Monday, July 1, 2024

ANIMIDAVA AVARANAM-SARVASIDDHIPRADAMAMTE?


 


  "మహామహాజ్ఞప్తే-మహామహాగుప్తే

   మహామహానందే-మహామహాస్కందే"

      శ్రీచక్రధారిణి నమస్తే.

 "మ"కారము/మూలాధారము నుండి ప్రయాణమైన నా కుండలిని ప్రయాణము సహస్రార/ఆకాశ తత్త్వమును చేరుతున్నట్లున్నదేమో,

'మహా-మహా" అంటూ నాదము నన్ను ఆవరణములోనికి నడిపిస్తున్నది.

 

   మహాద్భుతము.

 పరమేశ్వరి నాదమయయై ప్రణవముగా నినదిస్తున్నది.

 మహేశ్వరి మంకెన పూవులా మెరిసిపోతున్నది

  

 


 "సర్వసిద్ధిప్రద చక్రము" అని వ్రాసియున్నది.

  నాపాపిటలో కదలికలు ప్రారంభమగుచున్నాయి.మహావాక్యములు వ్యతిరేకార్థములు అని ఇన్నాళ్ళు అనుకున్న నా అభిప్రాయము మారిపోతున్నది.

  నీవు పరమాత్మవు అనిన నేను ఇప్పుడు నేను పరమాత్మను అని అనాలనుకుంటున్నాను.నీవు-నేను ఒకటేనన్న సత్యమును బిగ్గరాగా అరచి,అందరికి వినపడేలాచెప్పాలనిపిస్తున్నది.


  ఆశ్చర్యముగా నాఇంద్రియములుసైతము తమప్రవృత్తిని మార్చుకుంటున్నాయి.

 నా కన్నులు ఆవరణ ప్రకాశమునుచూడగలుగుతున్నాయి.

 నాచెవులు ఓంకారమును వినగలుగుతున్నాయి.

 నాముక్కు సుగంధపరిమళమును ఆఘ్రాణింపగలుగుతున్నది.

 నా నాలుక మధురమకరందమును ఆస్వాదించగలుగుతున్నది.

 నాచర్మము ఆవరణ స్పర్శను అనుభవించగలుతున్నది.

  

 ఇప్పుడు నాలో ఏ వికారములేవు.కిందకు దిగి వెళ్ళాలనీనిపించటంలేదు.దేనినిచూసినా పరమాత్మే.ఎక్కడచూసినా పరమానందమే.పరమేశ్వరి విభూతియే.

 తెప్పరిల్లిన నాఎదురుగా నలుగు మాతృమూర్తులు ఎనలేని ప్రేమతో నిలబడియున్నారు.

 ఇంతకీ నేను ఈ ఆవరణము ఏ ఆకారములోఉందోచెప్పలేదుకదా.

  మూడు బిందువులను కలుపుతూ ఒకత్రికోణము ఉంది.ఈత్రికోణము స్వతంత్రముగాఉంది.ఏఇతరత్రికోణములతో కలిసిలేదు.ఆ త్రికోణమునకు కాపలాగా ఒకచతురస్రము ఉంది.దానినాలుగు వైపుల ఆయుధధారులై నలుగు అమ్మలూన్నారు.వారిని బాణిని-చాపిని-పాశిని-అంకుశినీ పిలుస్తారట.


   

  

 


  నా కుడుచేయి ఎందుకో బరువుగా తోచింది.చూస్తే ఐదు బాణములు నాచేతిలోఉన్నాయి."పంచతన్మాత్రలు"అని వాటిపై వ్రాసియున్నది.అయోమయముగాచూస్తుంటే "బాణినీమాత నేనే నీ చేతిలో బాణములను పెట్టాను.ఈ తల్లి విల్లును నీ కుడి చేతిలో ఉంచింది అంది చాపిని మాతన్ చూపిస్తూ.

 విల్లా అంటూకిందకు చూడగానే ఆశ్చర్యము.నా మనస్సు స్థిరమైన విల్లుగా మారిపోయింది.

  నాలోని ఈ మార్పునకు కారనము ఈ విల్లు-అమ్ములా అని తలుస్తుంటే అవును అందుకే నీవు ఇక్కడ జరుగుతున్నవి నీ ఇంద్రియముల ద్వారా పొందగలుగుతున్నావు అన్నరు.

 నాకళ్లలో నుండి ఆనందాశ్రువుల అభిషేకము వారిపాదములకు జరుగుతున్నది.

 లాలనగా మూడవ మాత అయిన పాశిని నన్ను హత్తుకుంటూ తన ప్రేమ అనే తాడుతో చుట్టివేస్తున్నది.

  అమ్మఒడిలో మైమరచిపోతున్న నన్ను క్షణకాలము కిందకు వేలాడుతున్న దారము-దాని కొస ఆకర్షించింది.పట్టుకోబోయాను.

  వెంటనే "అంకుశిని" మాత దారమును పూర్తిగా తెంచివేసినది.మోహము దాసోహమయినది.

  ఇపుడునేను సవికల్పసమాధిస్థితికి అర్హత పొందానేమో.అందుకే నలుగురు తల్లులు నాచేత్రికోణ ప్రవేశమునుచేయించారు.

  అవిమూడుబిందువులుకావు.కరుణాసింధువులు.

 మహాకామేశ్వరి-మహావజ్రేశ్వరి-మహాభగమాలిని అని వారినికీర్తిస్తారట.

 ఎన్నో శక్తుల కలయికయే మహాశక్తియై మాయను తొలగిస్తుందట.

   ఎందుకో దేవీభాగవత కథ నా స్పురణకు వస్తోంది.

 ఒకవైపు భండాసురు మూర్ఖత్వముతో పరమేశ్వరితో యుద్ధానికి తలపడుతున్నాడు.

 అమ్మవారి అనుగ్రహముతో సహాయక శక్తులుగా ,

 ఏనుగుల సైన్యముతో సంపత్కరీ రూపముగా,అశ్వములసైన్యముతో దండనాథా రూపముగా,వారాహి రూపముగా ముగ్గురమ్మలువానిని సంస్కరిస్తున్నారు తమ ఆయుధములతో సాకుతున్నారో /తాకుతున్నారో తెలియటములేదు.


 నాలోని భండాసురుడు భయపడి ఎప్పుడో పారిపోయాడు.

  ఆముగురమ్మలు నన్ను సాదరముగా "సర్వానందమయ చక్రాప్రవేశమునకు సంసిద్ధుని చేస్తున్నారు.

     

   యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థితా

   నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః




   

   

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...