Wednesday, September 4, 2024

TEACHERS DAY-2024

  ఏకములో  అనేకమే గురువు-పూజిద్దాము.

 ***************************************

శ్రీ గురుభ్యో నమ:

**************

భావి సౌభాగ్యమనే బలమైన సౌధమునకు

కీలకమైన మూలధనము మీరు

ఊపిరి అందిస్తున్న ఉపాధ్యాయులారా

ప్రవాసాంధ్ర ప్రకాశిత ప్రాభవ జ్యోతుల్లారా

వందనము- అభివందనము.

 అసతోమా సర్గమయా.

-------------------------

దేశాభివృద్ధి " నాది " అను బాధ్యత "పునాది" పై

ఆటు పోటు తట్టుకునే దీటుతనపు " ఇటుకలను" పేర్చి

ఈసు ఇసుమంతయు గానరాని ఇంగితపు "ఇసుక" చేర్చి

ఐకమత్యమే బలము అను సెంటిమెంటు " సిమెంటు " తో

వీడలేని దేశభక్తి" గోడలను" కట్టిస్తున్న

శాస్త్రములు అందిస్తున్న " మహనీయ మేస్త్రీలు"

వందనము- అభివందనము

 తమసోమా .జ్యోతిర్గమయా

-------------------------

కలకాలము కలపాలి అను భావపు "కలప"తో

మంచి తలపులనే తలుపులను,కిటుకులనే కిటికీలను

చెక్కు చెదరని ధైర్యమనే చెక్క పనిముట్లను

కుసంస్కారపు" చెద" చేరకూడదనే తలపుతో

చెక్క చక్కదనానికి చిత్రీలు పట్టిస్తున్న

చాకచక్యము అందించే " వదాన్యపు వడ్రంగులు "

వందనము-అభివందనము.

-మృత్యోర్మా  అమృతంగమయా.---------------------

ఆపాత మధురముగా పూజ్యభావము" కప్పు" కొనగా

లలిత కళా తోరణములను,సన్మానపు శాలువలను

లేతవైన మెదడులను, "జాతీయ పతాకను "

మాయా మర్మములు ఎరుగని" మానవతా-తాను" ను

" చిమటలు" కొట్టనీయకుండ చేతలు అనే దారముతో

నేతలను నేస్తున్న " చేనేత కళాకారులు " మీరు.

వందనం-అభివందనం.

-- నమోనమః శ్రీ గురుపాదుకాభ్యాం.-----------------

పసిమనసుల పసిడిని పుటము వేయు" కంసాలులు "

కాసేపు" కుమ్మరులు,"కాసేపు" కమ్మరులు", ,

అన్నీ మీరేనుభిన్నత్వపు బాటలలో " ఏకత్వము " చాటుతారు

ఏక కాల బోధనలో " అనేకము " సాధించగలరు


" ప్రతిభ " అభ్యున్నతి చెందిన ప్రతి ఒక "ఇతివృత్తములో "

     ప్రకాశిస్తుంటాడు " ప్రత్యక్షముగా గురువు "

    గురుపాదములపై లగ్నముచేయని మనసా!

     ఇప్పటికైనా మార్చుకో నీ పద్ధతి.

    

మనస్సే నలగ్నం గురోరంఘ్రిపద్మే-తత: కిం తత: కిం తత: కిం తత: కిం ????

********************************************************************

( శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి నివాళి.)


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...