Thursday, October 3, 2024

SREECHAKRADHARINI-02-SARVASAPARIPURAKA CHAKRAMU


 


 




 శ్రీచక్రధారిణి-02/సర్వాశాపరిపూరకచక్రము


 ***************************




  ' తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై


    అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"




   ఇప్పటి వరకు


   ************


 అణిమా సిద్ధిమాత+ సర్వ సంక్షోభిణి ముద్రామాత   నివాసమైన త్రైలోక్య మోహన చక్రములో "విశ్వన్" పేరుతో నున్న  సాధకుడు,


   జాగ్రదావస్థలో నుండి తన మనసునునిద్రాణము చేస్తూ,తన ఇంద్రియములను మెలకువలోనుంచుతూ అనేక పనులతో సతమతమవుతుంటాడు.అలిసిన స్థూల శరీరము విశ్రాంతిని కోరుకుంటూ తదుపరి పనుల బాధ్యతను సూక్ష్మశరీరమునకు అప్పగిస్తుంది తనతో పాటుగా తన ఇంద్రియములను సైతము నిద్రలోనికి జార్చుతు,రెండవ ఆవరణమైన సర్వాశా చక్రములోని ప్రవేశింపచేస్తుంది.


 ఇప్పుడు


 *****


 పరమేశ్వరుడు పార్వతీదేవికి ,


 " స కారః చంద్రమా భద్రే కళా షోడశమాత్మకం" అని


 చంద్రబీజమును కలిగి,షోడశకళలు షోడశదళ    పద్మముగా వృత్తాకారముగా నున్న ఆవరణము లోనికి "తైజసునిగా" తనపేరుని మార్చుకుని ప్రవేశిస్తాడు.


  స్తోత్రము


  *******


             శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః

కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,

   

    ఈ ఆవరణము పదహారు వికసిత పద్మరేకులు కలిగి వృత్తాకారములో ఉంటుంది.పదహారుగురు మాతలు ఆకర్షణ శక్తులుగా  పరిచయమవుతారు.ఆవరణము లఘిమా సిద్ధిమాతను-సర్వవిద్రావిణి శక్తి మాతను కలిగియుంటుంది.స కార బీజముతో సంకేతించబడుతుంది.జలమునకు నిలయమై చంద్రతత్త్వమును భావింపచేస్తుంది. స్వాధిష్టాన చక్ర ప్రదేశము జీవునిలో.             ఇక్కడ జీవుడు సూక్ష్మశరీరముతో స్వప్నావస్థలో ఉంటాడు.

  పదహారు వికసిత దళములు,

 1.చంద్రుని పదహారు కళలను/తిథులను

 2.అ-అః అను పదహారు అచ్చులను

 3షోడశోపచారములను

 4.షోడశ జాతక కర్మలను 

    సూచిస్తాయని అంటారు.

.


  పదహారు శక్తులను పంచభూతములు-పది ఇంద్రియములు మనసు గాను పరిగణిస్తారు.యోగినీ హృదయము పంచప్రాణములు-ఇంద్రియ దశకము -మనసుగా పేర్కొనినది.

  "సాధకుని మనసు శుభ్రపరచబడుట ఇక్కడు పరిణామము."


    సాధకుడు కామము-బుద్ధి-అహంకారము-శబ్దము-స్పర్శ-రూపము-రసము-గంధము-ధైర్యము-స్మృతి-నామము-బీజము-ఆత్మ-అమృతం-శరీరము అను పదహారు విబాగములతో ఉంటాడు.కాని అవి మాయ అనే ముసుగుతో కప్పివేయబడి అవిద్యా రూపములుగా ఉంటాయి.ఏది కోరుకావాలో,ఏది ఆలోచించాలో,దేనిని తనదిగా భావించాలో,దేనిని తాకాలో,దేనిని చూడాలో,దేని వాసన పీల్చాలో,దేనికి భయపడకుండా ఉండాలో,దేనిని స్మరిస్తుండాలో,ఏది తన ఉనికికి మూలమో,ఏది నిత్యచైతన్యమో,ఏది మరణించనిదో,ఏది శరీరమో తెలియని స్థితి లో ఉంటాడు.దేహమే ఆత్మ అని భావిస్తూ సరికాని,శాశ్వతము కాని,మరలమరల జనించే కోరికలను కోరుకుంటూ స్వల్పకాలము తృప్తిని పొందినప్పటికిని 

 అసంతృప్తితో   మాయాచట్రములో తిరుగుతుంటాడు.

.

  అమ్మ దయతో అవేనామములతో నున్న ఆకర్షణశక్తులు "గుప్త యోగినులు" ఆ పదహారు విభాగములను ధర్మబద్ధము చేస్తాయి.బుద్ధి ధర్మము వైపునకు మరల్చబడుతుంది.శబ్దము గా  ప్రణవమును వినిపిస్తుంది/పలికిస్తుంది.దానిరుచి శాశ్వతానందమయమన్న సత్యమును తెలియచేస్తుంది. కన్ను పరమాత్మ రూపమును చూపిస్తుంది.ముక్కు పరమాత్మ అనుగ్రహ పరిమళమును పీలుస్తుంది.జిహ్వ ఎంతో రుచి అంటూ నామామృతమూను సేవిస్తుంది.స్మృతి మరి మరి స్మరణము చేస్తుంది.మూలము అర్థమవుతుంది.దేహము వేరు అశాశ్వతము/ఆత్మవేరు శాశ్వతము అన్న విషయము అర్థమవుతుంటుంది.

  పదహారు నామములతో/స్వభావములతో ఎదురుబొదురుగా నున్న విద్యాశక్తుల కరుణ,అవిద్యను తొలగించి ముందుకు నడిపిస్తుంటుంది.వారి అనుగ్రహమే చక్రేశ్వరి అయిన త్రిపుర+ఈశిని దర్శించుకొని నమస్కర్రించుకొని,దీవెనలను పొంది మూడవ ఆవరణమైన "సర్వ సంక్షోభణ చక్ర" ప్రవేశ అర్హతను సాధకునికి కలిగిస్తుంది.


   అర్థము చేసుకున్నవా  రికి  అర్థము చేసుకున్నంత


 మనముచ్చట

  *******

 'చెడు అనవద్దు-చెడు కనవద్దు-చెడు వినవద్దు" అంటున్న మూడుకోతుల బొమ్మను ఒక్కసారి తలచుకోండి.

  మూటితో పాటుగా  ఇంకొక పదమూడింటిని కలుపుకుని పదహారు శక్తులను ఏ విధముగా ఉపయోగించుకోవాలో తెలియచేసే అమ్మ అనుగ్రహమే ఇది.ప్రాణాయామం అంటుంది దీనినే యోగశాస్త్రము.నిన్ను సంస్కరించుకోవటము నీ చేతుల్లోనేఉంది అని మనలో ఎరుకను కలుగచేస్తుంది.



     సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.





 


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...