె సౌభాగ్యము.అదియే సర్వము నిండియున్నదని తెలిసికొనుటయే సర్వ సౌభాగ్య దాయకము.
అంటే పరమేశ్వరి సాధకుని "జడ స్థి నుండి-చైతన్యస్థికి" మారుస్తుంది.
తనలోని కదలికలు శ్వాస తీసుకొనుట,జీర్ణ వ్యవస్థ మొదలగునవి కేవలము ఉపాధికి మాత్రమే కాని ఆత్మ కు కావు అన్న సత్యము అనుభవము లోనికి వస్తుంటుంది.
సంప్రదాయ యోగినుల సహకారముతో చక్రేశ్వరి త్రిపురవాసిని ఆశీర్వాదముతో సాధకుడు ఐదవ ఆవరనము అయిన "బహిర్దశార చక్ర" ప్రవేశమునకు అర్హుడై,సన్నద్ధుడవుతున్నాడు.
" యాదేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.
No comments:
Post a Comment