" అనంత సంసార సముద్రతార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం
వైరాగ్య సామారాజ్యద పూజనాభ్యాం
నమోనమః శ్రీ గురుపాదుకాభ్యాం."
"గు"కారో అంధకారస్య "రు" కారో తత్ నివారనం.
వృత్తాకారముగా సంకేతించబడినది మండలము.అనేకానేక గురువు స్వరూపప్రకాశముగా అజ్ఞాననమనే చీకటిని తొలగించి స్వస్వరూపమును దర్శింపచేయునది గురు పాదము.
పరమేశ్వరుడు ఆదిగురువు.పరమేశ్వరి ఆది శిష్యురాలు.వారు జగత్కళ్యానమునకై అనేకానేక నామరూపములతో గురు-శిష్యులుగా అజ్ఞానంధకారమును తొలగిస్తున్నారు.
ఈ జగత్ సత్యమునే "దేవీఖడ్గమాల స్తోత్రము" గురుమండలముగా కీర్తిస్తున్నది.
అంటే,
కేంద్రస్థానమైన బిందువును చేరాలంటే ఎన్నో వృత్తములను ఆవృతము చేయగలగాలి సాధకుడు.అది గురువు సహాయములేకుండా సాధ్యము కాదు.
దేవీ ఖడ్గమాల స్తోత్రము గురువులను,దైవ,సిద్ధ,మానవ అని మూడు విభాగములుగా కీర్తిస్తున్నది.
ఔఘ అన్నశబ్దము సమూహము సమూహమును సూచిస్తుంది.
సాక్షాత్తుగా పరమేశ్వరుడే ఆదిగురువై పార్వతిదేవి సందేహమును తీరుస్తున్నట్లు( చేతనులను ఉద్ధరించుటకై )
"కేనోపాయే లఘునావిష్ణోనామ సహస్రకం
పఠ్యతే? అని తల్లి సందేహమును వ్యక్తముచేయగానే,
"శ్రీరామ రామ రామేతి " అంటూ స్వామి సెలవిచ్చారుకదా.
శ్రీవిద్యోపాసన సంప్రదాయములో నాథ అని స్వామిని,మయి అని శక్తిని గౌరవిస్తూ,కీర్తిస్తుంటారు.
సాధారన సాధకుని ప్రయాణము ద్వైతభావముతో ప్రారంభమయి క్రమక్రమముగా అద్వైతసిద్ధిని పొందగలుగుతుంది.అది ఎప్పుడో,ఎక్కడో,ఏవిధముగానో గమనించగలుగు శక్తిమంతుడు కాడు సాధకుడు.కనుకనే,
దేశకాల అపరిచ్చిన్నమైన పరమాత్మ తాను అడుగు-అడుగున అనేకరూపములతో ఉండి,ఈ ఇతేర ప్రలోభములు దరిచేయనీయకుండా,సాధ్సకునికి మార్గబంధువవుతాడు.
" శూలాహతారాతి కూటం
శుద్ధమర్దేంద్రు చూడం
భజే మార్గబంధుం"
ఈగురుమండలం ఎక్కడ ఉంటుంది? అన్న సందేహమునకు సర్వానందమయచక్రములోని బిండువు,దాని చుట్టు ఉన్న త్రికోణముల మధ్య ప్రదేశమును గురుమందలముగా కీర్తిస్తారు/
యుగములు మారుట ఏ విధముగా సత్యమో యుగధర్మములు మారుట కూడా అంతే సత్యము.
సత్యము ప్రామాణికము-ధర్మము పరిణామక్రమము.
1.కృతయుగములో శివశక్తులే గురుశిష్యులుగా,
"చర్యానందమయీ" నామముతో కీర్తింపబడుచున్నవి.
2.త్రేతాయుగములో " ఉడ్డీశనందనాథ/మయి" గాను,
3.ద్వాపర యుగములో " సహ్ష్టీశనందమయి" గాను,
4.కలియుగములో "మిత్రేశనందమయిగాను" కీర్తింపబడుతున్నారు.
సక్తి ఉపాసన విధానములో క్రమముగా,
1.ఉపాదానము
2.విద్య
3.స్వాధ్యాయనము
4.సమాధి అను నాలుగు అవస్థలుంటాయి.
No comments:
Post a Comment