" అంబ పరమేశ్వరి -అఖిలాండేశ్వరి
ఆదిపరాశక్తి పాలయమాం
త్రిభువనేశ్వరి రాజరాజేశ్వరి
ఆనందరూపిణి పాలయమాం"
అమ్మావ్యాజ అనుగ్రహము ఎన్నోజన్మల పుణ్యఫలముగా మారి ఆ తొమ్మిదంస్తులభవనమును ఎక్కాలనే కోరికను కలిగిస్తున్నది.పదములను/పాదములను అటువైపుగా నడిపిస్తున్నది.
ప్రవేశ ప్రాకారము మూడు రంగులగోడలతో చతురస్రాకారముగా నున్నది.నాలుగు వేదములు నాలుగు ప్రవేశ ద్వారములై స్వాగతిస్తున్నాయి.మొదటిగోడ నల్లని రంగులోఉన్నది.ఇక్కడ స్థూల దేహమునకు ప్రవేశము/ప్రాధాన్యము ఉంYఉంది.మనము మెలకువ ఉండే జాగ్రదావస్థ స్థిలో ఈ ఆవరనము ఉంటుంది.ఇక్కడ సిద్ధి మాతా స్వరూపములు సహాయ పడుతుంటారు.వారు చిన్నపరిణామముగా మారుట,పెద్ద పరిణామముగా మారుట,కోరికలు తీర్చుకోగలుగుట,కోరిన రూపమును పొందగలుగుట,వశపరచుకొనగలుగుట,పాలించగలుగుట మొదలగు శక్తులతో సహాయపడుతుంటారు.కాని అవన్నీ శాశ్వతము కాదు.తాత్కాలికమే.ఏదో ఒక ఐహిక ప్రయోజనమునకు ప్రదర్శించుకోవలిసినవే.
అమ్మభువనేశ్వరి.మూడు భువనములకు మహారాణి.కనుకనే తనవిస్తరనకు హద్దులు "త్రైలోక్య మోహనముగా" భూపురముతో నిర్ణయించినది.
వీనినే శాస్త్రములో,
భుః-భువః-సువః అనిపిలుస్తారు.నాదమైన గాయత్రీ మాత.
1ప్రాపంచికానుభూతి యే -భుః
2.ఆ సమయములో వచ్చే అడ్దంకులు-భువః
3.దానిని పరిష్కరించుకొను శక్తి-సువః అని పెద్దలు చెబుతారు.
నల్లనిగీత తమోగుణముతో/చీకటితోనిండియుంటాయి.బుద్ధిని పనిచేయని ఇంద్రియములు మనసును ప్రభావితముచేస్తుంటాయి.
మన మానసిక స్థితిమూడు విధములుగా మార్పు చెందుతుంటుంది.
1 జాగ్రదావస్థ-మెలకువగా ఉండంతము.
ఆ మెలకువ జనించిన కోరిక అమ్మ నుండి వరములను పొందుటకై,స్థూల శరీరముతో మనసు తపన పడుతుంటుంది.కాని ఆ కోరికలు నిజమునకు అంతౌపయోగ కరములు కావు.వాటిని తీర్చేందుకు సిద్ధి శక్తులు తాము బయటకు వచ్చి,ఉపాధిని ధరించి అనుగ్రహిస్తుంటాయి.వర ప్రభావమును దానిని సరిగా ఉపయోగించుకోలేని ఎడల వచ్చే చెడు పరిణామములను హెచ్చరిస్తుంటాయి.మన ఇతిహాసములలో సుపరిచితమే.
కాని ఆ సిద్ధులు తాత్కాలికమే.శాశ్వత సంతోషమును ఈయలేవు.ఈవిషయము తెలిసికొనిన వారిని ప్రకట యోగినులు తమ నాయిక ఆశీర్వాదము పొందిన తరువాత రెండవ ఎర్రని గీతకల ఆవరనములోని చేరుస్తాయి.
రజోగుణ సంకేతమే ఆ ఎర్రదనము.మానవుని స్వప్నావస్థ.స్థూలదేహము అలిసి స్వల్పకాలప్రలయమైన నిద్రకు ఉపక్రమిస్తుంది.
మనసు సూక్ష్మదేహముతో కలిసి స్వప్నములో ఎంతో వింతవింత అనుభవములను పొందుతుంటూంది.అంతలో తెల్లవారుతుంది.స్వప్నము జారిపోతుంది.అంటే ఇదీ తాత్కాలికమే శాశ్వతము కాదని తెలుసుకుంటాడు ప్రయాణికుడు.ఆ శక్తుల సహాయముతో వారి నాయిక ఆశీర్వాదము తీసుకుని మూడవదైన తెల్లని గోడ ఉన్న ఆవరనము లోనికి ప్రవేశిస్తాడు.ఇక్క సుషుప్తి దశలో ఉంటాడు.స్థూల సరీరము-సూక్ష్మ శరీరము వదిలి కారణ శరీర ప్రవేశము చేస్తాడు.తన పూర్వజన్మల పాప-పుణ్యములు నిక్షిప్తమై,వాటిని అనుగ్రహించుతకు ఏ ఉపాధిని తాను పొందవలెనో కొంచం కొంచం అర్థమవుతుంటుంది.అలా అర్థము చేసే మాతృమూర్తులే ముద్రాశక్తులు.అట్టి స్థితిలో నున్న ప్రయాణికుడు తాను ఎక్కవలసినది తొమ్మిదవ అంతస్థుకదా.ఇది మొదటి ప్రాకార మూడవ భాగము.కనుక నేను వీరిని ప్రార్థించి,నాకు అడ్డమైన విషయములను/భావనలను తొలగించుకొనుచు అర్హత పొందుటకు ఈ సక్తులు తలా ఒకటి ఒక్కొకావరనములోఉంటూ మార్గమునుసుగమము చేస్తాయి.
కొత్త కొత్తవిషయములను తెలుసుకుంటూ ప్రయాణికుడు రెండవ అంతస్తును ఎక్కుటకు సిద్ధమగుచున్నాడు.
యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.
No comments:
Post a Comment