Tuesday, June 18, 2024

NAALGAVA MAJILEE-SARVA SAUBHAAGYADAAUAKA CHAKRAMU AMTE?


 


  " భక్తుడు భగవంతుడా నువ్వెప్పుడు బయటకు వస్తావు నేను నిన్ను చూడటానికి అని అనుకుంటాడట,

   భగవంతుడు భక్తుడెప్పుడు తనలోనికి తొంగి చూస్తాడా కనపడదామని అనుకుంటాడట." 

   ఎంతటి నగ్నసత్యము.

 ఏకాకిని "భూమరూపా" నిర్ద్వైతా ద్వైతవర్జితా అని పరమేశ్వరిని కీర్తిస్తుంది స్రీ లలితా రహస్య సహస్రనామస్తోత్రము.

 అన్నిరూపములుఇందే ఆవహించెను అని కీర్తించాడు అన్నమాచార్యులు.

 

 అంతర్యామిగా అన్ని ఉపాధులు తానైన పరమాత్మ ఏదో ఒక ఉపాధితో మనకు మనలను తెలుసుకోవటానికి చేతిని అందిస్తూనేఉంటాడు.

 ఆ చేతిని నమ్మకముతో గట్టిగా పట్టుకుని,విడువకుండా మరొక మెట్టును ఎక్కించేది/ఆవరనములోనికి ప్రవేశింపచేసేది "సౌభాగ్యము" .

 ప్రయాణికుడు అమ్మదయతో పదునాలుగుకోనములు కల వృత్తాకార చక్రము లోనికి ప్రవేశిస్తున్నాడు.దీనినేచతుర్దశార చక్రము అని కూడా పిలుస్తారు.

 మూడు అవస్థలను దాటి,మూడు దేహములను అర్థముచేసుకుంటూ,స్పూక్ష్మము వైపునకు అడుగులు వేయిస్తున్నాయి ఈ పదునాలుగు కోణములు.చురుకుదనమును మెదడుకు అందిస్తూ.

 పదునాలుగురు మాతలు ఈ ఆవరణములో ప్రకాశముతో వెలిగిపోతున్నారు.జడత్వమునకు తావులేదు.తమోగుణము కానరాదు.

  ఇంద్రియములు/మనసుకొంచముకొంచము శుద్ధి అవుతున్నాయి.

 సిద్ధి మాత అయినఈశిత్వసిద్ధి ప్రయాణికునిలో ఈశ్వర భావనకుబీజము వేస్తున్నది.తానుకోరుకోవలిసినవి తాత్కాలిక సంతోషమును కలిగించునవి కాదని అర్థమవుతున్నదతనికి.

  తనలో దాగిన ప్రాణసక్తియే తన కదలికలుమూలమనే విషయము స్పురణకు వస్తున్నది.

  తన ఉపాధియే తాను అన్న భావన జరిగిపోయి తనౌపాధిలో దాగిన చైతన్యము తానుగా కొంచము కొంచము అర్థమవుతున్నది.

  కాని ద్వంద్వములు పూర్తిగా తొలగిపోలేదు.దానికి కారణము తాను చూడాలనుకున్న ఆత్మస్వరూపము మాయచే ఆవరింపబడి యున్నది.

 పదునాలుగురు మాతలు పదునాలుగు భువనములుగా గోచర్సితున్నారు ఒక్కసారి.

 మరింత తేరిపారచూస్తే పదునాలుగు ముఖ్యనాడులుగా (తన ఉపాధిలో) తన ప్రాణశక్తిగా బోధపడుతున్నారు.

   వారు సమ్యక్ ప్రదాతలు.సంప్రదాయ యోగినులు.మనము ముందర చెప్పుకున్నట్లు సాక్షాత్తుగా పరమేశ్వరుడే పదునాలుగు స్త్రెమూర్తులుగా సాధకునికి మాయను తొలగింపచేయుటకు గురువులైనారేమో అనిపిస్తున్నది.

 పదునాలుగు ముఖ్యనాడులు కల ఉపాధి పదునాలుగు లోకములలోనే ఈశ్వరుడున్నాడని,వెతికి దర్శించుకోవాలనే తపనతో ఉంటుంది.

 త్రిపురములు ఏకీకృతమైన వేళ కలిగినమార్పు అందించిన వివేకము క్లేశములను చేదించగలననే విశ్వాసమును కలిగిస్తున్నది.

  తనలోని ఊపిరి-ఆహారము-శక్తి-రక్తము-మాంసము అన్ని భగవత్స్వరూపములే అన్న భావనకలుగుతుంది.

 దేశేంద్రియములు మనసు బుద్ధి చిత్తము  అహంకారముతో కలిసి పదునాలుగు కోణముల గుర్తుతో సత్యప్రకాశ దర్శన బీజమును నాటి మార్గమును చూపించుచున్నారు.

  అందుకేనేమో బ్రహ్మసూత్రములప్రకారముభగవత్సాంగత్యమునకు పదునాలుగు మార్గములు కలవని అన్నది.

  భూమాధికరనము-పరమాత్మ సర్వవ్యాపకత్వమును అర్థముచేసుకోవాలంటే,

 పరమాత్మను,

 ఆకాశముగా,వాయువుగా,జ్యోయిగా,వైశ్వానరునిగా.సూర్యునిగా,ఏదో 

ఒక మార్గమును విడువకుండా పట్టుకుని సాధనతో సత్తును అర్థముచేసుకొనవచ్చును.

  మనసు మంచిచెడులవిచక్షన్ణను చేయలేదు.అదికేవలము సాక్షి.కేవలము బుద్ధిమాత్రమే ఆ ప్రావీణ్యతను కలిగియున్నది

  భవబంధముక్లకు దూరమైతే కాని భగవంతునికి దగ్గరకాలేము.

 తత్-త్వం-అసి ఆ పదార్థమే నీవుగా ఉన్నావు అని తెలిసికొనుటకు,

 మాయావిశిష్ట బ్రహ్మము మోచకరూపక బ్రహ్మ స్వరూపముగా మారుటకు ఇంకాచేయవలసిన ప్రయాణము ఉన్నది.

 సర్వేశ్వర భావనమైన  సర్వవశంకరీ ముద్రాశక్తి సహాయముతో ఈశ్వర విచారణమును ప్రారంభించిన సాధకుడు తనైంద్రియములను,మనోబుద్ధ్యహంకారములను వశముచేసుకోగలుగుతున్నాడు.ఒకవేళ ఏవైనా త్రిగుణ/త్రిపుర సమస్యలు ఎదిరైననుచక్రేశ్వరి వాసిని(గొడ్డలి/ఖడ్గముతో)వాతిణి ఖండించివేసి ఆశ్ర్ర్వదిస్తున్న సమయమున,మరొకమెట్టు ఎక్కడానికి,సర్వార్థసాధకచక్రములోనికి ప్రవేశించుటకు సిద్ధపడుచున్నాడు.

  యాదేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థితా

  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః. 

   .


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...