" తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై
అష్టాదశ మహాద్వీపాం సమ్రాడ్భోక్తా భవిష్యతి"
పూర్వభాగ పరిచయము
***********************
" లకారః పృథ్వీ బీజం తేనభూబింబముచ్యతే"
ఫ్పార్వతీ ల కారము ప్ర్ఠ్వీతత్త్వమునకు మూలబీజముగానున్నది.విశ్వములో త్రైలోకమోహన చక్రముగాను,జీవుల ఉపాథులలో మూలాధారచక్రముగాను అమరియున్నది.
విద్య-అవిద్యా స్వరూపిణి అయిన జగన్మాత ,
అవిద్య గా చేతనులలోను,విద్యా స్వరూపిణిగా ప్రకటయోగినులు-చక్రేశ్వరి గా విరాజిల్లుతు సాధకుని తమోగుణమును మాయా మలమును దూరము చేసి గమనమును సుగమము చేస్తున్నది.
" సర్వాశా పరిపూరక చక్రము"
*******************
అమ్మ అనుగ్రహముతో ఒక్క మెట్టు ఎక్కి రెండవ ప్రాంగనములోనికి ప్రవేశించిన సాధకుడు,వికసిస్తున్న పదహారు రేకులతో వృత్తాకారముగా నున్న ఆవరణములోనికి ప్రవేశించాడు.
విశ్వములో "సర్వాశా పరిపూరక చక్రము"అని ఉపాధిలో "మణిపూరక చక్రము అని పిలుస్తారట.
"షోడశ కళానిధికి షోడశోపచారములు" అను నాదము నినదిస్తుండగా,పదహారుగురు మాతృమూర్తులు సాధకుని సాదరముగా ఆహ్వానిస్తున్నారు.
వారిని "గుప్తయోగినులు" అని కీర్తిస్తారు.ఆకర్షణ శక్తులుగా భావిస్తారు.వారినే,
1.షోడశాక్షరీ మంత్రము యొక్క
2.షోడశ జాతకకర్మల యొక్క
3.షోడశ తిథుల యొక్క
సంకేతములుగా అర్థము చేసుకుంటారు.
అప్పటి వరకు చదును నేలపైనడిచిన సాధకుడు వృత్తాకారము చుట్టు అడుగులు వేయుటను అభ్యసిస్తున్నాడు.
ఇంతకీ అ ప్రదేశము జలమునకు ప్రాముఖ్యత వహించినది.
చంద్ర కళల వివరమును తెలుపుచున్న ఆ ప్రదేశమునకు చంద్రుడు ,వరుణుని అధిదేవతగా-శ్రీగౌరిని ప్రత్యధిదేవత గా కలిగిఉన్నాడు.
చంద్రమా మనసో జాతః అన్నట్లుగానే సాధకుని మనసులో చేరి ఆశ/కోరిక విచారణమును గావిస్తున్నాడు.
మనో బుద్ధ్యహంకారములు-శబ్ద-రూప-స్పర్శ-రస-గంధములను పంచమాత్రలు,సాధకుని చిత్తములోని అధైర్యమును పోగొట్టి,మనసులోని దేహాత్మ భావమును తొలగిస్తూ,పరబ్రహ్మ తత్త్వము పలుకరించునట్లు చేస్తున్నారు.
తమోగుణమను నిద్రను విడిచి స్వప్నావస్థలో నున్న సాధకుడు తనకోరికల గురించి ఆలోచిస్తున్నాడు.ఇది సర్వాశా పరిపూరకము.కాని సరియైన ఆశలు మాత్రమే సాఫల్యమును పొందుతాయి.
అసలు తనకోరికలకు కారణమేమిటి? ఏది కోరుకోవాలి?
మనసులో ఒక మెర్పు.ఆగామి సంచితములా?
పూర్వ జన్మలలో చేసిన పాప-పుణ్యములా
లేక
తదుపరి జన్మలలోనేననుభవించవలసిన ఫలితములా
నాలో ప్రవేశించి కోరికలుగా వెలువడునవి
బీజాకర్షిణి మాత సాధకుని దరిచేరి నా మనసులోని ఆశాపాశములను-దేహభ్రాంతిని తొలగించి వేస్తున్నది.
నావేఅనిపించే సుఖదుఃఖముల-బరువు బాధ్యతల మూటలు వానిని వీడి గుట్తలుగా పడియున్నాయి శరీరాకర్షిణి చల్లని దీవెనలతో.
బుద్ధ్యాకర్షిణి మాతనా దరిచేరగానే ఇన్నిరోజులు సాధకుని ఆడించిన ఇంద్రియములు వాని దరిచేరి ఆడించుటకు తడబడుచున్నాయి.మనసు సైతము తన ఒరవడిను మార్చుకుంటున్నది.రజోగుణమయితే చల్లగా జారుకున్నది.
నాలో గుప్తముగా జరుగుచున్న మార్పులను గమనిస్తూ,ఆ పదహారుగురు తల్లులు సాధకుని చక్రేశ్వరి అయిన "త్రిపురేశి" మాత దగ్గరకు తీసుకుని వెళ్లి పరిచయము చేశారు.ప్రణామములనందుకున్న తల్లి సాధకుని ఆశీర్వదించి,మరొక మెట్టు ఎక్కి,సర్వసంక్షోభణ చక్ర ప్రవేశార్హతను అనుగ్రహించింది.
కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.
No comments:
Post a Comment